
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్‌కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్‌సిరీస్‌లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్‌ను నాకు తగిలేసి శివానీ బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు.
దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్‌ఫ్రెండ్‌తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్‌కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు హీరో రాజ్‌తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్‌తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment