ఉద్యోగం రాదేమోనని..
Published Mon, Nov 7 2016 2:55 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
జమ్మికుంట: తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాలి జమ్మికుంట గ్రామానికి చెందిన మంత్రిరాజు(23)అనే యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. హమాలీపని చేసుకునే సమ్మయ్య, రాజమ్మ దంపతులకు మంత్రి రాజు అనే కుమారుడున్నాడు. ఎంబీఏ పూర్తయిన మంత్రిరాజు గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఆదరువుగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement