రికార్డు స్థాయిలో పత్తి ధర
ఆదోని: స్థానిక మార్కెట్ యార్డులో పత్తిధర మరింత పెరిగింది. బుధవారం క్వింటా రూ.4369 నుంచి రూ.5711 వరకు పలికింది. ఈ ఏడాదిలో ఇదే గరిష్ట ధర. సంక్రాంతి పండుగ ముందు ధర రోజురోజుకు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పత్తి, పత్తి ఉప ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ధరపై ప్రభావం చూపిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో పత్తి ధర ఆశాజనకంగా ఉండడంతో వీలైనంత త్వరగా పత్తి దిగుబడిని అమ్ముకోవాలని రైతులు ఆశిస్తున్నారు. అయితే పల్లె ప్రాంతాల్లో కూలీలు దొరకడం లేదు. దీంతో పత్తికోతలు స్తంభించిపోతున్నాయి. కూలీలు దొరకని రైతులు ఇంటిల్లిపాది పొలంలోనే ఉండి పత్తికోతలు నిర్వహిస్తున్నారు.