cotten
-
ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు
ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఉక్తాపూర్ కాలనీకి చెందిన కళ్యాణి(24) పురుటి నొప్పులతో గత శనివారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు అపరేషన్ చేసి మృత శిశువును తీశారు. దీంతో శోక సంద్రంలో మునిగిన ఆమె ఇంటికి వెళ్లింది. అయితే ఆమెకు రెండు రోజులుగా తిరిగి కడుపు నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడంది. దీంతో ఆమెకు తిరిగి ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన బాధితులరాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
'రైతులకు అన్యాయం జరగనివ్వం'
జమ్మికుంట రూరల్: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో కొనుగోళ్ల తీరును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. మార్కెట్ లో పత్తి కొనుగోళ్లలో జాప్యం, మోసాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బస్తాల్లో తీసుకొచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి బస్తాల్లో తేమ ఉంటుందంటూ వాటిని కొనుగోలు చేయడానికి నిరాకరించడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కెట్లో జరుగుతున్నకొనుగోళ్ల వ్యవహారంపై వివరాలు కావాలంటూ భాస్కర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు.