సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం | Ponnam Prabhakar call to stop seemandhra meetings | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

Published Thu, Mar 27 2014 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

జమ్మికుంట: తెలంగాణలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జమ్మికుంటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తమ పెత్తందారీతనాన్ని చెలాయించేందుకు సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ అలాంటి సభలను అడ్డుకోవాల్సిన అవసరముందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభను ఎందుకు అడ్డుకోలేదని టీఆర్‌ఎస్, టీఎన్‌జీవో నాయకులను ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement