Local shops
-
ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ
ఇండోర్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణాదారులు ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. సాధారణంగా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పారీ్టలు ఉచితాలు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్‌లో పారీ్టలకు బదులు దుకాణాదారుల సంఘం ఉచితం ఆఫర్‌తో ముందుకొచి్చంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ముందుగా ఓటేసే అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే తమ ఆఫర్లోని అంతరార్థమని ఆ సంఘం అసలు విషయం బయటపెట్టింది. 230 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేదఫాలో నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. పోహా, జిలేబీ ఆఫర్‌పై ‘56 దుకాణ్ ట్రేడర్స్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజాన్ శర్మ పీటీఐతో మాట్లాడారు. ‘ నగర స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఇండోర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్ శాతంలోనూ తొలిస్థానంలో నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఓటర్లను ఉచిత పోహా, జిలేబీతో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 17వ తేదీన ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఓటు వేసి వేలికి సిరా గుర్తు చూపిస్తారో వారికే పోహా, జిలేబీ ఉచితంగా ఇస్తాం. ఉదయం తొమ్మిది తర్వాత సిరా గుర్తు చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తాం’ అని శర్మ వివరించారు. ఇండోర్ నగరంలో ఉన్న ఈ ‘56 దుకాణ్’కు స్వచ్ఛమైన వీధి ఆహార హబ్ గుర్తింపునిస్తూ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికెట్ జారీచేసింది. ఇండోర్ అర్బన్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మొత్తంగా ఇక్కడ 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. జిలేబీ ఆఫర్‌ను ఇక్కడి ఓటర్లు ఏ మేరకు సది్వనియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. -
అవును ఇది నిజమే కదా! మనసులను తాకే మాట?
నిత్యం వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నా వీలుచూసుకుని సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే బిజినెస్ పర్సన్స్‌లో ఆర్పీజీ గ్రూపు సీఈవో హర్ష్ గోయెంకా ఒకరు. క్రికెట్ మొదలు పాలిటిక్స్ వరకు కాంటెంపరరీ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. కొన్ని సార్లు అవి నవ్వులు పూయించగా మరి కొన్ని సార్లు సరికొత్త ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. అయితే ఈసారి ఆయన మనసులను హత్తుకునేలా లోకల్ షాపింగ్‌పై ట్వీట్ చేశారు. లోకల్ కష్టాలు ఈ కామర్స్ రంగం జోరందుకోవడంతో లోకల్ మార్కెట్‌కు కొంత మేర కోత పడిందనేది కాదనలేని వాస్తవం. అలాగే తళుకుబెళులతో పాటు హంగు ఆర్భాటం ఉండే బ్రాండెడ్ షోరూమ్స్ చిన్నచిన్న పట్టణాలకు కూడా విస్తరించడం కూడా లోకల్ షాపింగ్‌ను దెబ్బ తీస్తోంది. కాలానుగుణంగా వస్తున్న ఈ మార్పులకు అందరం మౌనసాక్షలుగానే మిగిలిపోయాం. అయితే లోకల్ షాపింగ్ ఎందుకు అవసరమో చెబుతూ ఓ షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డు ఆలోచింప చేసే విధంగా ఉంది. అదే విషయాన్ని యథావిధిగా ట్వీట్ చేశారు హర్ష్. షాప్ లోకల్ షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డులో.. ‘ మీరు ఒక చిన్న షాపులో కొనడం వల్ల ఓ పెద్ద కంపెనీ సీఈవో తమ మూడో హాలిడే హోం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు సమకూర్చలేకపోవచ్చు. కానీ ఆ డబ్బు ఓ చిన్నారి డ్యాన్స్ స్కూల్‌కి వెళ్లేందుకు సాయపడుతుంది. మరో పిల్లాడు తన టీం జెర్సీని కొనుక్కునే శక్తిని ఇస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు దోహదం చేస్తుంది. స్థానికంగా ఉండే చిన్న దుకాణాల్లో కొనుగోలు చేయండి’ అని రాసింది. దీనికి మేక్ సోమచ్ సెన్స్.. మీ దగ్గరున్న చిన్న దుకాణదారుల దగ్గర కొనండి అంటూ హర్ష్ సూచించారు. Makes so much sense….buy from your small vendor. pic.twitter.com/WMDwuaEH8j — Harsh Goenka (@hvgoenka) June 2, 2022 చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే! -
టీటీడీలో టెండర్ల గోల
తిరుమలలో ఖాళీ దుకాణాలకు టెండర్లు ఆహ్వానం టెండర్లతో తమ దుకాణాలకే ఎసరు పెడతారని పునరావాస బాధితుల్లో ఆందోళన టెండర్‌కు, స్థానిక దుకాణాలకు సంబంధం లేదని స్పష్టం చేసిన టీటీడీ తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో టెండర్ల రచ్చ మొదలైంది. ఖాళీగా ఉన్న దుకాణాలకు టెండర్లు పిలిచింది. తద్వారా తమ దుకాణాలకే ఎసరు వస్తుందని దుకాణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. తిరుమల నాలుగు మాడ వీధులు, సన్నిధి వీధి, కల్యాణకట్ట, ఇతర నివాస ప్రాంతాల్లో దుకాణాలు ఉండేవి. భక్తుల సంఖ్య పెరగడంతో సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 1980 నుంచి 2003 వరకు దశలవారీగా మాస్టర్‌ప్లాన్ అమలు చేసి ఇళ్లు, దుకాణాలు తొలగించారు. ప్రత్యామ్నాయంగా బాధితులకు తిరుమలతో పాటు తిరుపతిలో కేటాయించారు. ప్రస్తుతం తిరుమలలో వివిధ ప్రాంతాల్లో 1,456 దుకాణాలు, 735 హాకర్ లెసైన్సులు ఉన్నాయి. తిరుమలలో 76కి పైగా టెండర్ దుకాణాలున్నాయి. 1985 ప్రాంతంలో వాటిని స్థానికులకే కేటాయించారు. మరో 17 దాకా జనతా హోటళ్లు కేటాయించారు. ఇందులో 80 శాతం స్థానికేతరులే ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో 70 దుకాణాలకు టీటీడీ టెండర్లు పిలిచింది. ఈనెల 17వ తేదీ వరకు షీల్డ్ టెండర్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 18న టెండర్లు ఖరారు చేస్తారు. స్థానికుల వాదన ఇలా ఉంది.. టీటీడీ వాగ్దానం ప్రకారం ఖాళీగా ఉన్న దుకాణాలను పునరావాస బాధితులకు మాత్రమే కేటాయించాలి. దీనివల్ల టీటీడీ ఆదాయం పెరుగుతుంది. స్థానికులే ఉండటంతో భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.టెండర్ దుకాణాల కోసం ఇతర ప్రాంతాల వారితో పోటీ తీవ్రంగా ఉంటుంది. అద్దెలు ఊహించని విధంగా పెరుగుతాయి. దాని ప్రభావం పునరావాసం కింద కేటాయించిన స్థానికుల దుకాణాలపై పడుతుంది. టీటీడీలో టెండర్ విధానం పెరిగితే భవిష్యత్‌లో స్థానిక దుకాణాలకు ఎసరు పడుతుంది.ఇతర ప్రాంతాల టెండర్‌దారులకు తిరుమలలో స్థిర నివాసం ఉండదు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తప్పులు చేసే అవకాశం ఎక్కువ. వారి తప్పులను స్థానికుల ఖాతాలో వేసే అవకాశం ఉంది. వాటి ప్రభావం స్థానిక ఇళ్లపై పడుతుంది.టెండర్లో పాల్గొనే ఇతర ప్రాంతాల వ్యక్తులు రోజువారి ఆదాయం పెంచుకునేందుకు వ్యాపారంలో పోటీ పెంచుతారు. హోటళ్లలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తిరుమలకొండకు రప్పిస్తారు. దీనివల్ల భద్రత పరంగా ఇబ్బందులు ఉంటాయి. టీటీడీ వాదనిది.. తిరుమలలో ఏడేళ్లుగా దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. తద్వారా శ్రీవారి ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడింది. ఖాళీగా కొనసాగిస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశముంది. టెండర్ షెడ్యూల్లో ప్రకటించిన ఆ 70 దుకాణాలకు టెండర్ అమలు చేస్తాం.తిరుమల పునరావాస బాధితులు సంప్రదిస్తే వారికి సంబంధించి పెండింగ్‌లోని ఇళ్లు, దుకాణాల సమస్యలను పరిష్కరిస్తాం. అవసరమైతే కొత్తగా దుకాణాలు నిర్మించి కేటాయిస్తాం.టెండర్ దుకాణాల వల్ల ఇతర ప్రాంతాల వారు తిరుమలకు వస్తే వారి వల్ల భద్రతాపరమైన అంశాలను పోలీసులు, టీటీడీ విజిలెన్స్ చూసుకుంటుంది. ఆ సమస్య స్థానికుల పరిధిలో ఉండదు.కొత్త టెండర్ల వల్ల పెరిగే అద్దెలకు, గతంలో పునరావాసం కింద కేటాయించిన దుకాణాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. అద్దెలను స్థానిక దుకాణాలకు అమలు చేసే ప్రసక్తే లేదు.