ఇంటి స్థలం కోసం ఆత్మహత్యాయత్నం | man suicide attempt in karimnagar district | Sakshi
Sakshi News home page

ఇంటి స్థలం కోసం ఆత్మహత్యాయత్నం

Published Wed, Jan 11 2017 12:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

man suicide attempt in karimnagar district

జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లా తన ఇంటి స్థలం తనకు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి జమ్మికుంట నగరపంచాయతీ కార్యాయలం ఎదుట ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోవడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు.. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు స్థానిక కూరగాయల మార్కెట్‌లో హమాలీ పని చేస్తున్నాడు. ఆయన తాతకు జమ్మికుంట మండలకేంద్రంలోని వర్తకసంఘం సమీపంలో 4 గుంటల భూమి ఉంది. దీనిని 15 ఏళ్ల క్రితం రాజు బావ , ఇద్దరు వ్యక్తులకు అమ్మేశాడు. తన స్థలం తనకు ఇప్పించాలంటూ రాజు ఇప్పుడు ఆందోళనకు దిగాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement