
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా శిబిరంలో ఈనెల 19(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతులకు నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్య శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పత్తిలో గులాబీరంగు పురుగు నివారణ మార్గాలపై విజయవాడకు చెందిన రహమతుల్లా అవగాహన కల్పిస్తారన్నారు. లింగాకర్షక బుట్టల పాత్ర.. కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 83675 35439, 0863–2286255.
Comments
Please login to add a commentAdd a comment