Eatela Rajendar
-
టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
హుజూరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులను టీఆర్ఎస్లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? ‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్ఎస్ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్‌లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యుడు నరసింహ, బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు, రమేశ్‌రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక -
ఆరోగ్యశ్రీ ఆగింది
ప్రభుత్వ వాదన... ఇప్పటివరకు రూ. 450 కోట్ల బకాయిలు చెల్లించాం మిగిలిన బకాయిలు రూ. 600 కోట్లే వచ్చే నెలలో రూ. 200 కోట్లు చెల్లిస్తాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సమ్మెలో లేవు బంద్ ప్రభావం పెద్దగా లేదు ఆసుపత్రుల మాట... బకాయిలు రూ. 1,500 కోట్లు ఇప్పటివరకు 15–20 శాతం బకాయిలే అందాయి ప్యాకేజీ సొమ్ము పెంచాలి ప్రభుత్వంతో చర్చల్లో స్పష్టత రాలేదు నేడు, రేపు కూడా ప్రభుత్వంతో చర్చిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆçస్పత్రులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బంద్ యథావిధిగా కొనసాగుతుందని ప్రైవేటు నెట్వర్క్ ఆçస్పత్రులు స్పష్టం చేశాయి. అయితే కార్పొరేట్ ఆçస్ప త్రులు మాత్రం సమ్మెలో పాల్గొనడం లేదని ప్రభు త్వం తెలిపింది. ఇతర నెట్వర్క్ ఆçస్పత్రులు కూడా సేవలు నిలిపివేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలంటూ ప్రైవేటు నెట్వర్క్ ఆçస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) రోగులకు వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆయా ఆశాఖ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్లో చర్చలు జరిపారు. తెలంగాణ నెట్వర్క్ ఆçస్పత్రుల సంఘం, సూపర్ స్పెషాలిటీ ఆçస్పత్రుల సంఘం తో వేర్వేరుగా చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు తాము రూ. 450 కోట్ల మేరకు బకాయిలు చెల్లించామని, మరో రూ. 600 కోట్ల బకాయిలే ఉన్నాయని స్ప ష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న బిల్లులను కూడా బకాయిలుగా ఆస్పత్రులు చెబుతున్నాయన్నారు. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకూడదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతా... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ప్యాకేజీ సొమ్ము పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వానికి ప్రాధాన్యం కలిగిన అంశమన్నారు. ఆసుపత్రుల కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంలో సవరణలు చేయాలని కోరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఆ మేరకు తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ రోగులకు, ఈహెచ్ఎస్ రోగులకు కూడా సేవలు అందడంలేదని మంత్రి దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా అటువంటి పరిస్థితి లేదన్నారు. ఎక్కడన్నా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. 240 ఆస్పత్రుల్లో సేవలు బంద్ మొదటి రోజు 240 ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు నిలిపివేసినట్లు తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం నేత డాక్టర్ రాకేశ్ వెల్లడించారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు ఎటువంటి స్పష్టత రాలేదని, అందువల్ల యథావిధిగా సేవల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. తాము రూ. 1,500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబితే, ప్రభుత్వం మాత్రం రూ. 800 కోట్లే ఉన్నా యంటోందన్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం తో చర్చలు జరుపుతామన్నారు. ఇటీవల రూ. 300 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపిందని, కానీ ఆయా ఆస్పత్రులకు ఆ మేరకు సొమ్ము వచ్చి న పరిస్థితి కనిపించడంలేదన్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సందర్భంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామని చర్చల్లో మంత్రి ఈటల పేర్కొన్నారని, అయినా బకాయిలు ఇంకా ఉంటాయన్నారు. శని, ఆదివారాల్లోనూ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతామన్నారు. కాగా, చర్చల సందర్భంగా ఒక కీలకాధికారి ఆరోగ్యశ్రీ ఆçస్పత్రులు తమ సొమ్ము తోనే బతుకుతున్నాయనంటూ చేసిన వ్యాఖ్యలపై ఆస్పత్రుల యాజమాన్యాలు మండిపడ్డాయి. -
విద్యార్థి నేత నుంచి మంత్రిగా
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : ఓటమెరుగని నాయకుడు ఈటెల రాజేందర్ మరో రికార్డు సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేత నుంచి మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. విద్యార్థి నేతగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వివాహం తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి ప్రస్తుతం పౌల్ట్రీ రంగా న్ని శాసించే స్థాయికొచ్చారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈటెల రాజేందర్ మూడుసార్లు సార్వత్రిక, రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కమలాపూర్ టు హైదరాబాద్ కమలాపూర్‌లో 20 మార్చి, 1964లో ఈటెల మల్లయ్య, వెంకటమ్మ దంపతుల ఐదో సంతానంగా ఈటెల రాజేంద ర్ జన్మించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ స్కూల్లో 9, పదో తరగతులు పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఆలియా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న సమయంలో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఎల్ఎల్బీ చదివారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే జమునారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం పౌల్ట్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2002లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా నియమితులయ్యారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా రెండోసారి నియమితులయ్యారు. మరోసారి తెలంగాణ కోసం రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.