శివానీ రాజశేఖర్, అడివి శేష్
హైదరాబాద్‌లో ఒకసారి, కోల్‌కత్తాలో రెండు సార్లు చిత్రీకరణను జరపుకున్న ‘2 స్టేట్స్’ చిత్రబృందం ఇప్పుడు అమెరికా వెళ్లడానికి రెడీ అవుతోంది. చేతన్ భగత్ రాసిన నవల హిందీలో రూపొందిన ‘2 స్టేట్స్’కి ఇది రీమేక్. వెంకట్ రెడ్డి దర్శకుడు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘60 శాతం సినిమా పూర్తయింది.
ఇప్పటివరకు జరిగిన రషెస్ చూసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. వీసాల సమస్య ఉండటం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు వీసాలు వచ్చేశాయి. నెక్ట్స్ షెడ్యూల్ కోసం వచ్చే నెలలో టీమ్ అమెరికా వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌తో 90శాతం చిత్రీకరణ ముగుస్తుంది. మిగిలిన 10 శాతం ప్యాచ్ వర్క్‌ను హైదరాబాద్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment