ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో: నలుగురికి గాయాలు
Published Wed, May 10 2017 2:41 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం ట్రాక్టర్‌ను ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా జొంగంపల్లి, రెడ్డిపల్లివాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement