2 టర్బైన్లతో విద్యుదుత్పత్తి
Published Sun, Aug 21 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
జూరాల : కర్ణాటక రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు ఆదివారం 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.09టీఎంసీలుగా ఉంది. పై నుంచి వస్తున్న వరదను ప్రాజెక్టులోని జలవిద్యు™Œ కేంద్రంలో రెండు టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
జూరాల రిజర్వాయర్ నుంచి భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. 24,420క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా 25వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 123.08టీఎంసీలు ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.46టీఎంసీలు కొనసాగిస్తున్నారు. పై నుంచి 23,251క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టులో రెండు క్రస్టుగేట్లను 0.60మీటర్లు ఎత్తి విద్యుదుత్పత్తి చేసి 12,960క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.
Advertisement