
Varsha Bollamma Clarifies Marriage And Pregnent Rumours: పెళ్లీ, ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. రాజ్ తరుణ్ హీరోగా సాంటో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వర్ష, హీరో రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్, వర్షలకు సంబంధించిన ఓ ఇంటర్య్వూ వైరల్‌గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, వర్షను ఇంటర్య్వూలో చేస్తూ ఆటపట్టించాడు. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల ప్రశ్నల వర్షం కురిపించాడు.
చదవండి: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్ షాకింగ్ కామెంట్స్
ఇలా ఇంటర్య్వూ మొత్తం వీరిద్దరి ఫన్నీ కన్వర్జేషన్‌తో సాగుతూ ఆసక్తిని సంతరించుకుంది. ఈ సందర్భంగా వర్ష గురించిన పలు ఆసక్తికర విషయాలపై రాజ్ తరుణ్ ప్రశ్నించాడు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై రాజ్ తరుణ్, వర్షను ప్రశించాడు. అన్ని ప్రశ్నలకు వర్ష తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై వర్ష అసహనం వ్యక్తం చేసింది. నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది.
చదవండి: అందుకే సమంత, వరుణ్ ధావన్ కలుసుకున్నారు..
ఇక ప్రెగ్నెంట్ విషయంపై స్పందిస్తూ.. ఇదంతా తన బుగ్గల వల్లే వచ్చిందని, చీక్స్ కాస్తా లావుగా ఉంటే ప్రగ్నెంట్ అని డిసైడ్ అవుతారా? అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తన వయసు 25 అని, తను 1996లో పుట్టానని చెప్పింది. తన ఎత్తుపై అడిగిన ప్రశ్నకు.. హిల్స్ వేస్తే 6'1, లేకపోతే 5'11 అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. మొత్తానికి తన ఎత్తు 5'3, 5'4 అంటూ రాజ్ తరుణ్ రివీల్ చేశాడు. ఇలా రాజ్ తరుణ్, వర్షల మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇంటర్య్వూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్లో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment