tons
-
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలల్ల
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ముగిసేనాటికి కొంతమంది ప్రజలకు చొక్కాల గుండీలు పట్టవని, ఇళ్ల ద్వారాల నుంచి బయటకు రావటం కూడా కష్టమని.. సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. తినడం.. కూర్చోవటం.. తినడం.. పడుకోవటం.. ఇదే ప్రధాన దినచర్య కావడంతో అమాంతం పొట్టలు పెరుగుతాయన్నది వాటి సారాంశం. జోకుల సంగతేమోగానీ.. ప్రజలు చిరుతిళ్లు మాత్రం బాగానే లాగించేశారు. ఎంతగా అంటే.. లాక్డౌన్ సమయంలో ఏకంగా దాదాపు 13 వేల టన్నుల మంచినూనె అదనంగా వినియోగించారు. లాక్‌డౌన్‌తో కొన్ని రంగాలు నష్టపోయినా, నూనె పరిశ్రమ మాత్రం గృహావసరాలకు సంబంధించి అదనపు అమ్మకాలతో కులాసాగా ఉంది. లాక్డౌన్ వేళ ఇళ్లకే పరిమితమైన జనం చిరుతిండిపై దృష్టి పెట్టడంతో అంతమేర అదనంగా నూనె ఖర్చయిపోయింది. ఓ దశలో డిమాండ్‌ను మంచినూనె కంపెనీలు అందుకోలేకపోయాయి. మామూలుగా వినియోగమయ్యే నూనె వాడకంకంటే దాదాపు 25 శాతం అదనంగా వాడినట్టు ఆయిల్ కంపెనీలు లెక్కలు తేలుస్తున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ సడలింపులతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావటంతో అదనపు వినియోగానికి బ్రేక్ పడింది. సాధారణంగా ఎండాకాలం తీవ్రత అధికంగా ఉండే మే నెలలో మంచినూనె వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ ఈనెల తొలివారంలో వినియోగం చాలా ఎక్కువగా నమోదైంది. ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకోవటంతో నూనె కంపెనీలు తేరుకున్నాయి. వాణిజ్య వినియోగం 80 శాతం తగ్గుదల.. సాధారణంగా మంచి నూనె వినియోగాన్ని కంపెనీలు మూడు రకాలుగా విభజిస్తాయి. పారిశ్రామిక అవసరాలైన బిస్కెట్లు, చాక్లెట్స్, ఐస్‌క్రీం తయారీదారులకు ముడి నూనెను అందిస్తాయి. లాక్డౌన్ సమయంలో పరిశ్రమలు కొంతకాలం పూర్తిగా నిలిచిపోవటంతో ఈ నూనె వాడకం కూడా బాగా తగ్గిపోయింది. ఒక దశలో వాణిజ్య వినియోగం ఏకంగా 80 శాతం పడిపోయింది. ఆ తర్వాత పరిశ్రమలకు అవకాశం కల్పించటంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలకు సరఫరా చేసే నూనెను వాణిజ్య కేటగిరీ కింద పరిగణిస్తారు. జనతా కర్ఫ్యూ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసే ఉండటంతో ఆ నూనె వినియోగం పూర్తిగా నిలిచిపోయింది. టేక్ అవేకు అనుమతిచ్చిన కారణంగా కేవలం 20 శాతం వినియోగం మాత్రమే జరిగినట్టు గుర్తించారు. వలస కూలీలు లేక కొత్త చిక్కులు.. లాక్డౌన్ నేపథ్యంలో లక్షల సంఖ్యలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవటంతో మంచినూనె తయారీకి ఇబ్బందులు వచ్చిపడ్డాయి. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా నూనెను మార్కెట్‌కు తరలించటంలో కొంత ఇబ్బంది తప్పేలా కనిపించటం లేదు. మంచినూనె తయారీకి సంబంధించి రిఫైనరీలో పెద్దగా వలస కూలీల అవసరం ఉండదు. కానీ ప్యాకింగ్, మార్కెట్‌కు సరఫరాలో వారి అవసరం ఉంది. ప్యాకింగ్ కార్మికుల్లో 30 శాతం వలస కూలీలే. ఇప్పుడు వారు పెద్ద సంఖ్యలో సొంత ప్రాంతాలకు వెళ్లటంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో దుకాణాలకు మంచినూనె సరఫరాకు కొంత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, సాధారణ దుకాణాల్లో అన్ని ప్రధాన బ్రాండ్ల నూనె అందుబాటులో ఉంటోంది. లాక్డౌన్ సమయంలో కొన్ని బ్రాండ్లు అసలే కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి మామూలుగానే ఉంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు కొన్ని రకాల బ్రాండ్లు కనిపించలేదు. మార్కెట్లకు రావటానికి ఉన్న ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవటం ఒక కారణమైతే, కొన్ని చోట్ల నేతలు పెద్ద మొత్తంలో సొంతంగా స్టాక్ ఏర్పాటు చేసుకోవటం మరో కారణం. నిరుపేదలకు భోజన వసతి కల్పించటం, వారికి నిత్యావసరాల పంపిణీ కోసం చాలామంది నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో నూనె సమకూర్చుకోవటం కూడా కొరతకు కారణమైందని కంపెనీలు చెబుతున్నాయి. కొరత రానీయం.. కరోనా భయం అవసరం లేదు ‘‘లాక్డౌన్ సమయంలో గృహావసరాలకు మంచినూనె వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చాయి. మళ్లీ జనం మార్కెట్లకు వస్తున్నారు. కానీ కరోనా నేపథ్యంలో కొన్ని వస్తువుల విషయంలో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంచి నూనె విషయంలో మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిఫైనరీలు, ప్యాకింగ్, మార్కెట్లకు సరఫరా.. అన్ని చోట్లా సిబ్బంది పూర్తిగా కరోనా నిబంధనలు అనుసరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన పదార్థం అయినందున అత్యంత హైజనిక్‌గా వ్యవహరిస్తున్నాం. డిమాండ్‌కు సరిపడా మంచినూనెను సిద్ధంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వలస కూలీల రూపంలో కొత్త సమస్య వచ్చిపడినా, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ – పి.చంద్రశేఖరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫ్రీడం ఆయిల్ -
రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నుల ముడి పట్టు ఉత్పత్తి
సెంట్రల్ శిల్క్ బోర్డు జేడీ సత్యనారాయణరాజు గొల్లప్రోలు:(పిఠాపురం) : రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నులు ముడి పట్టు ఉత్పత్తి జరుగుతోందని అనంతపురం జిల్లా రీజనల్ సెరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (సెంట్రల్ శిల్క్ బోర్డు) జాయింట్ డైరెక్టర్ చిన్నే సత్యనారాయణరాజు తెలిపారు. చేబ్రోలు పట్టు పరిశోధనా విస్తరణ కేంద్రంలో పట్టు రైతు క్షేత్ర దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆధునిక శాస్త్రసాంకేతిక పద్ధతులను వివరించారు. మల్బరీ తోటలకు తుక్రా, ఆకుముడుత, రసం పీల్చు పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటి నివారణకు రసాయన పురుగు మందులు కంటే జీవనియంత్రణ పద్ధతులు పాటించడం మంచిదన్నారు. వేరుకంతి నివారణకు నీమాహరి అనే కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చిట్టు తెలిపారు. జీ-4 అనే కొత్త మల్బరీ వంగడాన్ని రూపొందించామని, ఇది వీ-1 రకం మాదిరిగా మంచి దిగుబడినిస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ సారి పట్టుగూళ్ల దిగుబడి సరాసరి 60 నుంచి 65 శాతం పెరిగిందని చెప్పారు.ఽ శాస్త్రవేత్త శ్రీనివాసరావు పట్టు పురుగులకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులను వివరించారు. 50 శాతం సబ్సిడీపై రైతులకు నేత్రికలు, వేప పిండి అందజేస్తున్నామని డీడీ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్బీ శాస్త్రవేత్త కె.అశోక్‌కుమార్, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ కోనేటి అప్పారావు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
పదేళ్లలో వరి లక్ష్యం 200 మిలియన్ టన్నులు
వ్యవసాయ పరిశోధనా మండలి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో వరి ఉత్పత్తిని 150 నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్‌కుమార్ దత్తా తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ డెరైక్టరేట్ ఆఫ్ సీడ్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఐసీఏఆర్ సీడ్ ప్రాజెక్టు తొమ్మిదో వార్షిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వపన్‌కుమార్ దత్తా మాట్లాడుతూ ఈ పదేళ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని 30 నుంచి 35 మిలియన్ టన్నులకు పెంచడానికి అవకాశాలున్నాయని, గోధుమను 95 నుంచి 110 మిలియన్ టన్నులకు పెంచేందుకు కృషి జరుగుతోందని వివరించారు. దేశంలో సాగ వుతోన్న ప్రధాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని కోరారు. వంగడాలపై విరివిగా ప్రచారం వివిధ రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలిల నుంచి విడుదలయ్యే వంగడాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రచారం కల్పించేందుకు ఐసీఏఆర్ ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ డాక్టర్ పద్మరాజు సూచించారు.