మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ కరెక్టేనా?.. యంగ్ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌! | Tollywood Hero Kiran Abbavaram Latest Movie Ka Teaser Released | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: మీకు పాన్ ఇండియా స్థాయి ఎంతవరకు కరెక్ట్‌?: కిరణ్ అబ్బవరం అదిరిపోయే రిప్లై!

Published Mon, Jul 15 2024 5:00 PM | Last Updated on Mon, Jul 15 2024 5:51 PM

Tollywood Hero Kiran Abbavaram Latest Movie Ka Teaser Released

‘రాజావారు రాణిగారు’మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో కిరణ్‌ ‍అబ్బవరం. 2019లో విడుదలైన ఈ రొమాంటిక్‌ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో  రహస్య గోరఖ్ హీరోయిన్‌గా నటించారు. గతేడాది మీటర్, రూల్స్ రంజన్‌ చిత్రాలతో అలరించిన కిరణ్ ప్రస్తుతం క అనే మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సుజీత్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ కిరణ్ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా క మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఓ మీడియా ‍ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న వేశాడు. తెలుగులో మీకు పెద్ద సక్సెస్‌ రాలేదు.. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మూవీని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్‌? అని ప్రశ్నించారు.

దీనికి కిరణ్ స్పందిస్తూ.. 'నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్ మాత్రమే.. మొన్న వచ్చిన మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ను మనం పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? అంతే కాదు కాంతార సినిమాకు ముందు రిషబ్ శెట్టి గురించి మనకు తెలుసా? ఇక్కడ ఫైనల్‌గా స్థాయి అంటే కంటెంట్‌ మాత్రమే సార్.  నా స్థాయి పెద్దదా? చిన్నదా? అనేది నెక్ట్స్‌? మనం సినిమాలో కంటెంట్‌కు స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్. క అనే సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నా. కంటెంట్ ఉంటే సినిమాను మీరందరూ ఎక్కడికో తీసుకెళ్తారు. అందుకే ఇతర భాషల్లోనూ తీసుకొస్తున్నాం' అని అన్నారు. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ అతనికి గట్టిగానే ఇచ్చిపడేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement