![తుపాకీ నీడలో పత్తి కొనుగోళ్లు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71415918660_625x300.jpg.webp?itok=9hZ1SH2u)
తుపాకీ నీడలో పత్తి కొనుగోళ్లు
సమ్మెలోకి ఎడ్ల బండ్లకార్మికులు
తక్‌పట్టీలు ఇవ్వని అధికారులు
జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ఎడ్ల బండ్ల కార్మికుల సమ్మె పిలుపుతో కొనుగోళ్లలో అనిశ్చితి ఏర్పడింది. పత్తి కొనుగోళ్లను కార్మికులు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కరీంనగర్ నుం చి ఏఆర్ పోలీసులను ఉదయమే మార్కెట్లో దించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో పత్తి కొనుగోళ్లకు ఆటంకాలు కలగకుండా తుపాకీ నీడలో మార్కెట్ పహారా కా శారు. ఉదయం 10 గంటలకు వివిధ ప్రాం తాల నుంచి రైతులు లూజ్ పత్తిని వాహనాల్లో మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురాగా.. సీసీఐ 400 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసింది. క్విం టాల్‌కు రూ.4050, రూ. 3,969 ధరలు పెట్టా రు. ప్రైవేట్ వ్యాపారులు 275 క్వింటాళ్ల పత్తిని రూ.3,980 నుంచి 3880 వరకు కొనుగోళ్లు చే పట్టారు. అరగంటలో లూజ్ పత్తి అమ్మకాలు పూర్తి కాగా.. వాహనాలు సైతం మిల్లులకు తరలిపోయాయి. తుపాకీ నీడలో కొనుగోళ్లు షూరు కావడంతో మార్కెట్లో ఏం జరుగుతుందోననే రైతులు భయంతో గడిపారు. బస్తాల్లో వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోళ్లు చేసినా తక్‌పట్టీలు ఇవ్వలేదు. దీంతో రైతులు ఏం చేయలో తోచక ఎదురుచూపులు చూస్తున్నారు.కొందరు ఆరుబయట నుంచే నేరుగా మిల్లుల్లోకి తీసుకెళ్లి అమ్ముకున్నారు.
సమ్మె ప్రారంభం
జమ్మికుంట పత్తి మార్కెట్లోకి లూజ్‌పత్తి వాహనాలు రావడంతో ఉపాధి కోల్పోతున్నామని మార్కెట్ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని ఎడ్ల బండ్ల కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె సాగుతుందని కార్మికులు ప్రకటించారు. మొదటి రోజు కార్మికులు మార్కెట్ గేట్ వద్ద సమ్మె చేపట్టారు. వారు రవాణాకు దూరంగా ఉన్నారు.