హుజురాబాద్: జమ్మికుంటలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
హుజూరాబాద్: టీఆర్‌ఎస్‌కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులను టీఆర్‌ఎస్‌లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు.
చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా?
‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్‌ఎస్ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్‌లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యుడు నరసింహ, బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు, రమేశ్‌రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
Comments
Please login to add a commentAdd a comment