’కోట బొమ్మాళి పీ ఎస్’వచ్చేస్తోంది | Kota Bommali PS Movie Release Date Out | Sakshi
Sakshi News home page

’కోట బొమ్మాళి పీ ఎస్’వచ్చేస్తోంది

Published Wed, Nov 1 2023 1:53 PM | Last Updated on Wed, Nov 1 2023 1:53 PM

Kota Bommali PS Movie Release Date Out - Sakshi

శ్రీకాంత్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. మలయాళ సూపర్ హిట్ నాయాట్టుకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన శ్రీకాకుళం మాస్ జానపద పాట ‘లింగి లింగి లింగిడి’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ లభించడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం.

నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల  చేశారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి  మధ్య జరిగే  పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement