Labor strike
-
ఇజ్రాయెల్.. ‘సంస్కరణం’
నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గల్లాంట్ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఏమిటీ సంస్కరణలు ► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు. ► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టే శక్తివంతం. ► ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నేస్సెట్’పై నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. ► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్‌కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం. ► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. ► ఇజ్రాయెల్ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి. ► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధం లేని గ్రూప్‌గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు. ► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు. ► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ► ఇజ్రాయెల్‌లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు. ► పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని(ఓవర్‌రైడ్ క్లాజ్) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు. ► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన. ► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని ఇంకో ప్రతిపాదన చేశారు. నెతన్యాహూకు ప్రయోజనమేంటి? ► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు. కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఏం జరగొచ్చు? జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరాలు జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు నష్టమే! ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్‌లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
18న సడక్ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సంఘాలు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని నిర్వహించాయి. శనివారం చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి వందల సంఖ్యలో కారి్మకులు గమ్యం చేరటంతో వచి్చన ఊపుతో ఉత్సాహంగా ఉన్న సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్ బంద్’నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 37 రోజులు గా సమ్మె చేస్తున్నా, స్వయంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం దిగిరాకపోవటాన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, కో కనీ్వనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరశన ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన జేఏసీ నేతలు అనంతరం కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ కోకనీ్వనర్లు రాజిరెడ్డి, సుధ తదితరులతో కలసి కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా కోరా లని జేఏసీ నిర్ణయించింది. సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసి వారిని కలసి వివ రించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఇళ్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇళ్లను ముట్టడించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ కన్వీనర్, కో కనీ్వనర్లు ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరశనలు ప్రారంభించనున్నారు. ఇందిరాపార్కు వద్ద అనుమతి లభించని పక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో చేపట్టనున్నట్టు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. ఆర్టీసీ కారి్మకులపై ప్రభుత్వ తీరు, చలో ట్యాంక్‌బండ్‌లో పోలీసుల ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్‌బండ్‌లో మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, చాలామంది గాయపడ్డారని, దీనిపై అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చలో ట్యాంక్‌బండ్ వరకు చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను, ఇప్పటివరకు చనిపోయిన కారి్మకులకు సంబంధించిన ఫొటో వివరాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని అనుకున్నామని, కార్యక్రమం ఖరారయ్యాక కచి్చతమైన తేదీలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వీలైతే ఓరోజు హైదరాబాద్‌లో కూడా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సడక్‌బంద్‌లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఆ పార్టీ నేత సంపత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత నరసింహారావు, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత సుధాకర్, ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనుమతివ్వకపోగా దమనకాండనా..? ‘సమ్మెను ఇప్పటివరకు శాంతియుతంగానే నిర్వహించాం. అదే పంథాలో ట్యాంక్‌బండ్‌పై గంట సేపు నిరసన వ్యక్తం చేస్తామని కోరినా అనుమతి ఇవ్వలేదు. చలో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన కారి్మకులు, మహిళలపై పోలీసులు దమనకాండకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు యతి్నస్తున్నారు. చలో ట్యాంక్‌బండ్‌లో మావోయిస్టులు చొరబడ్డారన్న ఆరోపణ ను ఖండిస్తున్నాం. రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు’అని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు తోడుగా విపక్షాల కార్యకర్తలు.. ఇక నుంచి ఆర్టీసీ జేఏసీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. సమ్మె కార్యాచరణకు మద్దతు, సంఘీభావం తెలపటానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఆయా పారీ్టలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ–అఖిలపక్ష నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అప్పుడు ప్రజల మద్దతు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దీనికి అన్ని పారీ్టలు సమ్మతించినట్లు సమాచారం. సోమవారం హైకోర్టులో మళ్లీ వాదనలు ఉన్నందున మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ సమ్మె అంశాన్ని జాతీయ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆదివారం నిర్ణయించింది. సోమ లేదా మంగళవారాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్‌ను కలసి ఆర్టీసీ కారి్మకులకు న్యాయం చేయాలని కోరనుంది. ఇందుకోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. -
నగరమా.. నరకమా?
-
ముగిసిన సమ్మె... షూటింగ్స షురూ!
వారం రోజుల పైగా తెలుగు చలనచిత్ర సీమలో సాగుతున్న కార్మికుల సమ్మెకు తెరపడింది. హైదరాబాద్‌లోని ఎ.పి. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స ఆవరణలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ వ్యవహారం ఒక కొలిక్కివచ్చింది. ఫిల్మ్ చాంబర్ మధ్యవర్తిత్వంలో ఎ.పి. చలనచిత్ర కార్మికసమాఖ్యకూ, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికీ మధ్య చర్చలు జరగడానికి దర్శకులు, కెమేరామన్లు, ఆర్ట డెరైక్టర్ల అసోసియే షన్లు చొరవ చూపడంతో రెండు పక్షాలూ ఒక అంగీకారానికొచ్చాయి. దీంతో, శనివారం నుంచి సినీ షూటింగ్‌లు మళ్ళీ మొదలయ్యాయి. చిన్న సినిమాలకు పనిచేస్తున్నప్పుడు వేతనాల విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలంటూ నిర్మాతల మండలి ఇటీవల చేసిన ప్రతిపాదనకు సైతం సమాఖ్య ఎట్టకేలకు అంగీకరించింది. అయితే, సినిమా బడ్జెట్, షూటింగ్ దినాల లాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చాంబర్, సమాఖ్య కలసి ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అన్నది నిర్ణయిస్తాయి. ఈ చర్చల్లో కార్మికుల ఫెడరేషన్ పక్షాన కొమర వెంకటేశ్, రాజేశ్వరరెడ్డి, ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పక్షాన చాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, దామోదర్ ప్రసాద్, ‘స్రవంతి’ రవికిశోర్, పరుచూరి ప్రసాద్, దర్శకుడు తేజ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ‘‘24 శాఖల సభ్యుల్ని మాత్రమే పనిలోకి తీసుకోవాలనే నిబంధన కొంత ఇబ్బందికరం. కొత్త చట్టాలు, ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా’ చట్టం లాంటివి వచ్చిన నేపథ్యంలో - మునుపటి పద్ధతిలోనే ఒప్పందం కుదుర్చుకుంటే, భవిష్యత్తులో కేసులొచ్చే ప్రమాదం ఉంది. అందుకే, నిర్మాతల మండలి, ఫెడరేషన్లు - ఈ రెండు పక్షాల లాయర్లూ కలసి కూర్చొని, నెలరోజుల లోపల ఒక నిర్దుష్టమైన ఒప్పందం రూపొంది స్తారు’’ అని వివరించారు. ‘‘గతంలో అంగీకరించిన మిగతా అంశాలన్నీ యథాతథంగా అమలవుతాయి’’ అని ఆయన తెలిపారు. మరోపక్క ఈ సమ్మె వల్ల షూటింగ్‌లు ఆగిపోయి, ఇబ్బందులకు గురైన సినిమాలకు వెసులుబాటు కల్పించాలని కూడా ఫిల్మ్ చాంబర్ తీర్మానించింది. సెట్లు వేసుకొని, షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇబ్బందిపడ్డ నిర్మాతలకు స్టూడియోలు సహకరించాలని కోరింది. అలాగే ఆగిన చిత్రాలకు సహకరించిన తరువాతే కొత్త చిత్రాలకు అంగీకరించాల్సిందిగా నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే పెరిగిన కొత్త వేతనాలను అక్టోబర్ 21 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద సమ్మె విరమణ కావడంతో, సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సినిమాల షూటింగ్ మళ్ళీ జోరందుకుంది. -
తుపాకీ నీడలో పత్తి కొనుగోళ్లు
సమ్మెలోకి ఎడ్ల బండ్లకార్మికులు తక్‌పట్టీలు ఇవ్వని అధికారులు జమ్మికుంట పత్తి మార్కెట్లో ఎడ్ల బండ్ల కార్మికుల సమ్మె పిలుపుతో కొనుగోళ్లలో అనిశ్చితి ఏర్పడింది. పత్తి కొనుగోళ్లను కార్మికులు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కరీంనగర్ నుం చి ఏఆర్ పోలీసులను ఉదయమే మార్కెట్లో దించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో పత్తి కొనుగోళ్లకు ఆటంకాలు కలగకుండా తుపాకీ నీడలో మార్కెట్ పహారా కా శారు. ఉదయం 10 గంటలకు వివిధ ప్రాం తాల నుంచి రైతులు లూజ్ పత్తిని వాహనాల్లో మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురాగా.. సీసీఐ 400 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసింది. క్విం టాల్‌కు రూ.4050, రూ. 3,969 ధరలు పెట్టా రు. ప్రైవేట్ వ్యాపారులు 275 క్వింటాళ్ల పత్తిని రూ.3,980 నుంచి 3880 వరకు కొనుగోళ్లు చే పట్టారు. అరగంటలో లూజ్ పత్తి అమ్మకాలు పూర్తి కాగా.. వాహనాలు సైతం మిల్లులకు తరలిపోయాయి. తుపాకీ నీడలో కొనుగోళ్లు షూరు కావడంతో మార్కెట్లో ఏం జరుగుతుందోననే రైతులు భయంతో గడిపారు. బస్తాల్లో వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోళ్లు చేసినా తక్‌పట్టీలు ఇవ్వలేదు. దీంతో రైతులు ఏం చేయలో తోచక ఎదురుచూపులు చూస్తున్నారు.కొందరు ఆరుబయట నుంచే నేరుగా మిల్లుల్లోకి తీసుకెళ్లి అమ్ముకున్నారు. సమ్మె ప్రారంభం జమ్మికుంట పత్తి మార్కెట్లోకి లూజ్పత్తి వాహనాలు రావడంతో ఉపాధి కోల్పోతున్నామని మార్కెట్ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని ఎడ్ల బండ్ల కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె సాగుతుందని కార్మికులు ప్రకటించారు. మొదటి రోజు కార్మికులు మార్కెట్ గేట్ వద్ద సమ్మె చేపట్టారు. వారు రవాణాకు దూరంగా ఉన్నారు.