vaddera sangam
-
టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
హుజూరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులను టీఆర్ఎస్లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? ‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్ఎస్ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్‌లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యుడు నరసింహ, బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు, రమేశ్‌రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక -
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం
పటాన్చెరు: వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్‌రోడ్డు శివారులోని ముత్తంగి గ్రామ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వడ్డెర లక్ష్య సాధన ఆత్మ గౌరవ సభ కు దామోదరతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వడ్డెరలకు న్యాయం చేస్తుందని దామోదర హామీ ఇచ్చారు. 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. 1976కు ముందు వడ్డెరలకు డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) రిజర్వేషన్ అమల్లో ఉండేదని, ఆ విధానంతో పాటు ఎస్టీ జాబితాలో ఆ కులాన్ని చేర్చే అంశంపై కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన కులంగా వడ్డెరలు ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎర్రటి ఎండలో బండలను, కొండలను పిండి చేసే వారు తమ సంపాదనలో సగం వరకు బెల్టు షాపులకే వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండలు కొట్టే వారి భవిష్యత్ తరతరాలు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. -
'వడ్డెర్లను ఎస్టీల జాబితాలో చేర్చాలి'
విజయనగరం: సంచార జాతులుగా దుర్భర జీవితం గడుపుతున్న వడ్డెర్లను ఎస్టీల జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం నేతలు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆదివారం సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నేతలు కన్నయ్య, వెంకటరమణ, శివ, శంకర్ మాట్లాడారు. వడ్డెర్ల కోసం ప్రత్యేక కళాశాలలు ఏర్పాటుచేయాలని, స్కాలర్షిప్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. క్వారీ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని, పనిచేస్తున్న క్వారీల్లో 30 శాతం వాటా వడ్డెర్లకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకున్నారు.