రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నుల ముడి పట్టు ఉత్పత్తి
రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నుల ముడి పట్టు ఉత్పత్తి
Published Wed, Jan 11 2017 10:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
సెంట్రల్ శిల్క్ బోర్డు జేడీ సత్యనారాయణరాజు
గొల్లప్రోలు:(పిఠాపురం) : రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నులు ముడి పట్టు ఉత్పత్తి జరుగుతోందని అనంతపురం జిల్లా రీజనల్ సెరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (సెంట్రల్ శిల్క్ బోర్డు) జాయింట్ డైరెక్టర్ చిన్నే సత్యనారాయణరాజు తెలిపారు. చేబ్రోలు పట్టు పరిశోధనా విస్తరణ కేంద్రంలో పట్టు రైతు క్షేత్ర దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆధునిక శాస్త్రసాంకేతిక పద్ధతులను వివరించారు. మల్బరీ తోటలకు తుక్రా, ఆకుముడుత, రసం పీల్చు పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటి నివారణకు రసాయన పురుగు మందులు కంటే జీవనియంత్రణ పద్ధతులు పాటించడం మంచిదన్నారు. వేరుకంతి నివారణకు నీమాహరి అనే కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చిట్టు తెలిపారు. జీ-4 అనే కొత్త మల్బరీ వంగడాన్ని రూపొందించామని, ఇది వీ-1 రకం మాదిరిగా మంచి దిగుబడినిస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ సారి పట్టుగూళ్ల దిగుబడి సరాసరి 60 నుంచి 65 శాతం పెరిగిందని చెప్పారు.ఽ శాస్త్రవేత్త శ్రీనివాసరావు పట్టు పురుగులకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులను వివరించారు. 50 శాతం సబ్సిడీపై రైతులకు నేత్రికలు, వేప పిండి అందజేస్తున్నామని డీడీ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌బీ శాస్త్రవేత్త కె.అశోక్‌కుమార్, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ కోనేటి అప్పారావు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement