స్టార్‌ హీరోతో పాన్‌ ఇండియా సినిమా.. ఛాన్స్‌ కొట్టేసిన శ్రీముఖి | Sreemukhi Gets Chance In Pan India Movie | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో పాన్‌ ఇండియా సినిమా.. ఛాన్స్‌ కొట్టేసిన శ్రీముఖి

Published Sat, Apr 6 2024 9:55 AM | Last Updated on Sat, Apr 6 2024 10:02 AM

Sreemukhi Get Pan India Movie Chance - Sakshi

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంటూనే.. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా శ్రీముఖి మెరిపిస్తుంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్ పెట్టేసిందని వార్తలు వస్తున్నాయి.  పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుందని ప్రస్తుతం   ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ ఇండియా ​ రేంజ్‌లో ఒక సినిమా రాబోతుందని అది కూడా ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వస్తుందని ఈ మధ్య జోరుగు ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో  బన్నీకి చెల్లెలుగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది.  

మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో కూడా  శ్రీముఖి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండీ డ్రెస్‌లతో ఫోజులు ఇస్తే కుర్రకారులో హీట్‌ పెంచుతుంది. కొద్దిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖికి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని వార్తలు వస్తే.. అలాంటి వాటికి చెక్ పెడుతూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement