ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు | surgery failed in adilabad distirict | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు

Published Tue, Mar 31 2015 2:21 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు - Sakshi

ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు

ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఉక్తాపూర్ కాలనీకి చెందిన కళ్యాణి(24) పురుటి నొప్పులతో గత శనివారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు అపరేషన్ చేసి మృత శిశువును తీశారు. దీంతో శోక సంద్రంలో మునిగిన ఆమె ఇంటికి వెళ్లింది.

అయితే ఆమెకు రెండు రోజులుగా తిరిగి కడుపు నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడంది. దీంతో ఆమెకు తిరిగి ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన బాధితులరాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement