కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.
జమ్మికుంట, న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో వంట మనిషి రాజ్‌మహ్మద్‌ను పోలీసులు గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ను తొక్కిపెట్టాలనుకున్న ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేయగా, ఏఎస్‌డబ్ల్యూవో, వార్డెన్, మరో ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నారు.
జమ్మికుంట సీఐ భూమయ్య తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కమలాపూర్ మండలానికి చెందిన బాలికపై అందులోనే పనిచేస్తున్న వంట మనిషి రాజ్‌మహ్మద్(55) ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పక్క గదిలో ఉన్న బాలికలు ఈ విషయాన్ని ఏఎస్‌డబ్ల్యూవో దృష్టికి వెళ్లగా.. వారు తొక్కిపెట్టే ప్రయత్నం చేసి రాజ్‌మహ్మద్‌ను మరో పాఠశాలకు డెప్యుటేషన్‌పై పంపించారు. విద్యార్థుల ఆందోళనతో బాలికను వైద్యపరీక్షలకు పంపించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.