Vidya Vasula Aham First Look: ఇగో వెనుక ఇంత చరిత్ర ఉందా? | Vidya Vasula Aham Movie First Look Poster Out | Sakshi
Sakshi News home page

Vidya Vasula Aham First Look: ఇగో వెనుక ఇంత చరిత్ర ఉందా?

Published Thu, Sep 1 2022 8:57 AM | Last Updated on Thu, Sep 1 2022 9:23 AM

Vidya Vasula Aham Movie First Look Poster Out - Sakshi

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్య వాసుల అహం’. ‘తెల్లవారితే గురువారం’ఫేం మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ యానిమేషన్‌ కాన్సెప్ట్‌ వీడియోని వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదల చేశారు.

(చదవండి: డైరెక్టర్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు)

టైటిల్‌ చాలా ఢిఫరెంట్‌గా, యూత్‌ని అట్రాక్ట్‌ చేసేలా ఉంది.  అహం వెనుక ఉన్న చరిత్రను యానిమేషన్ రూపంలో చెబుతూ వినూత్నంగా ఫస్ట్‌లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్లైన ఓ నూతన జంట మధ్య ఉన్న ఇగోలలో నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ ఇల్లు సెట్‌ వేశామని, ప్రస్తుతం అక్కడే షూటింగ్‌ జరుగుతోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement