నిత్యం వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నా వీలుచూసుకుని సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే బిజినెస్ పర్సన్స్‌లో ఆర్‌పీజీ గ్రూపు సీఈవో హర్ష్ గోయెంకా ఒకరు. క్రికెట్ మొదలు పాలిటిక్స్ వరకు కాంటెంపరరీ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. కొన్ని సార్లు అవి నవ్వులు పూయించగా మరి కొన్ని సార్లు సరికొత్త ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. అయితే ఈసారి ఆయన మనసులను హత్తుకునేలా లోకల్ షాపింగ్‌పై ట్వీట్ చేశారు.
లోకల్ కష్టాలు
ఈ కామర్స్ రంగం జోరందుకోవడంతో లోకల్ మార్కెట్‌కు కొంత మేర కోత పడిందనేది కాదనలేని వాస్తవం. అలాగే తళుకుబెళులతో పాటు హంగు ఆర్భాటం ఉండే బ్రాండెడ్ షోరూమ్స్ చిన్నచిన్న పట్టణాలకు కూడా విస్తరించడం కూడా లోకల్ షాపింగ్‌ను దెబ్బ తీస్తోంది. కాలానుగుణంగా వస్తున్న ఈ మార్పులకు అందరం మౌనసాక్షలుగానే మిగిలిపోయాం. అయితే లోకల్ షాపింగ్ ఎందుకు అవసరమో చెబుతూ ఓ షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డు ఆలోచింప చేసే విధంగా ఉంది. అదే విషయాన్ని యథావిధిగా ట్వీట్ చేశారు హర్ష్.
షాప్ లోకల్
షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డులో.. ‘ మీరు ఒక చిన్న షాపులో కొనడం వల్ల ఓ పెద్ద కంపెనీ సీఈవో తమ మూడో హాలిడే హోం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు సమకూర్చలేకపోవచ్చు. కానీ ఆ డబ్బు ఓ చిన్నారి డ్యాన్స్ స్కూల్‌కి వెళ్లేందుకు సాయపడుతుంది. మరో పిల్లాడు తన టీం జెర్సీని కొనుక్కునే శక్తిని ఇస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు దోహదం చేస్తుంది. స్థానికంగా ఉండే చిన్న దుకాణాల్లో కొనుగోలు చేయండి’ అని రాసింది. దీనికి మేక్ సోమచ్ సెన్స్.. మీ దగ్గరున్న చిన్న దుకాణదారుల దగ్గర కొనండి అంటూ హర్ష్ సూచించారు.
Makes so much sense….buy from your small vendor. pic.twitter.com/WMDwuaEH8j
— Harsh Goenka (@hvgoenka) June 2, 2022
చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!
Comments
Please login to add a commentAdd a comment