ఇండోర్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణాదారులు ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. సాధారణంగా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పారీ్టలు ఉచితాలు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్‌లో పారీ్టలకు బదులు దుకాణాదారుల సంఘం ఉచితం ఆఫర్‌తో ముందుకొచి్చంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ముందుగా ఓటేసే అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటించింది.
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే తమ ఆఫర్‌లోని అంతరార్థమని ఆ సంఘం అసలు విషయం బయటపెట్టింది. 230 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేదఫాలో నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. పోహా, జిలేబీ ఆఫర్‌పై ‘56 దుకాణ్ ట్రేడర్స్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజాన్ శర్మ పీటీఐతో మాట్లాడారు. ‘ నగర స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఇండోర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్ శాతంలోనూ తొలిస్థానంలో నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఓటర్లను ఉచిత పోహా, జిలేబీతో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం.
నవంబర్ 17వ తేదీన ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఓటు వేసి వేలికి సిరా గుర్తు చూపిస్తారో వారికే పోహా, జిలేబీ ఉచితంగా ఇస్తాం. ఉదయం తొమ్మిది తర్వాత సిరా గుర్తు చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తాం’ అని శర్మ వివరించారు. ఇండోర్ నగరంలో ఉన్న ఈ ‘56 దుకాణ్’కు స్వచ్ఛమైన వీధి ఆహార హబ్ గుర్తింపునిస్తూ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికెట్ జారీచేసింది. ఇండోర్ అర్బన్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మొత్తంగా ఇక్కడ 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. జిలేబీ ఆఫర్‌ను ఇక్కడి ఓటర్లు ఏ మేరకు సది్వనియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment