చలి ప్రభావం తగ్గుతూ ఎండ ప్రతాపం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం. మనం కూడా అందుకు రెడీగా ఉండకతప్పదు. ఈ రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఫాస్ట్ ఫ్యాషన్‌ను వదిలేసి మనవైన దేశీయ కాటన్ దుస్తులతో వార్డ్‌రోబ్‌ను సిద్ధం చేసుకుంటే రాబోయే వేసవి రోజులను ఫ్యాషనబుల్‌గానూ.. హాయి హాయిగా, కులాసాగానూ గడిపేయచ్చు.
సీజన్‌కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్‌ను కూడా మార్చుకుంటాం. అందులోనూ వేసవి కంఫర్ట్‌తో గడిపేయాలనుకుంటాం. కాటన్స్ అయితే డల్‌గా ఉంటాయి అనే మాటలు పక్కన పెట్టేసి మోడర్న్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా వైభవంగా వెలిగి΄ోవచ్చు.
మనవైన చేనేతలు కాటన్ అనగానే మనకు ముందుగా ఖాదీ గుర్తుకు వస్తుంది. ఖాదీ చీరలు, షర్ట్‌లే కాదు ఇండో వెస్ట్రన్ స్టైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దీనితో పాటు నారాయణ్‌పేట్, ఇక్కత్, గద్వాల.. వంటి చేనేతలు సంప్రదాయ వేడుకల సందర్భాల్లోనూ ధరించడానికి బాగుంటాయి.
ఇండోవెస్ట్రన్ జంప్‌సూట్స్, ష్రగ్స్, గౌన్లు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్ డిజైన్స్ ఎన్నో ఇప్పుడు మనకు కాటన్ మెటీరియల్‌తో తయారైన డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాజువల్ లేదా కాక్‌టెయిల్ పార్టీ ఏదైనా సందర్భానికి తగినట్టు వీటిని ఎంచుకోవచ్చు.
ఆభరణాల ఊసు కాటన్ మెటీరియిరల్ పైగా వేసవి టైమ్ కాబట్టి ఉడెన్, టెర్రకోట జ్యువెలరీతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎక్కువ అలంకరణ హంగామా లేకుండా సింపుల్ అండ్ ఎలిగేంట్ లుక్స్ అనిపించేలా రెడీ అవడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు.
బ్లాక్ ప్రింట్ గౌన్స్ కాటన్‌పై వేసిన బ్లాక్ ప్రింట్ మెటీరియల్‌తో ఏ స్టైల్ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడానికి సౌకర్యంగానే కాదు, ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగానూ కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment