‘పత్తి’పై స్పష్టతేది!
Published Thu, Sep 29 2016 11:46 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
మద్దతు ధరపై ప్రస్తావనే కరువు
కొనుగోళ్లు ప్రారంభమెప్పుడో చెప్పనేలేదు
కొలిక్కిరాని ‘పత్తికి ఈ-నామ్’ అమలు అంశం
పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం తీరిదీ..
మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలకు రూ.8 కోట్లు
ఆదిలాబాద్ అర్బన్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, మార్కెట్ యార్డుల ద్వారా పత్తి కొనుగోళ్ల ప్రారంభం ఎప్పుడో తేల్చడం వంటి వాటిపై స్పష్టత ఇవ్వకుండానే అఖిలపక్ష సమావేశం ముగిసింది. రైతులు పత్తి ని అమ్మడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి సలహాలు, సూచనలు, మార్కెట్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, పత్తికి ఈ-నామ్ అమలుకు ఏం చర్యలు తీసుకోవాలి.. కొనుగోళ్లు ఎప్పుడనేది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సి ఉంది. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ మంత్రి రామన్న అధ్యక్షతన పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్ ఈ ఏ డాది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(ఈ-నామ్) విధానంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
మార్కెటింగ్‌పై అవగాహన కల్పించండి
మంత్రి రామన్న మాట్లాడుతూ, ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, దాని నిబంధనలు రైతులకు తెలిసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అందరూ మాట్లాడే విధంగా అఖిలపక్షం నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. కొన్ని చోట్ల సోయా పంటకు మొలకలు వచ్చాయని, మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహావిష్కరణకు మంత్రి సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయూరు. జేసీ సుందర్ అబ్నార్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్, నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య సమావేశాన్ని ఉన్నవారితోనే కొనసాగించారు. తేమశాతం, దళారీలు, వ్యాట్, మార్కెట్ పని చేసే సమయాలు, మార్కెట్ యార్డుల్లో ఖాళీ పోస్టుల భర్తీ, ఈ-నామ్ ల్యాబ్ ఏర్పాటు, మైయిశ్చర్ మీటర్లు, రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యంపై జేసీతో మాట్లాడారు.
చర్చలో ఇవి ప్రస్తావించారు..
అఖిలపక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతి నిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు మాట్లాడారు. జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో ప్రారంభించిన ఈ-నా మ్ భైంసాలో నడవడం లేద ని, నామ్‌కే వాస్తేగా.. ఉంద ని రైతు సోలంగి భీంరావు స మావేశం దృష్టికి తీసుకురా గా, కేవలం మినుముల కొ నుగోలుకు మాత్రమే ఈనా మ్ అమలు చేస్తున్నామని అధికారులు చెప్పా రు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి నిఘా ఉంచాలని, రైతులు కట్టిన బీ మా డబ్బులు వచ్చేట్లు చూడాలని రైతు భూ మారెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం నుంచి రూ.8 కోట్లు విడుదలయ్యాయని, ఈ ఏడాది నుంచే సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. తేమ విషయంలో, పత్తి అమ్మిన రైతులకు డబ్బుల చెల్లిం పు విషయంలో చాలా జాప్యం జరుగుతోందని, మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తిని గోదాముల్లో పెట్టుకునేలా సౌకర్యాలు కల్పించాలని రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి స మావేశంలో ప్రస్తావించగా, తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్నా పత్తికి మద్దతు ధర ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మార్కె ట్ యార్డుల్లో రైతులకు ఏ అపాయం జరిగినా ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఈనామ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలపాలని నాయకుడు గోవర్ధన్ యాదవ్ కోరారు. జిల్లాలో రెండు చోట్ల ఈ-నామ్ ప్రారంభించామని, ఈ ఏడాది పత్తికి అమలు చేయనున్నట్లు అధికారులు వివరించారు. మార్కెట్‌లో సీసీఐ అధికారులు తప్పకుండా ఉండాలని, ఆదిలాబాద్ మార్కెట్ గోదాముల పక్కన కొందరు ఇళ్లు ఎందుకు కట్టుకొని ఉన్నారో తెలపాలని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి కోరారు. రైతులు తీసుకువచ్చిన పత్తికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. మార్కెట్‌యార్డుకు వచ్చే రోడ్లు బాగాలేవని, మార్కెట్‌లో రైతులను నిలుపు దోపిడీకి గురి చేస్తున్నారని, తాగునీరు, అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, తేమ నిర్ధారణ నిష్పక్షపాతంగా జరగాలని, అందుకు సీనియర్ అధికారిని నియమించాలని పలువురు నాయకులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారు.. పత్తికి ఈ-నామ్ అమలు చేస్తారా.. లేదా అన్నది కొలిక్కి రాలేదు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రాంతీయ ఉప సంచాలకుడు శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు సురేశ్‌జోషి, గణపత్తి, లోకా భూమారెడ్డి, యూనుస్ అక్బానీ, బండి దత్తాత్రి, ప్రభాకర్‌రెడ్డి, అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement