Chilli cultivation
-
ఆర్గానిక్ పద్ధతిలో మిరప సాగు...!
-
ఏన్కూరులో ఎల్లో చిల్లీ!
ఏళ్ల తరబడి మనం ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చిమిర్చిని, ఎర్ర రంగులో ఉండే ఎండుమిర్చిని చూస్తున్నాం.. వంటల్లో వాడుతున్నాం.. కానీ పసుపు రంగు మిర్చిని ఎప్పుడైనా చూశారా? కూరగాయలు అమ్మే కొన్ని పెద్ద దుకాణాల్లో పసుపు రంగులో ఉండే క్యాప్సికం (బెంగళూరు మిర్చి) కన్పిస్తుంది. కానీ ఎల్లో మిర్చి కనబడదనే చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లాలో ఓ రైతు మాత్రం ఈ వెరైటీ మిరపను సాగు చేస్తున్నాడు. దీని దిగుబడి, ధర ఆశాజనకంగా ఉందని ఆయన చెబుతున్నాడు. ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన రైతు కొండపల్లి నరేష్ ఓ రోజు యూట్యూబ్‌లో సాధారణ మిర్చి సాగుకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకచోట పసుపు రంగులో ఉన్న మిర్చి అతని దృష్టిని ఆకర్షించింది. ఒకింత లోతుగా పరిశీలించే సరికి కొన్నిచోట్ల ఈ పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వివరాలు ఆరా తీశాడు. వరంగల్, గుంటూరు వ్యాపారులు ఈ రకం మిర్చిని కొనుగోలు చేస్తారని తెలిసింది. గతేడాది క్వింటాల్‌కు రూ.65 వేల వరకు ధర పలికిందని కూడా తెలుసుకున్నాడు. దీంతో వరంగల్ వ్యాపారులను సంప్రదించాడు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడమే కాకుండా వారి వద్దే ఎల్లో మిర్చి విత్తనాలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పది కుంటల భూమిలో పంట వేశాడు. సాధారణ మిర్చి పంటలాగే సాగు పద్ధతులు అవలంబించగా రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అయింది. తాజాగా తొలి తీతలో ఐదు క్వింటాళ్ల దిగుబడి రాగా ఇంకా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడికి అవకాశముందని నరేష్ చెబుతున్నాడు. ఈ రకం మిర్చికి తెగుళ్ల బెడద తక్కువేనని.. సాధారణ మిర్చితో పోలిస్తే 50 శాతం తక్కువ వైరస్లు సోకుతాయని చెప్పాడు. నల్లి ప్రభావం తక్కువగా ఉండగా, తెల్లదోమ మాత్రం కాస్త సోకిందని తెలిపాడు. మందులు, రంగులు, చిప్స్‌లో.. పసుపు రంగు మిర్చి సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.65 వేల ధర పలకగా ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యే ఉంది. ధర పెరిగేవరకు ఆగుదామని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఈ మిర్చిని మందులు, రంగుల తయారీతో పాటు బ్రాండెడ్ కంపెనీల చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. – కొండపల్లి నరేష్, రైతు ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది ఖమ్మం జిల్లాలో పసుపు రంగు మిర్చి సాగు ఇటీవలే మా దృష్టికి వచ్చింది. మార్కెట్లో ఈ రంగు మిర్చికి డిమాండ్ ఉంది. ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రైతులు పంట మార్చిడి చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పంట సాగుపై వివరాలు సేకరిస్తున్నాం. – పి.అపర్ణ, వైరా నియోజకవర్గ ఉద్యానవన అధికారి -
ఖమ్మం మిర్చి.. విదేశాల్లో క్రేజీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి అంటేనే హాట్.. కానీ ఖమ్మం మిర్చి మరింత హాట్.. ఎందుకంటే విదేశాల్లో ఈ మిర్చికి హాట్ హాట్‌గా డిమాండ్ పెరిగిపోతోంది. ఖమ్మం రైతులు పండిస్తున్న మిర్చిలో 70శాతం మేర చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఘాటు ఎక్కువగా ఉండే తేజ రకం మిర్చి ఎక్కువగా సాగు చేయడం, తెగుళ్లు వంటివి పెద్దగా లేకుండా నాణ్యమైన దిగుబడులు రావడంతో డిమాండ్ మరింత పెరిగిందని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ఏటా రూ.2 వేల కోట్లకుపైగా మిర్చి ఎగుమతి అవుతుండటం గమనార్హం. ఖమ్మం టు చైనా.. వయా చెన్నై తామర పురుగు బెడదతో రైతులు ఈసారి ముందుగానే మిర్చిని సాగు చేయగా జనవరి నుంచే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షకుపైగా ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సమీపంలోని సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, ఏపీలోని కృష్ణా, గుంటూరు రైతులు కూడా ఖమ్మం మార్కెట్లో మిర్చి విక్రయిస్తారు. వ్యాపారులు విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆ మిర్చిని వాహనాల్లో చెన్నైతోపాటు తమిళనాడులోని కాట్పల్లి, ఆంధ్రాలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, ముంబై పోర్టులకు తరలించి నౌకల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా చైనాలో ఎక్కువ కారం ఉండే మిర్చి దొరకకపోవడంతో.. ఖమ్మం మిర్చిని దిగుమతి చేసుకుంటారని వ్యాపారులు చెప్తున్నారు. 3రూపాల్లో ఎగుమతి.. మన దేశంలో ఎక్కువగా పొడి కారం వినియోగిస్తారు. విదేశాల్లో నేరుగా ఎక్కువగా వాడుతారు. ఈ క్రమంలోనే మూడు రకాలుగా.. ఫుల్ మిర్చి (పూర్తిస్థాయి మిరప), స్టెమ్కట్ (తొడిమ కత్తిరించి), స్టెమ్‌లెస్ (తొడిమ పూర్తిగా తొలగించి) మిర్చిగా ఎగుమతులు జరుగుతాయి. స్టెమ్కట్ కోసం యంత్రాలను ఉపయోగిస్తారు. స్టెమ్‌లెస్ విధానంలో పంపే వ్యాపారులు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఖమ్మంలో కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మిర్చి ఆయిల్ రూపంలోనూ.. చైనా వంటి దేశాల్లో మిర్చిని కాయల రూపంలో వాడితే.. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇందుకోసం మిర్చి నుంచి నూనె తీసే కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడం, మరిపెడ బంగ్లా, హైదరాబాద్‌లోని శ్రీశైలం రోడ్డులో ఉన్న కందుకూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 100 కేజీల మిర్చిని ప్రాసెస్ చేస్తే 8.50 కేజీల పొడి, కేజీన్నర ఆయిల్, మిగతా పిప్పి వస్తుందని చెప్తున్నారు. మిర్చి ఆయిల్‌ను ఆహార పదార్థాల్లో వినియోగించడంతోపాటు సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, టియర్ గ్యాస్, కాస్మొటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. చైనా రెస్టారెంట్లలో మన మిర్చే.. చైనాలో హాట్ పాట్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిద్ధం చేసిన ఆహారం కాకుండా.. దినుసులు అందజేస్తారు. వాటితో సిద్ధం చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలో వినియోగదారులకు 10 నుంచి 15 వరకు స్టెమ్‌లెస్ మిర్చి ఇస్తారు. ఇందుకోసం ఖమ్మం నుంచి దిగుమతి చేసుకునే మిర్చినే వినియోగిస్తారని వ్యాపారులు చెప్తున్నారు. విదేశాల్లో ఖమ్మం మార్కెట్‌కు గుర్తింపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండే మిర్చి నాణ్యత బాగుండటంతో ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం కూడా వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. – దోరేపల్లి శ్వేత, చైర్పర్సన్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎనిమిదేళ్లుగా ఎగుమతి చేస్తున్నా.. మా నాన్న మిర్చి రైతు. నేను ఎనిమిదేళ్లుగా విదేశాలకు ఎగు మతి చేస్తున్నాను. తేజ రకానికి విదేశాల్లో డిమాండ్ ఉంది. – బొప్పన జగన్మోహన్రావు, మిర్చి ఎగుమతిదారు, ఖమ్మం దిగుబడి బాగుంది ఐదేళ్లుగా తేజ రకం సాగు చేస్తున్నా. ఈసారి మూడెకరాల్లో సాగు చేశా. మొదటితీతలో 30 క్వింటాళ్ల దిగుబడి రాగా.. మరో 30 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాల్‌కు రూ.18,200 ధర వచ్చింది. – బానోత్ శంకర్, రైతు, మహబూబాబాద్ జిల్లా -
‘ఎర్ర’బంగారం మెరుపులు
సాక్షి, అమరావతి: మిరప రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లతామరతో సహా తెగుళ్ల ప్రభావం ఈసారి పెద్దగా లేకపోవడం.. గతేడాది కంటే మిన్నగా దిగుబడులొచ్చే అవకాశం ఉండటం, మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.62 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది రికార్డు స్థాయిలో 5.12 లక్షల ఎకరాల్లో సాగైంది. పూతకొచ్చే దశలో విరుచుకుపడిన నల్లతామరకు తోడు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఫలితంగా 60–70 శాతం పంట దెబ్బతినగా, హెక్టార్‌కు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావించారు. కానీ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంట సాగవుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 3.95 లక్షల ఎకరాలు కాగా.. 5.55 లక్షల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేస్తున్నారు. సర్కారు బాసటతో.. నల్లతామర పురుగు ప్రభావంతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విత్తు నుంచీ ప్రభుత్వం అండగా నిలిచింది. నాణ్యమైన మిరప నారును అందుబాటులో ఉంచడంతోపాటు నల్లతామరను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రోటోకాల్‌పై ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్‌లతో పాటు కరపత్రాలు ముద్రించి వలంటీర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయించింది. మిరప ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు తోట బడులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వీడియో, ఆడియో సందేశాలతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశకు చేరుకోగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎక్కడా నల్లతామరతో పాటు ఇతర తెగుళ్ల జాడ కనిపించలేదు. ఫలితంగా దిగుబడులు కూడా ఈసారి గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు రావడం గగనంగా మారగా.. ఈ ఏడాది హెక్టార్‌కు 40–50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు 2020–21లో క్వింటాల్ రూ.13 వేలు పలికిన ఎండు మిర్చి 2021–22లో ఏకంగా రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం సాధారణ మిరప రకాలు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతుండగా.. బాడిగ, 341 రకాలు రూ.27,500 వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతమున్న డిమాండ్ కొనసాగి.. ఎగుమతులు ఊపందుకుంటే ధరలు ఇదే రీతిలో కొనసాగే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి బాగా వచ్చేలా ఉంది నేను మూడెకరాల్లో మిరప వేశా. గతేడాది నల్లతామర పురుగు వల్ల ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సేంద్రియ, బిందు, మల్చింగ్ విధానాల్లో సాగు చేయడంతో తెగుళ్ల బెడద కన్పించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్లో రేటు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. – కల్యాణం వెంకట కృష్ణారావు, కోనయపాలెం, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా నల్లతామర ప్రభావం లేదు ఈ ఏడాది నల్లతామర ప్రభావం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. వర్షాలు కాస్త కలవరపెడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులొస్తాయి. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రెట్టింపు వస్తుందని అంచనా వేస్తున్నాం. – వంగ నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా రికార్డు స్థాయిలో సాగు గతేడాది నల్లతామర దెబ్బకు ఈసారి విస్తీర్ణం తగ్గిపోతుందనుకున్నాం. కానీ రికార్డు స్థాయిలో రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుకు విత్తు నుంచీ తోడుగా నిలవటంతో పంటపై తెగుళ్ల ప్రభావం ఎక్కడా కన్పించడం లేదు. కచ్చితంగా హెక్టార్‌కు 50 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
మిర్చి సాగు.. లాభాలు బాగు
మడకశిరరూరల్: ఎండు మిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మడకశిర నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు ఎండు మిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏడాది వేరుశనగ సాగుతో నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులు ఎలాగైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మిర్చి సాగువైపు దృష్టిసారించారు. ప్రసుత్తం ఎండు మిరపకు మార్కెట్లో మంచి« ధర ఉండటంతో బోరుబావుల కింద ఎక్కువ మంది మిరప సాగు చేస్తున్నారు. 910 ఎకరాల్లో సాగు... మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మండలాల్లో ఇప్పటికే 910 ఎకరాలకుపైగా సాగు చేసిన మిరప పంట ఆశాజనకంగా ఉంది. ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిరప పైరు ఒక్కోటి రూ.75 పైసాలు కాగా ఎకరా పంట సాగుకు మిరప పైరుకు రూ.12 వేలు ఖర్చు అవుతోంది. ఎకరాకు రూ.లక్ష ఆదాయం కృషాజలాలకు తోడు భారీ వర్షాలు కురవడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. బోరు బావుల్లోనూ నీటి మట్టం పెరగడంతో మిరప పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పంట సాగుకు మిరప పైరు, మందులు, ఎరువులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. మార్కెట్లో ప్రసుత్తం 10 కిలోల ఎండు మిరప రూ.2,500 వరకు ధర పలుకుతోంది. తెగుళ్లు సోకకపోతే ఎకరాకు రూ.లక్ష దాకా ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వైఎస్సార్ బీమా వర్తింపుతో... రాష్ట్ర ప్రభుత్వం మిరప పంటకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా వర్తింపజేయడంతో అధిక శాతం మంది రైతులు మిర్చి సాగుపై మరింతగా ఉత్సహం చూపుతున్నారు. వర్షాలకు పంట దెబ్బతింటే ఎకరా మిరప పంటకు రూ.60 వేల చొప్పున బీమా వర్తిస్తోంది. బీమా వర్తింపు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మిరప పంటకి వైఎస్సార్ ఉచిత పంటల బీమా చెల్లించడం చాలా సంతోషంగా ఉంది. మిర్చి పంట సాగుతో ఆదాయం పొందుతున్నాం. అర్ధ ఎకరాకు పైగా మిరప పంట సాగు చేశా. గతంలో ఏ ప్రభుత్వం మిరపకు బీమా మంజూరు చేయలేదు. – నాగరాజు, రైతు, ఎల్లోటి పదేళ్లుగా మిర్చి సాగు బోరు బావి కింద పదేళ్లుగా మిర్చి పంటను సాగు చేస్తున్నాను. సాగు చేసిన నెల తర్వాత మెదటి క్రాప్ మిపర కాయలను తొలగించుకోవచ్చు. ప్రసుత్తం మార్కెట్లో మిర్చి ధర బాగా ఉంది. మిరప పంట సాగు ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాను. – ఆవులప్ప , రైతు, మడకశిర అవగాహన కల్పిస్తున్నాం మిర్చి పంటకు ప్రభుత్వం ఎకరాకు రూ. 60వేలు వైఎస్సార్ ఉచిత బీమా వర్తింపజేస్తోంది. బోరు బావుల్లో నీటి మట్టం పెరగడంతో గతంలో కంటే ఈ ఏడాది రైతులు మిరప పంటసాగుపై దృష్టి సారిస్తున్నారు. మిరప పంటకు తెగుళ్లు సోకకుండా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – చిన్న రెడ్డయ్య, ఉద్యానశాఖ అధికారి, మడకశిర -
మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ఇవి కొత్త రకం తామర పురుగులు! ►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. ►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్ (ట్రేసర్), ఫిప్రోనిల్ (రీజెంట్), డయాఫెన్ థయురాన్ (పెగాసస్), ఇంటర్ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్ పిల్ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు: ►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి. ►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది. ►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం. ►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. ►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్ గాని ట్రైటాన్ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. ►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). ►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్ (40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. ►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. ►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. – డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా dir-research@drysrhu.edu.in చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! -
Organic Farming: వాట్సప్ ‘చాట్ బాట్’ ద్వారా ప్రకృతి సేద్యంలో మిరప సాగుపై సూచనలు..
రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మిరప పంటను సాగు చేయటం ఎన్నో సవాళ్లతో కూడిన కష్టతరమైన విషయం. అయితే, అసాధ్యం కాదని నిరూపిస్తున్న అనుభవజ్ఞులైన రైతులు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉన్నారు. అయితే, ఏ రైతైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్ చేసే రైతులు కొద్ది మందికి మాత్రమే తమ జ్ఞానాన్ని అందించగలుగుతారే తప్ప.. వేలాది మందికి అందించలేరు. పంట కాలం పొడవునా ఎప్పుడంటే అప్పుడు చప్పున ఆయా రైతులకు సులువుగా అర్థమయ్యే మాటల్లో చెప్పగలగటమూ అసాధ్యమే. అయితే, అత్యాధునిక సాంకేతికత ‘కృత్రిమ మేథ’ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. రైతు తన మొబైల్లోని ‘వాట్సప్’ ఆప్ ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ‘డిజిటల్ గ్రీన్’ సంస్థ రుజువు చేస్తోంది. వాట్సప్‌లో ‘చాట్‌బాట్ టెక్నాలజీ’ని వినియోగించడం ద్వారా ఈ పనిని సంకల్పంతో సుసాధ్యం చేస్తోంది డిజిటల్ గ్రీన్. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరప సాగులో గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు దంపతులు కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు సిద్ధహస్తులు. ఎకరానికి 26 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీస్తున్న వీరి సుసంపన్నమైన అనుభవాలను శాస్త్రీయ పద్ధతుల్లో రికార్డు చేసిన డిజిటల్ గ్రీన్ సంస్థ.. వీరి అనుభవాలను తెలుగు నాట వేలాది మంది మిరప రైతులకు అత్యంత సులువైన రీతిలో, అచ్చమైన తెలగులో, ఉచితంగా వాట్సప్ చాట్‌బాట్ ద్వారా అందిస్తోంది. ఇందుకు రైతు చేయాల్సిందేమిటి? చాలా సులభం.. డిజిటల్ గ్రీన్ వాట్సప్ నంబరు 75419 80276కు వాట్సప్ లో రైతు జిజీ అని మెసేజ్ పంపితే చాలు. డిజిటల్ గ్రీన్ వాట్సప్ చాట్ బాట్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతూ రైతు వాట్సప్ కు వెంటనే తెలుగులో మెసేజ్ రూపంలో వస్తుంది. అందులో పేర్కొన్న సూచనలతో పాటు రైతు తన మిరప పంట ఎన్ని రోజుల దశలో వుందో ఆయా ఐచ్చికాల (ఆప్షన్స్)ను మెసేజ్ రూపంలో చాట్ బాట్ పంపుతుంది. రైతు తన మిరప పంట ఐచ్చికాన్ని ఎంచుకొని పంపిన వెంటనే, ఆ రైతు మిరప పంట దశను సేవ్ చేసుకుంటుంది. రైతు మొదటిసారి తెలియజేసిన పంట దశ ఆధారంగా రాబోయే పంట దశను చాట్ బాటే స్వయంగా అంచనా వేసి.. ప్రతి దశ లో పాటించవలిసిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను లేదా తీసుకోవలసిన జాగ్రత్తలను వాట్సప్‌లో వీడియో రూపంలో పంపుతుంది. ఒక్క చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా మిరప నారు పోసుకునే దగ్గర నుంచి ఎండు మిరప కాయలు అమ్ముకునే వరకు.. వేలాది మంది రైతులు ఏకకాలంలో, ఎప్పుడంటే అప్పుడు వాట్సప్ ద్వారా మేలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సేంద్రియ మిరప కాయలకు దేశ విదేశాల్లో గిరాకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ గ్రీన్ చొరవ రైతులకు ఎంతగానో తోడ్పడుతుందనటంలో సందేహం లేదు. ►మిరప రైతులు ప్రకృతి వ్యవసాయ సూచనల కోసం వాట్సప్ ద్వారా సంప్రదించాల్సిన మొబైల్ నంబరు : 75419 80276. అనంతపురం జిల్లాలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో డా. ఖాదర్ సదస్సులు స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి అవగాహన సదస్సులు కరోనా అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ నెల 26 (ఆది), 27 (సోమ) తేదీల్లో సదస్సులు జరగనున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటుతో అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ‘ఆదరణ’ రామకృష్ణ, ప్రొఫెసర్ గంగిరెడ్డి తెలిపారు. సిరిధాన్యాల సాగులో మెలకువలు, సిరిధాన్యాలను రోజువారీ ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే మార్గాలపై డా. ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. ►సెప్టెంబర్ 26న ఉ. 10 గంటకు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ సమగ్ర పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, 26న మధ్యాహ్నం 3 గంటలకు సింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ఉచిత రైతు అవగాహన సదస్సులు జరుగుతాయి. ►సెప్టెంబర్ 27న ఉ. 10 గంటలకు పర్తిశాల పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. ►సెప్టెంబర్ 27న సా. 4 గంటలకు లేపాక్షిలోని ఆర్.జి.హెచ్. కల్యాణ మండపంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొండూరు మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ►ఇతర వివరాలకు.. ఆదరణ రామకృష్ణ – 98663 45715, ప్రొ. వై. గంగిరెడ్డి – 98483 87111. చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్.. ఎక్కడంటే.. -
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్‌లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్‌లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్‌లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021 -
19న కొర్నెపాడులో పత్తి, మిరప సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా శిబిరంలో ఈనెల 19(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతులకు నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్య శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పత్తిలో గులాబీరంగు పురుగు నివారణ మార్గాలపై విజయవాడకు చెందిన రహమతుల్లా అవగాహన కల్పిస్తారన్నారు. లింగాకర్షక బుట్టల పాత్ర.. కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 83675 35439, 0863–2286255. -
సౌర సుజల యోజనతో..
రాయ్‌పూర్: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్ పంప్సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్ రామ్ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్పూర్ జాయింట్ కలెక్టర్ ప్రియాంక శుక్లా తెలిపారు. -
నాన్ బీటీ.. నాదే విత్తనం!
విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి! రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్ పాలేకర్ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్ బీటీ సూటిరకం లోకల్ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్‌బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు. రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..! రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన. ఆరుద్రలో మిరప, వరి నారు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్‌తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్‌లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్‌బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. ఇదేమి చోద్యం?! రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం! -
వరిపై వట్టి ప్రచారమే..!
►పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చినా పశ్చిమ డెల్టాలో పూర్తి కాని నాట్లు ► గతేడాది కంటే భారీగా తగ్గిన మిర్చి సాగు ► పెరిగిన పత్తి విస్తీర్ణం ► కౌలు రైతులకు అందని రుణాలు సాక్షి, అమరావతి బ్యూరో: ‘ పట్టి సీమ ద్వారా నీరు ఇచ్చాం.. రైతులు రెండు నెలల ముందే వరి సాగు చేసుకొనే అవకావం వచ్చింది..’ అని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆగస్టులోనే ప్రారంభిస్తున్నారు. కారణం పశ్చిమ డెల్టా రైతులు ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకొలేదు. రైతులు సంప్రదాయబద్ధంగా ఏటా సాగు చేస్తున్న మాదిరిగా ఈ నెలలోనే వరి సాగు ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం జూన్ నెలలోనే సాగు ప్రారంభిస్తే అక్టోబరు, నవంబరులో పంట కోత వస్తోంది. ఆ సమయంలో తుఫాన్లు వస్తే భారీ నష్టం సంభవిస్తుందనే కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు. భారీగా తగ్గిన మిర్చి సాగు.. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 13,38,035 ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ కేవలం 7,83,765 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 4,63,527 ఎకరాల్లో పత్తి పంట సాగు కావడం గమనార్హం. గతేడాది మిర్చి పెద్దఎత్తున సాగు చేయగా ఈ ఏడాది పత్తి సాగుపై రైతులు దృష్టి సారించారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 1,02,105 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా ఈసారి కేవలం 29,810 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఈ ఏడాది వరి సాగు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్నారు. అపరాల పంటలు వేసేందుకు కూడా ఆసక్తి చూపటం లేదు. కౌలు రైతులకు కష్టాలే.... కౌలు రైతుల పట్ల ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 5,193 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.4,000 కోట్లకు పైగా రుణాలు అందాయి. ఇప్పటికే వరి పంటకు తప్ప, అన్ని çరకాల పంటలకు పంట బీమా గడువు ముగిసింది. జిల్లాలో దాదాపు 2 లక్షల మందికి పైగా కౌలు రైతులు పంట సాగు చేస్తున్నారు. అయితే వీరిలో ఎల్ఈసీ కార్డులు, సీఓసీ పత్రాలు కేవలం 70,000 మందికి మాత్రమే అందాయి. ప్రభుత్వం ఈ ఏడాది కచ్చితంగా రైతులకు ఇస్తున్న రుణాల్లో 10శాతం రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని నిబంధన పెట్టింది. అంటే రూ.400 కోట్ల మేర కౌలు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 14,000 వేల మంది కౌలు రైతులకు నామమాత్రంగా రూ. 62 కోట్లు ఇవ్వడం గమనార్హం. వరి పంటకు సైతం ఆగస్టు 21తో బీమా గడువు ముగుస్తోంది. ఖరీఫ్‌లో ఇంకా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సింది. వీరంతా పంటల బీమా చేసుకొనే అవకాశం కోల్పోనున్నారు. -
ఎకరం కౌలు రూ.35,000
♦ కారంచేడులో చుక్కలనంటుతున్న కౌలు ధరలు ♦ రైతుల మధ్య నెలకొన్న పోటీయే కారణం ♦ చరిత్రలో ఇంత రేటు ఎప్పుడూ లేదంటున్న స్థానికులు ♦ గత ఏడాది సాగునీరు లేక బీళ్లుగా మారిన మాగాణిలు ♦ ఇప్పుడు అదే భూముల్లో మెట్ట పంటలపై ఆసక్తి ♦ మిర్చి సాగుకు మొగ్గుతున్న అన్నదాతలు కారంచేడు : జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల మధ్య నెలకొన్న పోటీ.. పెరిగిన అపరాలు, మిర్చి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగసిపడటానికి కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం సాగుకు అనుకూలమైన వాతావరణం లేక, సాగుకు అవసరమైన నీరు విడుదల కాక ఈ ప్రాంతంలో ఏటా బంగారం పండే భూములు సైతం బీళ్లుగా మారాయి. దీంతో ఈ ఏడాది మాగాణి భూములకు పేరొందిన కారంచేడులో అన్నదాతలు మెట్ట పంటల సాగుకు ఆసక్తి కన బర్చుతున్నారు. మిర్చికి లభించిన ధరల దృష్టా ఈ పంట సాగుకు పొలాలు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మాగాణి సాగుకు భూములను కౌలుకు అడిగే నాధుడు లేడంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది మాగాణి సాగు నీరు లేక భూములను ఖాళీగా వదిలేసి తీవ్రంగా నష్టపోవడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పెద్ద రైతుల్లో ఆనందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది మాదిరిగా సాగుకు నీరు పెద్దగా లేకపోయినా మెట్ట పైర్లు సాగు చేసుకోవచ్చనే ధైర్యంతో రైతులు కౌలుకు ఎగబడుతున్నారు. దీంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఈ దశలో పెద్ద రైతులు కౌలు ఎక్కువగా వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తుంటే కౌలుదారులు మాత్రం కౌలు చెల్లింపునకు తోడు పెట్టుబడులు కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విపరీతంగా పెరిగేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు, ధరలపైనే ఆశలు.. పంటల దిగుబడులు, మంచి గిట్టుబాటు ధరలపైనే ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇంత ఎక్కువ ధరలకు భూములు కౌలుకు తీసుకొని లక్షలు ఖర్చుచేసి సాగు చేస్తే చేతికందివచ్చే దిగుబడులు, వాటికి ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరలు ఎలా వుంటాయోనని ఇప్పటి నుండే ఆందోళన చెందుతున్నారు. కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే సాగు భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మిరప సాగు చేసిన రైతులకు మంచి దిగుబడులతో పాటు గిట్టుబాటు ధరలు కూడా రావడంతో రైతులు లాభాలు ఆర్జించారు. శనగ రైతులకు కూడా మంచి లాభాలు వచ్చాయి. మాగాడి రైతులు మాత్రం నష్టపోయారు. - యార్లగడ్డ శ్రీనివాసరావు ప్రకృతి పైనే ఆశలు.. ప్రస్తుతం అన్నదాతలు ప్రభుత్వం పై కాకుండ ప్రకృతి పైనే ఆశలు పెట్టుకొని వ్యవసాయానికి సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది సాగుకు చుక్క నీరు రాలేదు. ఈ ఏడాది కూడా సాగుకు నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రకృతి కరుణించి మంచి వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నాం. - దగ్గుబాటి నాగశ్రీనివాసరావు -
ఆదిలోనే అదుపుచేద్దాం..
తామర పురుగులు ఆకుముడత లేదా తామర పురుగులు మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుంచి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. రసాన్ని పీల్చడం వలన పై ముడత వస్తుంది. ఆకులు, పిందెలు రాగి లేదా ఇటుక రంగులలోకి మారి పూత, పిందె నిలిచి పోతుంది. మొక్కలు గిడసబారి పూత రాలిపోతుంది. పూత పిందెగా మారదు. లేతకాయలు గిడసబారి చారలు ఏర్పడుతాయి. కాయల నాణ్యత లోపిస్తుంది. దిగుబడి తగ్గుతుంది. నివారణ: కార్బరిల్ 3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ, డెఫైన్ థియోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. నాటిన 15, 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేస్తే పై ముడతను నివారించుకోవచ్చు. తెల్లనల్లి చిన్న, పెద్ద పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసంపీల్చుతాయి. ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో ఉం టాయి. ఆకు పెరుగుదల తగ్గి పూత పూయటం నిలిచిపోతుంది. దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తేమ అధికంగా ఉన్న సమయంలో ఉంటుంది. నివారణ: డైకోపాల్ 5 మి.లీ లేదా ఫోసలోన్ 3 మి.లీ లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగుభాగం కూడా తడిచేటట్లు పిచికారీ చేయాలి. కింది ముడత ఎక్కువగా ఉన్నప్పుడు సింతటిక్ పైరిథ్రాయిడ్ మందును వాడొద్దు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించాలి. పేనుబంక ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి తేనెవంటి పదార్థాన్ని విసర్జించటం వల్ల చీమలు చేరుతాయి. ఈ పదార్థంపైన నల్లని శిలీంద్రపు పెరుగుదల వల్ల ఆకులు, కాయలు మసిబారి పోతాయి. ఇవి ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్కల ఎదుగుదల నశిస్తుంది. నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. నివారణ: మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ తెల్లదోమలు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చుతాయి. ఆకుల ఎర్రబారి మొక్కల ఎదుగుదల క్షీణిస్తుంది. ఠనివారణ: ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా లీటర్ నీటిలో దయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగులు మిరపనాశించు కాయతొలుచు పురుగుల్లో పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగులు ముఖ్యమైనవి. వీటి వల్ల పంటకు 50 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. శనగపచ్చ పురుగు పిల్లలు మొదట ఆకులు, పూత దశలో పూభాగాలు తిని పంటకు నష్టం చేస్తాయి. కాపు దశలో కాయలో తల భాగాన్ని జొప్పించి మిగిలినదాన్ని తినడం వల్ల తాలు కాయలుగా మారుతాయి. పొగాకు లద్దె పురుగు పిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జల్లెడలా మారుస్తాయి. కాపు దశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి కాయ లోపలకు చేరి గింజలు, గుజ్జును తింటాయి. ఫలితంగా కాయను ఆరబెట్టినప్పుడు తాలుబారుతాయి. పచ్చరబ్బర్ పరుగు కూడా మొదటి దశలో ఆకులు, తరువాత దశలో కాయలను నష్టపరుస్తాయి. ఠనివారణ: 2 మి.లీ ఎండోసల్ఫాన్ లేదా 2 మి.లీ క్లోరిఫైరీఫాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎర ద్వారా కూడా నివారించవచ్చు. ఐదు కిలోల తవుడు, 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా క్లోరిఫైరీఫాస్ను 500 గ్రాముల బెల్లంతో కలపాలి. తగినంత నీటిని జోడించి చిన్నచిన్న ఉండలుగా తయారు చేయాలి. సాయంత్రం వేళ పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర పెట్టడం వల్ల లార్వాలను నివారించవచ్చు. వేరుపురుగు ఇటీవలి కాలంలో మిరప పండించే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు సమస్య అధికంగా ఉంది. వీటి పిల్ల పురుగులు భూమిలో 5-10 సెం.మీ లోతులో మిరప వేర్లు, కాండాలను తిని నష్టం కలుగ జేస్తాయి. ఫలితంగా మొక్కలు వడలి చని పోతాయి. నివారణ: ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు వాడాలి. ఈ గుళికలు భూమిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మట్టితో కప్పి పెట్టాలి. -
జోరందుకున్న మిరప సాగు
అనుకూలమైన నేలలు: నల్లరేగడి, ఒండ్రు, ఎర్రమట్టి, ఇసుక నేలలు. నేల తయారీ: పంట నాటుకు ముందు మూడుసార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటక కొట్టాలి. విత్తనశుద్ధి: మొదటి సారి ఒక కిలో విత్తనానికి గ్రామున్నర టైసోడియం, ఆర్థోపాస్పేట్, రెండోసారి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, మూడోసారి 3 గ్రాముల కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు పెంచడం: ఎత్తై నేలను చదను చేసి విత్తనాలు వేసుకోవాలి. నారు 12-15 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత పది లీటర్ల నీటిలో రెండున్నర మిల్లీలీటర్ల ఫైటోలిస్ మందును కలిపి పిచికారీ చేయాలి. పంట వేసే విధానం: వర్షాధార పంట కాబట్టి తేమశాతం అధికంగా ఉన్నప్పుడూ కానీ వర్షం పడిన సమయాల్లో కానీ ఒక తాడు సాయంతో అరగజం దూరంలో వరుస క్రమంలో తగినన్ని నారు పోచలను నాటుకోవాలి. అనంతరం తగినంత మోతాదులో నత్రజని, పొటాషియం, భాస్వరం కలిపి చల్లాలి. కొన్ని రోజులకు చేనులో వరుస సాళ్లలో దంతెలు పట్టడం, కలుపు తీయడం చేస్తూ పిచ్చి మొక్కలను తీసేయాలి. పంటలో గడ్డి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఆశించే తెగుళ్లు ట్రీప్స్, ఎఫైడ్స్ (వెంట్రుక పురుగులు) వంటివి ఆశిస్తే మోనోక్రొటోఫాస్ లేదా కార్బైల్ మందును తగినంత మోతాదులో నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. బూజు, బూడిద తెగులు, మచ్చలు ఏర్పడితే ఆంత్రోసిన్ మందును నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి. కలుపు తీయడం పంటలో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి కలుపు తీయడం చాలా అవసరం. కలుపు తీసేముందు చెట్టు మొద ళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపుతీతకంటే ముందుగా దంతెలు పడితే మరింత మంచిది. కలుపును నిర్లక్ష్యం చేస్తే తెగుళ్లు ఆశించడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నీటి తడులిస్తే మేలు: సకాలంలో వర్షాలు పడకపోతే నీటి సదుపాయం ఉన్న రైతులు పంటకు తడులు అందించొచ్చు. దంతెపట్టి, కలుపు తీశాక నీటిని పెడితే పంట ఎదుగుదల బాగుంటుంది. ఇలా చేస్తే దిగుబడిని కూడా పెరుగుతుంది. -
మిరప సాగుకు తరుణమిది
బాల్కొండ : జిల్లాలో మిరప సాగు తక్కువే అయినా.. ఇటీవలి కాలంలో పలువురు రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జలాల్పూర్ గ్రామంలోని పలువురు రైతులు ఏ కాలంలోనైనా మిరప పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. నీటి సౌకర్యం ఉన్న రైతులు మిరప సాగు చేస్తున్నారు. పలువురు నారు మళ్లు పోసుకుంటున్నారు. నారు పేసే పద్ధతి కిలో మిరప విత్తనాలకు థయిరం 3 గ్రా ములు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. భూమిని బెడ్ రూపంలో ఎత్తుగా చేసి నారు పోయాలి. భూమిలో తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నారు ఎండిపోతుంది. బెడ్‌గా చేసి నారు పోయడం వల్ల నారులో వేర్లు దృఢంగా ఏర్పడతాయి. దీంతో నారు తీసి నాట్లు వేయగానే మిరప నాటుకుంటుంది. మిరప నాట్లు వేసే భూమిలో వర్మి కంపోస్ట్ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20ః20, డీఏపీలను చల్లాలి. 30 రోజుల తర్వాత నారు పీకి నాట్లు వేయాలి. తెగుళ్లు.. నివారణ మిరపను ప్రధానంగా రెండు తెగుళ్లు ఆశిస్తాయి. ఒకటి కింది ముడత, రె ండోది పై ముడత. వీటితోపాటు రసం పీల్చు పురుగులూ పంటకు నష్టం చేకూరుస్తాయి. కింది ముడత ఆశించినప్పుడు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా డైనోపాల్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకు పైముడతకు క్లోరోపైరిఫాస్ లేదా ఇమిడిక క్లోపడ్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు కాపర్ యాసిడ్ క్లోరిఫైడ్ 1.5 మిల్లీ లీటర్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. -
మిరపనారు సాగు ఖర్చు కొనుగోలు ధరలో సగమే.!
మార్కాపురం : ఒక ఎకరాలో మిరప నాటాలంటే సుమారు 10 వేల మొక్కలకు పైగా అవసరమవుతాయి. ఒక్కో మొక్క ధర రూ.0.80 నుంచి రూ.1 వరకు ఉంటుంది. రైతులు మొక్కలు కొనడానికే రూ.12 వేలు ఖర్చు పెట్టాలి. దీనికి తోడు రవాణా ఖర్చులు భారంగా పరిణమిస్తున్నాయి. రైతులే మిరప నారు పోసి కొన్ని మెళకువలు పాటించడంతో పాటు నారు దశలోనే తెగుళ్లను అరికడితే మంచి దిగుబడి సాధించవ చ్చు. ఈ జాగ్రత్తలు పాటించండి మిరప నారు మడి పెంచడానికి చౌడు భూములు తప్ప మిగిలిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఒండ్రు నేలలైతే మరీ మంచిది. మిరప నారుమడి కోసం ఎంపిక చేసుకున్న స్థలానికి పక్కనే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఒక మీటరు వెడల్పు, 40 మీటర ్ల పొడవు గల ప్రాంతంలో పెంచిన నారు ఎకరంలో పొలంలో నాటడానికి సరిపోతుంది. నారు పోసే ప్రదేశంలో 30 కిలోల పశువుల ఎరువు, అరకిలో 15:15:15 కాంప్లెక్స్ ఎరువు వేసి కలియదున్నాలి. విత్తన శుద్ధి ముఖ్యం ఎంపిక చేసుకున్న మేలు రకం మిర్చి విత్తనాలను శుద్ధి చేసేందుకు ఆర్గానో మెర్కురియల్ కాంపౌండ్ 2 గ్రాముల మందును ఒక కేజీ విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. వీటితో పాటు 200 గ్రాముల అజోప్పైరిల్లమ్ను కేజీ విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. జిల్లాలో జెమిని వైరస్, కుకుంబ(దోసకాయ) వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రైసోడియం, ఆర్థోఫాస్పేట్ మందు 2 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల బారి నుంచి మొక్కలను కాపాడాలంటే నారు పీకే వారం రోజుల ముందు కిలో నుంచి కిలోన్నర 3జీ కార్బోలిన్ గుళికలు వేయాలి. విత్తనాలను వరుసలో నాటేటప్పుడు 7.5 సెం.మీ దూరంలో నాటి, నీటి మట్టితో, పశువుల ఎరువుతో క ప్పేయాలి. మల్చింగ్ ఇలా.. నారుమడులను వరి చెత్త లేదా ఏైదె నా వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో మల్చింగ్ చేసి రోజ్ క్యాన్లతో నీటిని చ ల్లాలి. ఒక మి.లీ క్లోరోపైరిఫాస్ మందును ఒక లీటరు నీటిలో కలిపి నారుమడిపై పిచికారీ చేయడం వల్ల చీమలు రాకుండా అరికట్టవచ్చు. విత్తనాలు మడిలో వేసనప్పటి నుంచి అవి మొలకెత్తే వరకు రోజూ రెండు సార్లు నీరు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత రోజుకు ఒకసారి మడిని నీటితో తడపాలి. విత్తనాలు మొలకెత్తే ముందుగా మల్చింగ్ ని నారుమడి నుంచి తొలగించాలి. నారు ను నాటేందుకు పది రోజుల ముందు నీటిని క్రమేపీ తగ్గిస్తే మొక్కలు గట్టిపడతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి 45 రోజుల సమయం పడుతుంది. -
లాభాలు ఒడిసి‘పట్టు’కున్నాడు..
‘నాలుగు ఎకరాల్లో నాలుగు వందల బత్తాయి చెట్లు నాటి న. ముప్పై సంవత్సరాలు పోరాడినా ఫలితం లేదు. నీళ్ల కోసం 7 బోర్లు వేయించినా సరిపోక చెట్లు మొత్తం చనిపోయాయి. తర్వాత మిర్చి సాగు చేస్తే వచ్చిన ఆదాయం కూలీలకు కూడా సరిపోలేదు. 40 గేదెలతో డెయిరీ ఫామ్ పెట్టా. ఇన్ని చేసినా చివరకు 14 లక్షల రూపాయల అప్పు మిగిలింది. 2009లో మా ఊర్లో ఓ రైతు పట్టు పురుగుల పెంపకం మొదలుపెట్టాడు. పంటకు 200 గుడ్లు వ చ్చేవి. అంతకంటే ఎక్కువ గుడ్లు వచ్చేలా చూసుకుంటే మంచి ఆదాయం వస్తుంది కదా అని అనుకున్నా. 2010లో మల్బరీ మొక్కలు నాటా. పట్టు పరిశ్రమశాఖ ప్రోత్సాహకంతో పాటు కొంత అప్పు చేసి షెడ్డు నిర్మించుకున్నా. అప్పటి నుంచి వెనుదిరగి చూడలేదు. ఏడాదికి 9 నుంచి 10 పంటల మీద రూ.9 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క పంట కూడా నష్టపోలేదు మొదట్లో మూడు ఎకరాల్లో మల్బరీ మొక్కలు నాటా. ఇప్పుడు ఆరు ఎకరాల్లో వేశా. పంట సాగులో పట్టు పరిశ్రమ అధికారి బాలసుబ్రహ్మణ్యం చెప్పిన పద్ధతులు సక్రమంగా పాటించడంతో నేటి వరకు ఒక పంట కూడా నష్టపోలేదు. జోడు సాళ్ల పద్ధతి(3 ఁ3)లో నారు మొక్కలను నాటా. అలా చేస్తే మొక్కలు ఏపుగా పెరిగినా దున్నడానికి అనువుగా ఉంటుంది. ఎకరా మల్బరీకి టన్ను వేప పిండి, నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరువు వేస్తున్నా. ఒక పంట పూర్తయిన తర్వాత 45 కేజీల బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని పవర్ స్ప్రేయర్‌తో షెడ్డంతా పిచికారీ చేసి శుభ్రపరుస్తా. క్లోరిన్ డయాక్సైడ్, ఫార్మాలీన్ రసాయనాలను ఫ్లేమ్ గన్ను ఉపయోగించి చంద్రికలు, షెడ్డు అరల్లో పిచికారీ చేసి వాటిని బ్యాక్టీరియా, వైరస్ రహితంగా ఉంచుతుండటంతో నాలుగేళ్లలో ఒక్క పంట కూడా నష్టపోలేదు. మూడు జ్వరాలు పూర్తయ్యేంత వరకు పురుగులపై మైనం పేపర్‌ను కప్పుతా. అందువల్ల ఆకు ఎండదు. పురుగులు ఆకును బాగా తింటాయి. పురుగులకు జ్వరం వచ్చినపుడు మాత్రం మైనం పేపర్(పారాపీన్) వేయకూడదు. ఆకు వేయడంలో అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ.. పురుగుల దశలకు అనుగుణంగా లేత నుంచి ముదురు ఆకు వేస్తున్నా. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ సోకకుండా ప్రైవేట్ మార్కెట్లో దొరికే మందు వాడుతున్నా. కుటుంబమంతా పట్టు సాగులోనే.. ప్రతి పంటకు 600 గుడ్లు చేతికొస్తున్నాయి. 100 గుడ్లకు 50-60 కేజీల దిగుబడి వ స్తోంది. కేజీకి రూ.420-రూ.450 ధర దక్కుతోంది. ప్రతి పంటకు లక్ష రూపాయలకు పైగా మిగులుతోంది. ఏడాదిలో 9 పంటలకు రూ.9 లక్షల ఆదాయం వచ్చింది. ఉన్న అప్పును పంట అమ్మినప్పుడ ల్లా తీర్చుకుంటూ వచ్చా. బైఓల్టేన్ రకానికి కేంద్రం కేజీకి రూ.50, చాకీకి రూ.750 ప్రోత్సాహకం ఇస్తోంది. పట్టు గూళ్లను అమ్మిన చోటే నగదు చెక్కు ఇస్తున్నారు. పట్టు గూళ్లను హిందూపురం మార్కెట్‌కు తీసుకెళ్తున్నా. పట్టు పురుగులను కంభంలో కొనుగోలు చేస్తున్నా. రెండో జ్వరం తర్వాత షెడ్డుకు పురుగులు తెచ్చుకుంటున్నా. కుటుంబం మొత్తం కలిసి పట్టు సాగు చేసుకుంటున్నాం. పట్టు గుడ్లను మార్కెట్‌కు తీసుకెళ్లే సమయంలో కూలీలు అవసరమవుతారు. సాగు సమయంలో కూలీల ఖర్చు ఉండదు’. -
విపత్తు
సాక్షి, ఒంగోలు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో జిల్లా రైతులు విత్తన విపత్తు ఎదుర్కొంటున్నారు. రైతులు ఇప్పట్నుంచే పొలాలపక్కన కుంటల్లో పూడిక తీసుకోవడం.. దుక్కులు దున్నుకోవడం..తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల రెండోవారంలో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనే వాతావరణ కేంద్రం సూచనలతో అదునులో పదునైతే తొలకరి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే, సకాలంలో అందుబాటులో ఉండాల్సిన విత్తనాల నిల్వలే.. ఇప్పుడు వారికి సమస్యగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.34 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ముందే వర్షాలు కురవడంతో సాగు అనుకూలించింది. 6.75 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటి సాగు చేశారు. ఈఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందనేది అధికారుల భావన. రైతులు ఇప్పటికే విత్తన కొనుగోలుపై దృష్టిపెట్టారు. వ్యవసాయశాఖ మాత్రం వర్షాధార పంటలైన చిరుధాన్యాల విత్తనాల్ని మాత్రమే అందుబాటులో ఉంచి.. జిల్లా ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, వేరుశనగ విత్తనాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తపడలేదు. మిగతా జిల్లాలతో పోల్చితే, ప్రకాశంలో ఖరీఫ్ ఆలస్యంగా ప్రారంభమవుతోందని..అందుకే విత్తన నిల్వలపై పెద్దగా తొందరపడటం లేదనేది వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతుల్లో మాత్రం ప్రధానపంటల విత్తనాల పంపిణీపైనే ఆందోళన నెలకొంది. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. {పస్తుతం వేసవి పత్తి 18,562 ఎకరాలతో కలిపి ఇప్పటికే మిగతా పంటలన్నీ మొత్తం 20,905 ఎకరాల్లో సాగవుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే.. జిల్లాలో ఈ ఏడాది కంది, పత్తి సాగు పెరుగుతోందనేది వ్యవసాయశాఖ అంచనా. దీనికి అనుగుణంగా రెండురకాల విత్తనాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. పత్తి గతేడాది అంచనా (1.19 లక్షల ఎకరాల)కు మించి 1.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఎకరాకు రెండు సంచుల చొప్పున చూపినా.. హెక్టారుకు ఐదు సంచులు అవసరం. అంటే కనీసం, 3.57 లక్షల సంచుల విత్తనాలు కావాల్సి ఉంది. ఇప్పటిదాకా 53,110 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిర్చిసాగు కూడా ఏడాదికేడాదీ పెరుగుతోంది. మిర్చి సాధారణ విస్తీర్ణం 38,480 ఎకరాలకు గాను గతేడాది 50,077 ఎకరాల్లో సాగుచేశారు. గుండ్లకమ్మ పరిధిలో నీటివసతి ఆధారంగా రైతులు మిరపసాగుకు మొగ్గుచూపుతున్నారు. వీరికి ఎన్ని విత్తనాలు అవసరమో కూడా వ్యవసాయశాఖ ఇప్పటి వరకు అంచనా వేయకపోవడం గమనార్హం. కిందటేడాది అదునులో సాగునీరు ఇవ్వడంతో 93,107 ఎకరాలకు గాను 1.45 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ప్రస్తుతానికి ఆరువేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఏపీసీడ్స్ వద్ద అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సీజన్ ముమ్మరంగా సాగేక్రమంలో ఇంకా విత్తనాలు తెప్పిస్తామంటున్నారు. వేరుశనగ పంటకు సంబంధించి జిల్లాకు 3 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా, వాటి సేకరణ బాధ్యత తీసుకున్న ఏపీసీడ్స్ దగ్గర నిల్వల్లేవు. ఎప్పటికొస్తాయనే సమాచారం కూడా లేదు. పలు విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు వ్యవసాయశాఖ సిద్ధం చేయగా, ప్రస్తుతం జొన్న 10 క్వింటాళ్లు, సజ్జ 90 క్వింటాళ్లు, మొక్కజొన్న 50 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 150 క్వింటాళ్లు, కంది 1500 క్వింటాళ్లు, నువ్వులు 110 క్వింటాళ్లు, ఆముదం 50 క్వింటాళ్లు, వేరుశనగ 3 వేల క్వింటాళ్లు, జీలుగ 700 క్వింటాళ్లు, పిల్లిపెసర 800 క్వింటాళ్లు, జనుము 300 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రణాళికపై కసరత్తు చేస్తున్నాం.. ఖరీఫ్ సాగు ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టరేట్ కార్యాలయ మార్గదర్శకాల ప్రకారం రూపొందించాల్సి ఉంది. ఇటీవల ఎన్నికల సీజన్లో అధికారులంతా బిజీగా ఉన్నందున ఈసారి కాస్త ఆలస్యమైంది. అయితే, జిల్లా స్థాయిలో సాధారణ ఖరీఫ్ ప్రణాళిక రూపొందించుకుని దానిప్రకారమే విత్తనాలు సిద్ధం చేశాం. ఇంకా పలురకాల పంటల విత్తనాలు అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో కంది, పత్తి, మినుము అధికంగా సాగవుతోందని అంచనా. దర్శి, త్రిపురాంతకం, తర్లుపాడు ప్రాంతాల్లో కంది సాగుపై రైతులు మొగ్గుచూపుతున్నారు. వర్షాలు కురవగానే భూమిని సారవంతం చేసుకోవడానికి జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలు రాయితీపై అందించేందుకు జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు అందుబాటులో ఉంచాం.