వ్యవసాయ పరిశోధనా మండలి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో వరి ఉత్పత్తిని 150 నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్‌కుమార్ దత్తా తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ డెరైక్టరేట్ ఆఫ్ సీడ్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఐసీఏఆర్ సీడ్ ప్రాజెక్టు తొమ్మిదో వార్షిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వపన్‌కుమార్ దత్తా మాట్లాడుతూ ఈ పదేళ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని 30 నుంచి 35 మిలియన్ టన్నులకు పెంచడానికి అవకాశాలున్నాయని, గోధుమను 95 నుంచి 110 మిలియన్ టన్నులకు పెంచేందుకు కృషి జరుగుతోందని వివరించారు. దేశంలో సాగ వుతోన్న ప్రధాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని కోరారు.
వంగడాలపై విరివిగా ప్రచారం
వివిధ రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలిల నుంచి విడుదలయ్యే వంగడాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రచారం కల్పించేందుకు ఐసీఏఆర్ ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ డాక్టర్ పద్మరాజు సూచించారు.
పదేళ్లలో వరి లక్ష్యం 200 మిలియన్ టన్నులు
Published Tue, Sep 23 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement