న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లో శనివారం 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం పోలింగ్ 63.36 శాతానికి పెరిగింది. పశ్చిమబెంగాల్ పరిధిలోని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 82.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి ఆదివారం వెల్లడించారు.
ఇప్పటివరకు ముగిసిన ఆరు దశలను పరిశీలిస్తే అన్నింటికన్నా తక్కువగా ఐదో దశలో 62.2 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశ కింద 2019లో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి దశలోని తుది పోలింగ్ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్ శాతాలు పెరుగుతాయని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment