జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతను చూ పుతూ ‘మా‘నీరు’ మహాప్రభో’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్ర చురితమైన కథనానికి నాయకులు, అధికారులు స్పందించారు. భూగర్భజల, ప్రజా ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు విలాసాగర్‌లోని మానేరును ఉదయమే సందర్శించారు.
భూగర్భజ లాల అసిస్టెంట్ డెరైక్టర్ హరికుమార్, జియాలజిస్ట్ మోహన్‌రా వు నీటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. నీటి శాతం పరిశీలించారు. వారి వెంట పబ్లిక్ ెహ ల్త్ రామగుండం డీఈ మహేందర్‌రెడ్డి, జమ్మికుంట నగర పంచాయతీ ఏఈ చంద్రమౌళి ఉన్నారు.
ఇసుక తెచ్చిన ఇక్కట్లు
మానేరులో వ్యాపారులు అక్రమంగా ఇసుక తోడేస్తుండడం ప్రజలకు శాపంగా మారినట్లు తెలుస్తోంది. జమ్మికుంటకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చేందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ గత ఏడాది రూ.65 కోట్లతో టీపీఆర్ సిద్ధం చేసి ఎంపీ, ఎమ్మెల్యేలకు సమర్పించగా నిధుల మంజూరు కోసం వారు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను పరిశీలించిన ప్రభుత్వం నీటి సామర్థ్యం కోరుతూ భూగర్బజల శాఖ అనుమతి కోరింది.
గతంలో ఆ శాఖ అధికారులు విలాసాగర్ శివారులోని మానేరును సందర్శించి నీటి పరీక్షలు చేసి ప్రభుత్వానికి నీటి సామర్థ్యం లేదంటూ, వేసవిలో నీటి కొరత ఉందంటూ నివేదిక సమర్పించారు. వాగు నుంచి ఇసుక రవాణాతో నీటి సరఫరా కష్టమని పేర్కొన్నారు. దీంతో రూ.65 కోట్లు నిలిచిపోయాయి.
నీటి సమస్య తలెత్తదు..
వేసవిలో కాలువ నీళ్లతోపాటు, శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్ట్ నీళ్లు వస్తాయని ఎలాంటి నీటి సమస్య తలెత్తదని మున్సిపల్ అధికారులు భూగర్బ జల శాఖకు సూచించారు. తాజాగా భూగర్భజల అధికారులు ఇచ్చే నివేదికపైనే నిధుల మంజూరు ఆధారపడి ఉంది.
పెరిగిన ఖర్చు..
తాగునీటి సమస్య పరిష్కారానికి మరో చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తోంది. గతంలో తయారు చేసిన అంచనా వ్యయం మరో పది శాతం పెరిగినట్లు తాజా లెక్కలు తెలుపుతున్నాయి. అధికారుల వ్యతిరేక నివేదిక పుణ్యమా అని ఏడాదిలో రూ.పది కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏదేమైనా భూగర్భ జల అధికారులు త్వరగా ప్రభుత్వానికి గ్రౌండ్‌వాటర్‌పై నివేదిక సమర్పిస్తేనే జమ్మికుంటకు నీటి కొరత తీరనుంది.
మానేరులో భూగర్భ నీటి పరీక్షలు
Published Tue, Jan 21 2014 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement