'రైతులకు అన్యాయం జరగనివ్వం' | singireddy bhaskar reddy visits jammikunta cotton market | Sakshi
Sakshi News home page

'రైతులకు అన్యాయం జరగనివ్వం'

Published Tue, Feb 24 2015 2:09 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

singireddy bhaskar reddy visits jammikunta cotton market

జమ్మికుంట రూరల్: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో కొనుగోళ్ల తీరును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. మార్కెట్ లో పత్తి కొనుగోళ్లలో జాప్యం, మోసాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బస్తాల్లో తీసుకొచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి బస్తాల్లో తేమ ఉంటుందంటూ వాటిని కొనుగోలు చేయడానికి నిరాకరించడం సరికాదన్నారు. 

రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో జరుగుతున్నకొనుగోళ్ల వ్యవహారంపై వివరాలు కావాలంటూ భాస్కర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement