ప్రారంభమైన ‘2 స్టేట్స్‌’ | Adivi Sesh And Shivani Starrer 2 States Movie Opening | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 24 2018 12:58 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Adivi Sesh And Shivani Starrer 2 States Movie Opening - Sakshi

2 స్టేట్స్‌ మూవీ ఓపెనింగ్‌

హీరో రాజశేఖర్‌ కూతురు శివానిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 2 స్టేట్స్‌. చేతన్‌ భగత్‌ నవల 2 స్టేట్స్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్‌ కుంచెం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.‌

శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్‌ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్‌ నటుడు భాగ్యశ్రీ, రజ్జత్‌ కపూర్‌, లిజి, ఆదిత్యమీనన్‌, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement