పత్తి, వేరుశనగ కొనుగోలుకు చర్యలు
Published Wed, Nov 9 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
- సీసీఐ, ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో కౌంటర్లు
- ధరలు తగ్గుతున్నందునా అధికారుల ఏర్పాట్లు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పత్తి, వేరుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంట ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తుండడం, రోజురోజుకు ధర పతనమవుతుండడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మద్దతు ధర తీసుకుంటే వేరుశనగకు రూ.4220, పత్తికి రూ.4160గా ఉంది. ధరలు పడిపోతే రైతులు నష్టపోకుండా వేరుశనగ, పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నారు. పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరీ తెలిపారు. వేరుశనగకు సంబంధించి కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ మార్కెట్‌ల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వేరుశనగను ఆయిల్‌పెడ్ కొనుగోలు చేసి నాపెడ్‌కు సరఫరా చేస్తుంది.కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక పనులపై దృష్టి సారించినట్లు ఏడీఎం సత్యనారాయణ చౌదరీ స్పష్టం చేశారు.
Advertisement