మాట్లాడుతున్న జేసీ దివ్య
- జేసీ డి.దివ్య
ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ సీజన్‌లో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య పేర్కొన్నారు. శనివారం పౌరసరఫరా శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వరి సాధారణ సాగు 1,25,990 హెక్టార్లకు గాను ప్రస్తుతం 69,185 హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు ఉన్నట్లు చెప్పారు. వరి విస్తీర్ణం ఆధారంగా 3,59,762 మెట్రిక్ టన్నుల రావచ్చునని అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇందులో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 32 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్‌లో ఐకేపీ 20, పీఏసీఎస్ 95, జీసీసీ 37, ఐటీడీఏ 47 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సత్యవాణి, డీఎస్‌ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.