పత్తి @ రూ.9,150.. | Sakshi
Sakshi News home page

పత్తి @ రూ.9,150..

Published Tue, Nov 15 2022 3:16 AM

Cotton Price In Jammikunta Cotton Market - Sakshi

జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవ సాయ పత్తి మార్కెట్‌లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పెరుగుతుండటంతో సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్‌ పత్తి రూ.9,150 పలికింది.

మార్కెట్‌కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.9,150, మోడల్‌ ధర రూ.9,000, కనిష్ట ధర రూ.8,000 పలికింది. గన్నీ సంచుల్లో 60 మంది రైతులు 107 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,800, మోడల్‌ ధర రూ.8,500, కనిష్ట ధర రూ.6,000తో ఖరీదు చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement