Producer Rajasekhar Reddy Announces He Will Release Six Films In 2022- Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నా: నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి

Published Mon, Dec 13 2021 3:58 PM | Last Updated on Mon, Dec 13 2021 4:45 PM

Producer Rajasekhar Reddy Announces He Will Release Six Films In 2022 - Sakshi

సినిమా పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకుండా విజయం సాధించడం చాలా కష్టం..అలాంటి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న నేను ముందుగా పరిశ్రమలో అనుభవం సంపాదించటానికి 2012లో ‘‘ప్రేమలో పడితే’’ చిత్రంతో కో–ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను అన్నారు శ్రీ షిరిడీ సాయి మూవీస్‌’’ అధినేత రాజశేఖర్‌ రెడ్డి. ఆయన మాట్లాడుతూ..2012లోనే విజయ్‌ ఆంటోనినీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్ధేశ్యంతో ‘నకిలీ’ చిత్రాన్ని విడుదల చేశాను. ఆ తర్వాత ‘శైవం’,‘శ్రీధర్‌’,  ‘త్రిపుర’,‘కేరాఫ్‌ కాదల్‌’ చిత్రాలను నిర్మించాను.

అయితే 2022లో మాత్రం ఒకేసారి ఆరు సినిమాలను విడుదల చేయబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆరు సినిమాలు కూడా పెద్ద టెక్నీషియన్స్‌ గొప్ప నటీనటులతో చేయటం నాలాంటి నిర్మాతలకు చాలా పెద్ద విషయం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్‌’, విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  ‘జ్వాల’, విశ్వక్‌సేన్‌ ముఖ్యపాత్రలో నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించిన చిత్రం ‘అక్టోబర్‌ 31’, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలో నవీన్‌చంద్ర, మేఘా ఆకాశ్‌ నటిస్తోన్న ఇంకా పేరు పెట్టని చిత్రం, తమిళ కమెడియన్‌ యోగిబాబు హీరోగా మరో చిత్రాన్ని 2022లో విడుదల చేస్తాను.

వచ్చే ఏడాది నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఇయర్‌గా చెప్పాలి. కారణం ఏంటంటే బాలీవుడ్, టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌లతో ఓ పాన్‌ ఇండియా సినిమాను నిర్మించనున్నాను. నా పదేళ్ల కెరీర్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాలు నిర్మించాను. ఇలాగే సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement