producing
-
నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి సెట్ వేస్తే ఆ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు కూల్చేశారు...
-
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా. -
2022లో ఆరు సినిమాలు విడుదల చేస్తాను: నిర్మాత రాజశేఖర్ రెడ్డి
సినిమా పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకుండా విజయం సాధించడం చాలా కష్టం..అలాంటి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా ఉన్న నేను ముందుగా పరిశ్రమలో అనుభవం సంపాదించటానికి 2012లో ‘‘ప్రేమలో పడితే’’ చిత్రంతో కో–ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను అన్నారు శ్రీ షిరిడీ సాయి మూవీస్’’ అధినేత రాజశేఖర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ..2012లోనే విజయ్ ఆంటోనినీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్ధేశ్యంతో ‘నకిలీ’ చిత్రాన్ని విడుదల చేశాను. ఆ తర్వాత ‘శైవం’,‘శ్రీధర్’, ‘త్రిపుర’,‘కేరాఫ్ కాదల్’ చిత్రాలను నిర్మించాను. అయితే 2022లో మాత్రం ఒకేసారి ఆరు సినిమాలను విడుదల చేయబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆరు సినిమాలు కూడా పెద్ద టెక్నీషియన్స్ గొప్ప నటీనటులతో చేయటం నాలాంటి నిర్మాతలకు చాలా పెద్ద విషయం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్’, విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జ్వాల’, విశ్వక్సేన్ ముఖ్యపాత్రలో నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించిన చిత్రం ‘అక్టోబర్ 31’, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలో నవీన్‌చంద్ర, మేఘా ఆకాశ్ నటిస్తోన్న ఇంకా పేరు పెట్టని చిత్రం, తమిళ కమెడియన్ యోగిబాబు హీరోగా మరో చిత్రాన్ని 2022లో విడుదల చేస్తాను. వచ్చే ఏడాది నా కెరీర్లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పాలి. కారణం ఏంటంటే బాలీవుడ్, టాలీవుడ్ ఆర్టిస్ట్‌లతో ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించనున్నాను. నా పదేళ్ల కెరీర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు నిర్మించాను. ఇలాగే సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. -
నా బ్రాండ్ రెడ్‌ట్రీ
ట్రెండ్‌కు తగ్గట్టు పని చేస్తే ట్రెండింగ్‌లో ఉంటారు, ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటారు. దాన్ని అక్షరాలా నిజం చేస్తూ కరోనా టైమ్‌లో రెడ్‌ట్రీ అనే బ్రాండ్‌తో మాస్క్‌లను తయారు చేస్తున్నారు ప్రముఖ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి లావణ్యా మాట్లాడుతూ –‘‘మాస్క్‌లు తయారు చేయాలనుకోవడం వెనక నాకెలాంటి లాభాపేక్ష లేదు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనితారెడ్డి సహకారంతో మాస్క్‌లను రెడీ చేశాం. లాక్డౌన్ టైమ్‌లో మా టైలర్స్‌కి, మాస్టర్స్‌కి పెయిడ్ హాలిడేస్ ఇచ్చాం. పనిలేక బోర్ కొడుతోంది, ఏదైనా పని చెప్పండి అన్నారు. అందుకని బాగా ఆలోచించి ఖాళీగా ఉండటం ఎందుకు, మంచి క్వాలిటీతో మాస్క్‌లు చేయండని చెప్పాను. అలా తయారు చేసిన మాస్క్‌లను ఇండస్ట్రీలోని అందరికీ ఇవ్వాలనుకున్నాం. అందుకే ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ స్టార్ట్ చేశాను. మాస్క్‌లు బావున్నాయని అందరూ అన్నారు. భవిష్యత్తులో నేను, అనిత ఈ బ్రాండ్‌పై అనేక ఉత్పత్తులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
అతడు గొర్రెతో బయలుదేరాడు!
ఎన్టీఆర్ సొంతగా నిర్మించి నటించి నవ్వులు పూయించి సినిమా ఇది. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... భోజనాలు చేస్తున్నారు.చేస్తూనే కొడుకు వైపు తిరిగి మెల్లిగా గొంతు విప్పాడు తండ్రి...‘‘ఒరే అయ్యా! మన పరిస్తితులు నీకు తెలుసుగదరా. గొర్రె ఎంత ఎదిగినా తోక బెత్తెడే అన్నట్లు ఎన్నాళ్లు సేద్యం చేసినా అప్పులేగానీ నాలుగు రాళ్లు ఎనుకేసుకోవడం లేదు. అక్కడ మనం నమ్మకంగా ఉంటే జమిందారుగారే ఏదో ఒక సహాయం చేయకపోరు’’అవును అన్నట్లుగానీ, కాదు అన్నట్లుగానీ ఏ భావం ప్రదర్శించకుండా తినడంలో నిమగ్నమయ్యాడు కొడుకు. అతడి ముఖంలో పసితనం, అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఆ అమాయకుడి అమ్మ మాత్రం కొడుకును బస్తీకి పంపించడానికి, జమిందారుగారి ఇంట్లో నౌకరీ చేయించడానికిగానీ ససేమిరా అంటుంది.భార్యాభర్తల వాదులాట తరువాత చివరికి ఆ స్వాతిముత్యం ‘‘అలాగే అయ్యా! నేను బస్తీకి వెళతాను’’ అన్నాడు.‘‘భీముడూ మనం బస్తీకి వెళ్లాలి’’ అంటూ తన ప్రియమైన గొర్రెను కూడా తోడుగా తీసుకువెళుతుంటే...‘‘అది ఎందుకురా?’’ ఆశ్చర్యంగా అడిగాడు అయ్య.‘‘నన్ను చూడనిదే అది ఉండదు’’ అన్నాడు తన గొర్రె వైపు ఆప్యాయంగా చూస్తూ.‘‘దాన్ని చూడకుండా వీడు ఉండలేడు’’ అని నవ్వింది అమ్మ.అందరూ నవ్వుకున్నారు. ఆ పల్లెటూరి పిల్లగాడు తన భీముడితో బస్తీ బయలుదేరాడు. వాళ్లను వీళ్లనూ ఆనవాళ్లు అడుగుతూ ఏమైతేనేం జమిందారు ఇంటిముందుకు వచ్చాడు కుర్రాడు.గేటు ముందు గూర్ఖ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.అతడిని లేపి...‘‘ఏమయ్యోయ్... ఏమయ్యోయ్... జమిందారుగారి ఇల్లు ఇదేనా?’’ అడిగాడు.బంగారంలాంటి నిద్రను పాడు చేశాడనే కోపంతో...‘‘ఆ..ఆ...జావో జావో’’ అని విసుక్కున్నాడు గూర్ఖ.‘‘జావా? జావా ఏంది?’’ హిందీ ముక్కలు అర్థం కాని పల్లె యువకుడు నోరెళ్లబెట్టాడు.గుర్ఖా వాలకం చూస్తే తనను ఆ ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేలా లేడు. అందుకే...ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఆ ఇంట్లోకి దొంగతనంగా దూరాడు బుల్లోడు.‘‘వామ్మో! ఏంది ఈ అమ్మాయి అరకొర బట్టలేసుకొని బయట నిలబడింది. ఎవరన్న చూస్తే! ఏం బస్తో ఏందో’’ అనుకొని ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు.కొద్దినిమిషాల్లోనే ఆమె మనిషి కాదని పాలరాతి విగ్రహమని తెలిసి బోలెడు ఆశ్చర్యపోయాడు బుల్లోడు. నాలుగు అడుగులు ముందుకు వేశాడు.మరో బొమ్మ కనిపించింది.కూర్చున్నట్లుగా ఉంది.‘‘ఏంటబ్బా ఇది! ఈ ఇంటినిండా బొమ్మలేగాని మనుషులే లేరు’’ అనుకున్నాడు.ఆమె లేచి నిల్చుందిబుల్లోడికి ఒకటే ఆశ్చర్యం.‘‘ఓర్నీ...నువ్వు మనిషివన్నమాట...హాహాహా’’ అని నవ్వడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఒక కాగితం ఆమె చేతికి ఇచ్చి...‘‘ఇదిగో అంతా ఇందులో ఉంది. తెలిసిందా?’’ అన్నాడు.‘తెలియదు’ అన్నట్లుగా తల ఊపింది ఆమె.‘‘తెల్వదా? చదువురాదా?’’ అడిగాడు.‘‘రాదు’’ అన్నట్లుగా తల ఊపింది. బుల్లోడు వెరీ వెరీ డిజప్పాయింటెడ్.‘‘ఆ భగవంతుడు నిన్ను బొమ్మగా చేసినా బాగుండు. ఏంటో మరి... ఈ బస్తీలో మనుషులెవరో, బొమ్మలెవరో తెలవడం లేదు’’ అన్నాడు అయోమయంగా.ఈలోపు..‘‘ఆవో...ఆవో’’ అంటూ గూర్ఖా పరుగెత్తుకు వచ్చి కుర్రాడిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.‘‘ఆగెహె...ఆవు లేదు దూడ లేదు. నీకంటే ఆవు నయం’’ అని కోపగించుకున్నాడు బుల్లోడు.ఈ గడబిడ విని పరుగెత్తుకు వచ్చిన రాణిగారు...‘‘ఏమిటిదంతా... ఎవరివయ్యా నువ్వు?’’ అని బుల్లోడి వైపు చూస్తు అరిచింది.‘‘దండాలమ్మగోరూ...మా రంగయ్య మామ పంపితే వచ్చాను’’ విషయం చెప్పాడు బుల్లోడు.ఈలోపు అక్కడికి భూపాల్రావుగారు వచ్చారు. రంగయ్య పంపించాడని ఉత్తరం ద్వారా తెలుసుకొని ‘‘అరే నువ్వా!’’ అన్నాడు శాంతంగా.ఆ పెద్దావిడ వైపు తిరిగి...‘‘మనకు పనిమనిషి కావాలని కబురు చేశాను. రంగయ్య ఇతడిని పంపించాడు’’ అని వివరించాడు.‘‘అరే! అసలు అయ్యగారివి నువ్వేనాండీ...భలేవాడిని పట్టానే’’ అనే సంబరపడిపోయాడు బుల్లోడు.సంబరం తరువాత ‘‘నేను నానా యాతన పడి ఇక్కడికి వస్తే...బయటికి పొమ్మంటున్నారు చూడండి’’ అని భూపాల్రావుగారికి ఫిర్యాదు చేశాడు.‘‘ఇతని వేషం అది చూస్తే పనిచేసే రకంలా లేడే’’ అని పరాచికంగా అంది రాణిగారు.బుల్లోడికి రోషం వచ్చేసింది.‘‘ఏవండోయ్ అమ్మగారూ...నాతో సమానంగా పని చేసేవాడు మా ఊళ్లోనే లేడు. ఏమనుకున్నారో ఏమో’’ అన్నాడు.ఇంట్లో వాళ్లందరినీ బుల్లోడికి పరిచయం చేశారు భూపాలరావుగారు.‘‘పొద్దున్నే లేవాలి... మొక్కలకు నీళ్లు పోయాలి.... మేడంతా శుభ్రం చేయాలి. చిన్నయ్యగారికి కాఫీ, పేపర్ ఇవ్వాలి’’ లీస్టు చదువుకుంటూ పోతుంది పనమ్మాయి కాంతం.‘లేదురా సిరిసంపదలలో లేశమైన సంతసం’ దూరంగా తత్వం వినబడుతుంది. -
రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నుల ముడి పట్టు ఉత్పత్తి
సెంట్రల్ శిల్క్ బోర్డు జేడీ సత్యనారాయణరాజు గొల్లప్రోలు:(పిఠాపురం) : రాష్ట్రంలో 1500 మెట్రిక్ టన్నులు ముడి పట్టు ఉత్పత్తి జరుగుతోందని అనంతపురం జిల్లా రీజనల్ సెరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (సెంట్రల్ శిల్క్ బోర్డు) జాయింట్ డైరెక్టర్ చిన్నే సత్యనారాయణరాజు తెలిపారు. చేబ్రోలు పట్టు పరిశోధనా విస్తరణ కేంద్రంలో పట్టు రైతు క్షేత్ర దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆధునిక శాస్త్రసాంకేతిక పద్ధతులను వివరించారు. మల్బరీ తోటలకు తుక్రా, ఆకుముడుత, రసం పీల్చు పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటి నివారణకు రసాయన పురుగు మందులు కంటే జీవనియంత్రణ పద్ధతులు పాటించడం మంచిదన్నారు. వేరుకంతి నివారణకు నీమాహరి అనే కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చిట్టు తెలిపారు. జీ-4 అనే కొత్త మల్బరీ వంగడాన్ని రూపొందించామని, ఇది వీ-1 రకం మాదిరిగా మంచి దిగుబడినిస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ సారి పట్టుగూళ్ల దిగుబడి సరాసరి 60 నుంచి 65 శాతం పెరిగిందని చెప్పారు.ఽ శాస్త్రవేత్త శ్రీనివాసరావు పట్టు పురుగులకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులను వివరించారు. 50 శాతం సబ్సిడీపై రైతులకు నేత్రికలు, వేప పిండి అందజేస్తున్నామని డీడీ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్బీ శాస్త్రవేత్త కె.అశోక్‌కుమార్, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ కోనేటి అప్పారావు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే. -
2 టర్బైన్లతో విద్యుదుత్పత్తి
జూరాల : కర్ణాటక రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు ఆదివారం 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.09టీఎంసీలుగా ఉంది. పై నుంచి వస్తున్న వరదను ప్రాజెక్టులోని జలవిద్యు™Œ కేంద్రంలో రెండు టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ నుంచి భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. 24,420క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా 25వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 123.08టీఎంసీలు ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.46టీఎంసీలు కొనసాగిస్తున్నారు. పై నుంచి 23,251క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టులో రెండు క్రస్టుగేట్లను 0.60మీటర్లు ఎత్తి విద్యుదుత్పత్తి చేసి 12,960క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. -
నిర్మాతగా ఘంటాడి కృష్ణ
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ నిర్మాతగా మారారు. యాక్షన్ కట్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘6టీన్స్-2’ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు ఘంటాడి కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సినిమాల జయాపజయాలు టెక్నీషియన్స్‌పై ప్రభావం చూపుతాయి. నేను చేసిన పాటలు బాగున్నా... నా సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల కాస్త వెనుకబడ్డ మాట నిజం. త్వరలో నేను మొదలు పెట్టబోతున్న నా సొంత సినిమాలో అలనాటి ప్రముఖ హీరోయిన్ తనయుడు హీరోగా నటిస్తాడు. ఇదిలావుంటే... కోడి రామకృష్ణ దర్శకత్వంలో నేను సంగీతం అందించిన ‘అవతారం’ చిత్రం త్వరలో రానుంది. అలాగే ఓ ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రానికి సంగీతం అందించబోతున్నాను’’ అని తెలిపారు ఘంటాడి కృష్ణ.