
హుజూరాబాద్: ‘సీఎంను గద్దె దింపేందుకు నేను కుట్ర చేశానని, సీఎం కుర్చీకి ఎసరు పెట్టానని హరీశ్‌రావు అంటున్నారు. ఆ ఎసరు పెట్టేది అల్లుడిగా నువ్వు.. కొడుకుగా కేటీఆర్.. బిడ్డగా కవిత చేస్తుందేమో. నాలాంటి వాడు కాదు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఈటల క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, తనను మంత్రిగా తొలగించినప్పుడు భూ ఆక్రమణ ఆరోపణలు అన్నారని.. ఇప్పుడు సీఎం కుర్చీ కోసం కుట్ర చేశానని అంటున్నారని.. ఇందులో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఏం మాట్లాడినా ప్రజల కోసమేనని అన్నారు. తనను వైద్య, ఆరోగ్య శాఖలో పడేస్తే పనిచేయలేక కొట్టుకుపోతాడని అనుకున్నారని.. అయితే అక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా కష్టపడి పని చేశానని తెలిపారు. ఫామ్ హౌస్‌లో కుట్రచేసి తనను తొలగించారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment