Election commission: హౌసింగ్‌ సొసైటీల్లోనూ పోలింగ్‌ బూత్‌లు | Election commission plans to introduce polling stations in high-rise apartments and gated colonies in Lucknow | Sakshi
Sakshi News home page

Election commission: హౌసింగ్‌ సొసైటీల్లోనూ పోలింగ్‌ బూత్‌లు

Published Mon, Apr 15 2024 5:14 AM | Last Updated on Mon, Apr 15 2024 5:14 AM

Election commission plans to introduce polling stations in high-rise apartments and gated colonies in Lucknow - Sakshi

యూపీ సీఈవో నవదీప్‌ రిన్వా వెల్లడి

లక్నో: కేంద్ర రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ పలు చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్‌ సొసైటీల్లో సైతం 200కు పైగా పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ నవదీప్‌ రిన్వా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ‘యూపీలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం స్వల్పంగా ఉంటోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్‌ శాతంలో మొదటి స్థానం సంపాదించాలనేదే మా లక్ష్యం’అని ఆయన వివరించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఓటింగ్‌ శాతం 59.11 మాత్రమేనన్నారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘తక్కువ ఓటింగ్‌ నమోదయ్యే గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల హౌసింగ్‌ సొసైటీల్లో ఈసారి పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మొత్తం 200పైగా బూత్‌లలో ఎక్కువ భాగం నోయిడాలోనే ఉంటాయి. ఆ తర్వాత లక్నో, కాన్పూర్, బరేలీ, మథురలోనూ ఇవి ఉంటాయి. ఈసారి ఓటింగ్‌ శాతం 60పైగా ఉంటుందన్న నమ్మకముంది’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement