ఆగిన రైతు గుండె
Published Sun, Jul 17 2016 9:16 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కౌతాళం: వానలు పడక పత్తిపంట ఎండిపోవడంతో అది చూసిన ఓ రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... రైతు వెంకోబ(34)కు పది ఎకరాల పొలం ఉంది. దీనికి అదనంగా మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 40 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంటను సాగు చేశాడు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.8వేలు ఖర్చు చేశాడు. అనుకోకండా వాతావరణంలో మార్పులతో పదిరోజులుగా వర్షాలు కురవక, విపరీత గాలితో దాదాపు 30 ఎకరాల పంట ఎండిపోంది. దీంతో రూ.3లక్షల నష్టం వాటిల్లిందని.. అప్పు ఎలా తీర్చాలంటూ చింతిస్తూ శనివారం రాత్రి గుండెపోటుకు గురై మతి చెందాడు. మతుడికి భార్య నరసమ్మ, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ఉన్నారు. కుటుంబ పెద్ద మతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement