పత్తి జీరో వ్యాపారంపై విజి‘లెన్స్’
Published Thu, Feb 23 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
– లావాదేవీల వివరాలు సేకరణ
ఆదోని: పత్తి జీరోవ్యాపారంపై విజినెన్స్ అధికారులు దృష్టిసారించారు. విజినెన్స్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ వెంకటరమణ.. బుధవారం ఇద్దరు ట్రేడర్ల పత్తి లావాదేవీల వివరాలను సేకరించారు. మరో ఇద్దరి నుంచి వారి లావాదేవీల వివరాలు నమోదు చేసిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వివరాలు వెల్లడించేందుకు వారు ఆసక్తి చూపలేదు. ఆదోని పట్టణంలో జోరుగా సాగుతున్న పత్తి జీరో వ్యాపారంపై ఇటీవల ‘సాక్షి’లో పలు విశ్లేషణాత్మక కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో విజిలెన్స్ అధికారుల్లో చలనం వచ్చినట్లు తెలుస్తోంది. పట్టణంలో ఎవరెవరు జీరో వ్యాపారం చేస్తున్నారో రహస్యంగా ఆరా తీసిన విజిలెన్స్ అధికారులు రికార్డుల తనిఖీల ద్వారా నిర్దారణ చేసుకునేందుకు సిద్ధః అయినట్లు తెలుస్తోంది. జీరో వ్యాపారం చేస్తున్న వారిలో ఇద్దరు అధికార తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు కూడా ఉన్నారు.
Advertisement