మిరపనారు సాగు ఖర్చు కొనుగోలు ధరలో సగమే.! | Chilli cultivation cost half the price of the purchase.! | Sakshi
Sakshi News home page

మిరపనారు సాగు ఖర్చు కొనుగోలు ధరలో సగమే.!

Published Fri, Aug 22 2014 2:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Chilli cultivation cost half the price of the purchase.!

మార్కాపురం :   ఒక ఎకరాలో మిరప నాటాలంటే సుమారు 10 వేల మొక్కలకు పైగా అవసరమవుతాయి. ఒక్కో మొక్క ధర రూ.0.80  నుంచి రూ.1 వరకు ఉంటుంది. రైతులు మొక్కలు కొనడానికే రూ.12 వేలు ఖర్చు పెట్టాలి. దీనికి తోడు రవాణా ఖర్చులు భారంగా పరిణమిస్తున్నాయి. రైతులే  మిరప నారు పోసి కొన్ని మెళకువలు పాటించడంతో పాటు నారు దశలోనే తెగుళ్లను అరికడితే మంచి దిగుబడి సాధించవ చ్చు.
 
 ఈ జాగ్రత్తలు పాటించండి  
 మిరప నారు మడి  పెంచడానికి చౌడు భూములు తప్ప మిగిలిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఒండ్రు నేలలైతే మరీ మంచిది. మిరప నారుమడి కోసం ఎంపిక చేసుకున్న స్థలానికి పక్కనే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఒక మీటరు వెడల్పు, 40 మీటర ్ల పొడవు గల ప్రాంతంలో పెంచిన నారు ఎకరంలో పొలంలో నాటడానికి సరిపోతుంది. నారు పోసే ప్రదేశంలో 30 కిలోల పశువుల ఎరువు, అరకిలో 15:15:15 కాంప్లెక్స్ ఎరువు వేసి కలియదున్నాలి.

 విత్తన శుద్ధి ముఖ్యం
 ఎంపిక చేసుకున్న మేలు రకం మిర్చి విత్తనాలను శుద్ధి చేసేందుకు ఆర్గానో మెర్కురియల్ కాంపౌండ్ 2 గ్రాముల మందును ఒక కేజీ విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. వీటితో పాటు 200 గ్రాముల అజోప్పైరిల్లమ్‌ను కేజీ విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. జిల్లాలో జెమిని వైరస్, కుకుంబ(దోసకాయ) వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రైసోడియం, ఆర్థోఫాస్పేట్ మందు 2 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల బారి నుంచి మొక్కలను కాపాడాలంటే నారు పీకే వారం రోజుల ముందు కిలో నుంచి కిలోన్నర 3జీ కార్బోలిన్ గుళికలు వేయాలి. విత్తనాలను వరుసలో నాటేటప్పుడు 7.5 సెం.మీ దూరంలో నాటి, నీటి మట్టితో, పశువుల ఎరువుతో క ప్పేయాలి.

 మల్చింగ్ ఇలా..
 నారుమడులను వరి చెత్త లేదా ఏైదె నా వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో మల్చింగ్ చేసి రోజ్ క్యాన్లతో నీటిని చ ల్లాలి. ఒక మి.లీ క్లోరోపైరిఫాస్ మందును ఒక లీటరు నీటిలో కలిపి నారుమడిపై పిచికారీ చేయడం వల్ల చీమలు రాకుండా అరికట్టవచ్చు. విత్తనాలు మడిలో వేసనప్పటి నుంచి అవి మొలకెత్తే వరకు రోజూ రెండు సార్లు నీరు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత రోజుకు ఒకసారి మడిని నీటితో తడపాలి. విత్తనాలు మొలకెత్తే ముందుగా మల్చింగ్ ని నారుమడి నుంచి తొలగించాలి. నారు ను నాటేందుకు పది రోజుల ముందు నీటిని క్రమేపీ తగ్గిస్తే మొక్కలు గట్టిపడతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి 45 రోజుల సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement