Chetan Bhagat
-
సుశాంత్ కేసుపై నెలల తరబడి చర్చిస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వంటి పెను సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై మీడియా సంయమనం పాటించాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అన్నారు. సుశాంత్ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, తన కెరీర్‌కు సుశాంత్ సాయం చేశాడని ఆయన చెప్పారు. సుశాంత్‌పై తనకు ప్రేమ లేదని ఎవరూ అనుకోవద్దని అదే సమయంలో దేశం పట్ల మనం జాగరూకతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. సుశాంత్ మృతి కేసును చర్చిస్తూ నెలల తరబడి మనం దాన్ని ప్రైమ్ టైమ్ అంశంగా చేయలేమని అన్నారు. ‘సుశాంత్ కేసును మనం కోరుకున్నట్టే ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారిస్తోంది..దీనిపై ప్రజలు తలో రకంగా మాట్లాడుతున్నారు..ఇలాంటి వాటితో సాధించేదేమీ లేద’ని చేతన్ ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. ప్రతి దేశం ఆర్థిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు పనిచేస్తున్నాయని, మనం కూడా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్య అందరికీ వినోదం పంచేలా ఉందని అన్నారు. సుశాంత్ విషాదాంతం చుట్టూ హత్యారోపణలు..ఆత్మహత్య కథనాలు, కుట్ర కోణాలు ఇలాంటివెన్నో ఆసక్తి రేపుతున్నా ఇది కథ కాదని, వాస్తవ ఘటన అని దీనిపై ఆధారాలతోనే వాస్తవాలు నిగ్గుతేలతాయని అన్నారు. ఛానెళ్లలో చర్చించే వారిని ఉద్దేశిచి ‘మీరు సీబీఐ విచారణ సవ్యంగా జరిగేలా చూడాలని లేదా సీబీఐ అవసరం లేదని కోరాలని అంతేకానీ రాత్రికి రాత్రి టీవీ చర్చల్లో కేసును మీరు పరిష్కరించలేరని ఆయన సెటైర్లు విసిరారు. ఇలాంటి విషయాలపై నుంచి మనం ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్ వంటి కీలకాంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇక కోవిడ్-19 తరుణంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపైనా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్టతరమైన పరీక్షలు విద్యార్ధులను ఆదుర్ధాకు గురిచేస్తాయని కోవిడ్ ఆందోళనలతో ఇది మరింత అధికమవుతుందని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లతో పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవని పరీక్షకు కొద్దినిమిషాల జాప్యం జరిగినా విద్యార్ధుల స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. చదవండి : సీబీఐ విచారణ సంతోషంగా ఉంది: రియా -
‘మీ భర్త నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో బంధుప్రీతి వంటి అంశాలతో పాటు సినీ విమర్శకుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుశాంత్ ఆఖరిసారిగా నటించిన ‘దిల్ బేచారా’ చిత్రం విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ సిని విమర్శకులను ఉద్దేశిస్తూ.. ‘సంస్కారం లేని, ఉన్నతమైన విమర్శకులకు ఓ విన్నపం. సుశాంత్ సింగ్ ‘దిల్ బేచారా’ ఈ శుక్రవారం విడుదల అవుతుంది. కాస్తా సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి. పనికిమాలిన చెత్త అంతా రాయకండి. సున్నితంగా, స్పష్టంగా ఉండండి. మీ అతి తెలివితేటలను ఉపయోగించకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇప్పటికైనా ఆపండి. మేము ప్రతిది గమనిస్తూనే ఉంటాము’ అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశారు. గతంలో విమర్శకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రా సుశాంత్ చిత్రాల పట్ల క్రూరంగా వ్యవహరించారని చేతన్ భగత్ ఆరోపించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) Ma'am, when your husband publicly bullied me, shamelessly collected all the best story awards, tried denying me credit for my story and drove me close to suicide, and you just watched, where was your discourse? https://t.co/CeVDT2oq47 — Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020 ఈ క్రమంలో అనుపమ చోప్రా, చేతన్ భగత్ ట్వీట్‌పై స్పందించారు. ‘విశ్లేషణ తక్కువగా ఉందని మీరు భావించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది’ అని స్పందించారు. దీనికి చేతన్ భగత్ ‘మేడమ్.. మీ భర్త నన్ను బహిరంగంగా తిట్టారు. బెస్ట్ స్టోరి అవార్డులను సిగ్గులేకుండా తీసుకున్నారు. నా కథకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. పైగా ఆయన ప్రవర్తనతో నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. మీరు వీటన్నింటిని చూస్తూ ఉన్నారు. మరి మీ విశ్లేషణ ఏది’ అంటూ ప్రశ్నించారు. చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవల ఆధారంగా ‘3 ఇడియట్స్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే విడుదల సమయంలోనే దీనిపై వివాదం మొదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ నవల హక్కులను కొనుగోలు చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ‘చేతన్ భగత్ ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్’ ఆధారంగా’ అని వేశారు. కానీ టైటిల్స్‌లో కథ, స్క్రీన్‌ప్లే అభిజాత్ జోషి అని వేశారు. అంతేకాక ఐఫా, ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లలో ఉత్తమ కథ బహుమతిని హిరానీ, జోషి అందుకున్నారు. దీనిపై గతంలోనే చేతన్ భగత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. Each time you think the discourse can’t get lower, it does! https://t.co/yhkBUd8VSQ — Anupama Chopra (@anupamachopra) July 21, 2020 -
‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’
ముంబై: సినీ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లీడ్రోల్లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్‌ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్, బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి తొలగించి స్టార్కిడ్ అయిన అర్జున్ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్) So happy to share @itsSSR will play lead in @mohit11481 directed Half Girlfriend. Shooting begins 1Q16. https://t.co/dUHSVZ2FQ5 — Chetan Bhagat (@chetan_bhagat) November 7, 2015 అంతేగాక ఈ సినిమాలో అర్జున్ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజమ్) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్‌ను తొలగించి అదిత్య రాయ్... రణ్‌వీర్‌లు.. లెజెండరి నటుడు అర్జున్ కపూర్లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్‌ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఇప్పటికైనా సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు సుశాంత్‌లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్) -
తొలిప్రేమను దక్కించుకోవటానికి..
పుస్తకం : హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ రచయిత : చేతన్ భగత్ భాష : ఇంగ్లీష్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ నవల ముఖచిత్రం కథ : మాధవ్ జా బీహార్‌కు చెందిన యువకుడు. డిగ్రీ చదవుల నిమిత్తం ఢిల్లీలోని సేయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరతాడు. అక్కడ రియా సోమని అనే డబ్బున్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కావటంతో సన్నిహితంగా మెలుగుతుంటారు. రియాను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిన మాధవ్ చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని ఆమెకు చెబుతాడు. ఆమె ప్రేమా, గీమా వద్దు ఫ్రెండ్స్‌గా ఉందాం అంటుంది. అతను మాత్రం తన ప్రయత్నాల్లో తను ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అప్పటినుంచి రియా, మాధవ్‌ను దూరంగా ఉంచుతుంది. కొద్దిరోజులకే వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. రియాతో మాట్లాడటానికి పరితపిస్తున్న మాధవ్‌కు ఓ రోజు ఆమెతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఆ మాటల సందర్భంలోనే తనకు పెళ్లి నిశ్చయమైనట్లు, కాలేజీ మానేస్తున్నట్లు అతడికి చెబుతుంది. మాధవ్‌కు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మంటుంది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసుకుని బీహార్ వెళ్లిపోతాడు. తమ కుటుంబం నడుపుతున్న స్కూల్లో పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాట్నాలోని ఓ హోటల్లో రియా అతడికి కన్పిస్తుంది. పెళ్లి అవటం, తర్వాత విడాకులు తీసుకోవటం గురించి అతడికి చెబుతుంది. ఇద్దరు మళ్లీ స్నేహంగా ఉండటం మొదలుపెడతారు. మాధవ్ తల్లికి ఇదంతా నచ్చదు. విడాకులు తీసుకున్న అమ్మాయితో కొడుకు సన్నిహితంగా ఉండటం, రాజవంశానికి చెందిన తన కుమారుడు వేరే కులం అమ్మాయితో తిరగటం సహించలేకపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది మాధవ్, రియాపై మరింత ఆశలు పెంచుకుంటాడు. అయితే ఈ సారైనా రియా, మాధవ్ ప్రేమను అంగీకరిస్తుందా? సున్నితంగా కుదరదని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుందా? ఒక వేళ అంగీకరిస్తే మాధవ్ తల్లి వీరి పెళ్లికి అడ్డుచెబుతుందా? లేక కొడుకు సంతోషం ముఖ్యమని అంగీకరిస్తుందా? అన్నదే మిగితా కథ. విళ్లేషణ : ప్రముఖ ఇంగ్లీష్ నవలల రచయిత చేతన్ భగత్ ఊహాల్లోంచి జాలువారిన ఓ అద్భుత ప్రేమ కావ్యం. తొలిప్రేమను దక్కించుకోవటానికి కష్టపడే మాధవ్ పాత్ర పాఠకుల(ప్రేమికుల) మనసులో ముద్రపడిపోతుంది. తెలిసీ తెలియని వయసులో తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎలా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయో రియా, మాధవ్‌ల పాత్రలు మనకు ఉదహరిస్తాయి. ఇంగ్లీష్ భాషపై పట్టులేని వాళ్లకు కూడా అర్థమయ్యేలా రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ నవల ఆధారంగా బాలీవుడ్ ఇదే పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కింది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్లు ఈ సినిమాలో జంటగా నటించారు. ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమ పోయిన తర్వాత...
‘ఇది ప్రేమ కథ కాదు. ప్రేమ పోయిన కథ.’ ఇలా ముగిసే చేతన్ భగత్ నవల, ‘ద గర్ల్ ఇన్ రూమ్ 105’లో– కథానాయకుడైన 27 ఏళ్ళ కేశవ్, ‘చందన్ క్లాసెస్’లో బోధిస్తుంటాడు. సహోద్యోగీ, ఢిల్లీ మాలవీయ నగర్ ఫ్లాట్‌మేటూ అయిన సౌరభ్ (గోలూ) తో కలిసి, ఒక ఫిబ్రవరి రాత్రి తాగుతూ ఉంటాడు. నాలుగేళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్, జారా పుట్టినరోజు అదేనని గుర్తుకొస్తుంది. అప్పుడే, తెల్లారి మూడు గంటలకు, జారా నుండి ‘నా పుట్టిన రోజని మరచిపోయావా! నువ్వు గుర్తుకొస్తున్నావు. రఘు మంచివాడే కానీ నాకు సరిపడినవాడు కాదు. ఇంకా, హిమాద్రి హాస్టల్లో 105వ నంబర్ గదిలోనే ఉన్నాను. ముందులాగే, కిటికీ బయటున్న మామిడి చెట్టెక్కి, గదిలోకొచ్చెయ్యి’ అన్న వాట్సాప్ మెసేజులు వస్తాయి. గతంలో కేశవ్ ఢిల్లీ ఐఐటీ వదులుతుండగా, అక్కడ పీహెచ్డీ చేయడానికి వచ్చిన జారాతో ప్రేమలో పడతాడు. ఆమె కశ్మీరీ ముస్లిం. కేశవ్ తండ్రి రాజస్తాన్, అల్వర్‌లో– ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున, అతనింటివారు వారి సంబంధాన్ని ఆమోదించరు. నవల మొదలయ్యేటప్పటికే జారా, కేశవ్‌కు దూరమై, అతని బ్యాచులోనే చదివిన తెలుగబ్బాయి రఘును పెళ్ళి చేసుకోడానికి రెండు నెలలే మిగిలుంటాయి. రఘు మల్టీనేషనల్ కంపెనీలో పైకి ఎదుగుతుంటాడు. కేశవ్, సౌరభ్–105కి వెళ్ళేటప్పటికే జారా చనిపోయి ఉంటుంది. ఆమె మెడ నులిమిన గుర్తులు కనబడతాయి. కేశవ్– దగ్గర్లోనే ఉండే జారా తండ్రి సఫ్దర్‌కూ, పోలీస్ ఇన్స్పెక్టర్ రానాకూ, రఘుకీ ఫోన్ చేసి చెప్తాడు. రఘు చెయ్యి విరిగి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఉంటాడు. హాస్టల్ వాచ్‌మన్ లక్ష్మణ్ రెడ్డి, హత్యా సమయమప్పుడు తన నియమితమైన చోటున లేనందువల్లా, గతంలో జారా అతనితో గొడవపడ్డమూ తెలిసి, రానా అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు. అయితే, కేశవ్ – గోలూ సహాయంతో, తనే డిటెక్టివ్ పని మొదలెడతాడు. అతని మొదటి అనుమానం– జారామీద కన్నేసిన ఆమె పీహెచ్డీ గైడయిన సక్సేనా మీదకి వెళ్తుంది. కాకపోతే, సక్సేనా కుంటుతాడు కనుక అతను చెట్టెక్కలేడని గ్రహించిన కేశవ్ సందేహం, తీవ్రవాదుల్లో చేరిన జారా సవతి తమ్ముడైన సికందర్ పైకి మళ్ళుతుంది. సికందర్ ఉండే కశ్మీర్ వెళ్లినప్పుడు, సికందర్ ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడున్న ఆర్మీ ఆఫీసరైన ఫెయిజ్ పెళ్ళయి, కవల పిల్లలున్నవాడు. ఫెయిజ్‌తో జారా సంబంధం పెట్టుకుందన్న సాక్ష్యం దొరికినప్పుడు, అతనే హంతకుడని అనుమానిస్తాడు. సఫ్దర్‌కు, జారా పోయిన వందో రోజు అందరినీ పిలవమనీ, తను హంతకుడెవరో బయటపెడతాననీ చెప్పి, రానాకూ ఫోన్ చేస్తాడు. అందరికీ ఆ తెలివైన హంతకుడెవరో తెలుస్తుంది. నవల చివర్న, తను ప్రేమించిన జారా తనకు అర్థమే కాలేదని గుర్తిస్తాడు కేశవ్. గోలూతో కలిసి ‘జెడ్ డిటెక్టివ్స్’ అన్న ఏజెన్సీ తెరుస్తాడు. ‘నీ పిల్లలకు రఘు పోలికలు రావాలనుకుంటున్నావా – నల్లగా, అసహ్యంగా! కనీసం, కశ్మీరీల రంగు నిలబెట్టు.’ ఫెయిజ్, జారాకు పంపిన ఇలాంటి మెసేజులు, ఉత్తరాదిలో తెల్లచర్మంపట్ల ఉండే పక్షపాతాన్ని కనపరుస్తాయి. ముస్లిమ్/హిందూ మతవాదాలు, కశ్మీర్ సమస్యలు, హత్య గురించిన టీవీ చర్చలుండే పుస్తకమంతటా, కేవలం ఢిల్లీవాసులు మాత్రమే ఉపయోగించగలిగే, యథాలాపమైన హిందీ తిట్లూ, ‘ఠర్కీ, ఆషిక్, తమీజ్, గద్దార్, పంగా’ లాంటి మాటలూ కనబడతాయి. చేతన్ భగత్ మిగతా పుస్తకాలు– భిన్నమైన కులాల, ప్రాంతాల, సంస్కృతుల జంటలు ఆఖరికి కలిసిపోవడంతో ముగిస్తే, ఇది మాత్రం కొంచెం భిన్నంగా– ఎన్నో మలుపులతో, హత్యామర్మాన్ని ఛేదించినది. అయితే, రచయిత పుస్తకాలన్నిట్లోలాగే ఇదీ ఐఐటీ నేపథ్యంతో ఉన్నదే. సంభాషణలతోనే కొనసాగుతుంది. ఉత్తమ పురుషంలో ఉండే కథనం సరళమైన వాడుక భాషలో ఉంటుంది. ఈ నవలను 2018లో ప్రచురించినది వెస్ట్‌లాండ్. - యు. కృష్ణవేణి -
స్త్రీలోక సంచారం
స్టార్ రైటర్ చేతన్ భగత్ కొన్నాళ్లుగా ‘మీ టూ’ ఆరోపణల్ని మోస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు చేతన్ తమను లైంగికంగా వేధించాడని బహిర్గతం చేశారు. వారిలో ఒకరు ఇరా త్రివేది. ఆమె కూడా ప్రముఖ రచయిత్రి. కాలమిస్టు, యోగా టీచర్ కూడా. చేతన్ తనతో చాటింగ్ చేస్తున్నప్పుడు తన అసలు స్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నాడని, అసభ్యకరమైన మెయిల్స్ కూడా తనకు పంపాడని గత అక్టోబర్ 22 ఇరా అతడికి లీగల్ నోటీసు కూడా పంపారు. చేతన్‌పై ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, ఇతర సైబర్ నేరాలు కూడా ఇరా ఫిర్యాదుపై నమోదు అయ్యాయి. అయితే ఇవన్నీ అబద్ధం అని చేతన్ కొట్టిపడేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే.. ఇరా ‘మీ టూ’ ఆరోపణలు చేతన్ ఎక్కడికి వెళ్లినా అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘సాహిత్య ఆజ్ తక్’ కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం నాడు (నిన్న).. సభలో అతడి ‘లీలల’ ప్రస్తావన వచ్చినప్పుడు చేతన్ తన సచ్చీలతను ప్రదర్శించుకోడానికి ప్రయత్నించారు. ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి చెప్పారు. ‘‘నాపై ఇరా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగానే నిజమేనా? నిజమేనా? అని నా భార్య అనూష నస మొదలు పెట్టింది. ఆ నసను తట్టుకోలేక ‘నన్నొదిలేసి వెళ్లిపో అని పెద్దగా అరిచేశాను. కానీ తను స్ట్రాంగ్ ఉమన్. చాలా కూల్‌గా ఉంది. ఉండడమే కాదు, ‘నువ్వూ నేను పార్వతీ పరమేశ్వరుల లాంటి వాళ్లం. ఒకర్నుంచి ఒకరం విడిపోవడం కష్టం’ అంది! ఆ మాట నన్ను టచ్ చేసింది. ఆ మాటతో నా భార్య నన్ను మార్చేసింది (అంటే వేధింపులు నిజమేనన్నమాట). నాపై లైంగిక ఆరోపణలు వచ్చాక, మా అత్తగారికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. దక్షిణ భారతదేశపు సంప్రదాయ కుటుంబం ఆమెది. మాదేమో పంజాబ్. ఏది ఏమైనా అనూష వంటి భార్య ఉన్నప్పుడు అపనిందలన్నీ తేలిపోతాయి. భర్తకు ధైర్యంగా ఉంటుంది’’ అని చెప్పాడు చేతన్ భగత్. అయితే అది కట్టు కథా, నిజమా అనేది నిర్థారణ కాలేదు. రైటర్ కదా. ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇరా మాత్రం తన ఆరోపణలపై తను గట్టిగా నిలబడింది. అవసరం వచ్చినప్పుడు మరిన్ని ప్రూఫ్స్ చూపిస్తానంటోంది. టీనేజ్ వివాహాలను నిరోధించడానికి గట్టి చట్టాన్ని తేవాలని ఎన్.హెచ్.ఆర్.సి. (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టీనేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వారి భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకు పంపిన ఈ నివేదికలో.. టీనేజ్‌లో పెళ్లయిన బాలికలు 13–19 సంవత్సరాల మధ్య వయసుకే తమ తొలి బిడ్డను ప్రసవిస్తున్నారని పేర్కొంది. యూనిసెఫ్ అంచనాల ప్రకారం చూసినా కూడా 18 ఏళ్ల వయసుకు చేరేలోపే భారతదేశంలో 27 శాతం మంది మహిళలకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి! (ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు శాంతాదేవి మేఘ్వాల్. ఆమెది రాజస్థాన్. 11 నెలలకే (ఏళ్లకు కాదు) శాంతాదేవికి పెళ్లైపోయింది! అప్పటికి వరుడి వయసు 9 ఏళ్లు. మూడేళ్ల క్రితం తన 20 ఏళ్ల వయసులో విదేశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె విలపిస్తున్నప్పటి చిత్రమిది.) లేడీ డయానా దుర్మరణం చెందాక కామిల్లా పార్కర్‌ను రెండో పెళ్లి చేసుకుని, ప్రస్తుతం తన 70 ఏళ్ల వయసులో మనవలు, మనవరాళ్లతో సంతోషంగా ఉంటూ, రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 తర్వాత సింహాసనం అధిష్టించడానికి సిద్ధంగా ఉన్న దశలో ప్రిన్స్ చార్ల్స్ గురించి ఒక పాత విషయమే కొత్తగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ‘ది రాయల్ హౌస్ ఆఫ్ విండ్సర్’ టీవీ సీరీస్‌లో భాగంగా త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్లో.. 1979తో చార్ల్స్.. అమందా నాచ్‌బుల్ అనే సామాజిక కార్యకర్తను (ఇప్పుడు ఆమె వయసు 61) ప్రేమించి, ఆమెతో కలిసి తిరిగి, ఆమెతో తన జీవితాన్ని ఊహించుకున్నాడని, చివరికి ఆమె తిరస్కారంతో భంగపడి, ఆ గాయం నుంచి కోలుకునేందుకు డయానాతో డేటింగ్ చేశాడని చూపించే సన్నివేశాలు ఉన్నాయి. -
‘నా భార్య సమాధానం నన్ను సిగ్గుపడేలా చేసింది’
నా మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో.. నన్ను వదిలి వెళ్లాల్సిందిగా నా భార్యను కోరాను. కానీ ఆమె సమాధానం విన్న తర్వాత ఆమె పట్ల నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమయ్యింది అంటున్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ ఉద్యమం’లో చేతన్ భగత్ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఈ విషయం గురించి మౌనంగా ఉన్న చేతన్ భగత్ తొలిసారి మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘సాహిత్య ఆజ్ తక్’ కార్యక్రమంలో భాగంగా చేతన్ భగత్ ‘3 మిస్టెక్స్ ఇన్ మై లైఫ్’ పుస్తకాన్ని కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చేతన్ భగత్ తన మీద వచ్చిన లైంగిక ఆరోపణల పట్ల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో చాలా ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయితో చాట్ చేశాను. తను కూడా నాతో బాగానే మాట్లాడింది. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో నేను తనతో తప్పుగా ప్రవర్తించిన మాట వాస్తవమే. అందుకు నేను తనని క్షమించమని కోరాను. ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి సారీ చెప్తున్నాను’ అన్నారు. అయితే తనపై మరో మహిళ చేసిన ఆరోపణలను మాత్రం ఖండించారు. సదరు మహిళ విషయంలో తనను నిర్దోషిగా చెప్పుకున్నారు. తన నిజాయితీని నిరూపించుకునే ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. తన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో తన తల్లి, భార్య తనకు చాలా మద్దతుగా నిలబడ్డారని వివరించారు. ‘నా మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో నన్ను వదిలి వెళ్లాల్సిందిగా నా భార్యను కోరాను. అందుకు ఆమె ‘నీకేమైనా పిచ్చా. పార్వతీపరమేశ్వరుల మాదిరి మనం కూడా అర్ధనారీశ్వరులం. మనం ఇద్దరం కాదు ఒక్కరమే.. అలాంటిది ఈ సమయంలో నేను నిన్ను ఎలా వదిలిపెడతాను’ అని చెప్పింది. ఆమె సమాధానం విన్న తరువాత తన పట్ల నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమయ్యింది. ఇంతలా నమ్మిన భార్యకు నేను ద్రోహం చేశాను అనిపించింది. ఇక మీదట నా జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘నేను ఒక సెలబ్రిటీనై ఉండి కూడా అందరితో చాలా కలుపుగోలుగా ఉంటాను. దాని వల్లే ఈ రోజు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాను. జీవితంలో తప్పులు చేయడం సహజం.. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే అది క్షమించరాని నేరం. ‘మీటూ ఉద్యమం’ మంచిదే.. కానీ దానిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ బుక్ ‘ది గర్ల్ ఇన్ రూమ్ నంబర్. 105’ పుస్తకం గురించి కూడా మాట్లాడారు. తొలిసారి మర్డర్ మిస్టరీకి సంబంధించిన అంశాన్ని తన కథా రచన కోసం ఎంచుకున్నానని తెలిపారు. -
రాజుకున్న మీటూ : క్షమాపణలు చెప్పిన చేతన్ భగత్
న్యూఢిల్లీ : భారత్‌లో రాజుకున్న మీటూ ఉద్యమం పెద్ద పెద్ద వారి బండారాలను బయటికి తీస్తోంది. రచయితలుగా, జర్నలిస్ట్లుగా సమాజంలో మంచి పేరును సంపాదించున్న ప్రముఖులు సైతం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. యువ రచయితలకు ఆదర్శంగా ఉండే చేతన్ భగత్ సైతం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యకరంగా మెసేజ్‌లు చేసినా, ఫ్లర్ట్ చేసినా సంభాషణలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ స్క్రీన్షాట్లు బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే చేతన్ భగత్ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మెసేజ్‌లు కూడా వైరల్‌గా మారాయి. దీంతో చేతన్ భగత్ తను చేసిన తప్పును ఒప్పుకుని, ఫేస్బుక్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. మహిళా జర్నలిస్ట్ ట్విటర్లో షేర్ చేసిన స్క్రీన్షాట్లలో, చేతన్ భగత్ ఆమెను లైంగికంగా ఆకర్షించడానికి ప్రయత్నించాడు. మీరు స్వీట్, క్యూట్, ఫన్నీ అంటూ పలు మెసేజ్‌లు కూడా పెట్టాడు. వాట్సాప్‌లో తనకు చేసిన మెసేజ్లన్నింటిన్నీ మహిళా జర్నలిస్ట్ బయటపెట్టారు. దీంతో తాను తప్పుచేసినట్టు ఒప్పుకున్న చేతన్, ఆమెకు క్షమాపణ చెప్పాడు. ‘మొదట నేను మీకు క్షమాపణ చెబుతున్నా. ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్నవన్నీ నిజమే. ఐ యామ్ సారీ, మీరు నా క్షమాపణను అంగీకరిస్తారని భావిస్తున్నా’ అని రాశారు. అంతేకాక తన భార్య అనూషను మోసం చేయాలని అనుకున్నందుకు ఆమెకు కూడా క్షమాపణ చెబుతున్నట్టు ఫేస్బుక్లో పోస్టు చేశారు. తనుశ్రీ-నానా పటేకర్ వివాదంతో భారత్‌లో మీటూ ఉద్యమం రాజుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా మహిళా జర్నలిస్ట్‌లు తాము పని ప్రదేశాల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు బయటపెడుతున్నారు. పలువురు ప్రముఖ జర్నలిస్ట్‌లు, రచయితలు తోటి మహిళలతో ఇలా ప్రవర్తించారని వెలుగులోకి రావడం మరింత కలకలం సృష్టిస్తోంది. కొందరు ప్రముఖలు తాము లైంగిక వేధింపులకు పాల్పడ్డామని ఒప్పుకుంటూ.. ట్విటర్ వేదికగా క్షమాపణ చెబుతున్నారు. ఈ కోవలోనే చేతన్ భగత్, తన తప్పును ఒప్పుకున్నారు. -
కాంగ్రెస్‌లోకి చేతన్ భగత్..?
న్యూఢిల్లీ : ప్రముఖ రచయిత, కాలమిస్ట్, మోటివేషనల్ స్పీకర్ చేతన్ భగత్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ ఆయన అభిమానుల్ని విస్మయపరించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని ఆయన చేసిన ట్వీట్‌తో కొందరు కంగుతిన్నారు. అయ్యో ఇలా చేయొద్దు అంటూ సూచనలు ఇచ్చారు. మరికొందరు మాత్రం తేరుకున్నారు. ఇంతకు విషయమేమిటంటే.. ఏప్రిల్ 1 సందర్భంగా సరదాగా ‘ఫూల్స్ డే’ను జరుపుకునేందుకు ఈ ట్వీట్‌ను చేశారు. 'ఇంకేంతమాత్రం చూస్తూ ఉండలేను. దేశాన్ని మార్చాల్సిన అవసరముంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా. కర్ణాటక ఎన్నికల్లో వారి తరఫున ప్రచారం చేస్తాను. దేశాన్ని బాగుచేయడంలో రాహుల్ గాంధీతో కలిసి పనిచేస్తా. ఇది నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇవిగో వివరాలు’ అంటూ చేతన్ ఓ లింక్ ను జత చేసి ట్వీట్ చేశారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే..ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ వికీపీడియా పేజ్ తెరుచుకుంటోంది. కానీ ఆయన ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేయకుండానే చాలామంది ఆయన రాజకీయాల్లోకి చేరబోతున్నారంటూ పొరపడ్డారు. ‘ఇది నీ అభిమానులకు ఊహించని పరిణామం. గొప్ప రచయిత అయిన మీరు ఈ చెత్త రాజకీయాల్లోకి రావద్ద’ని ఓ అభిమాని ట్వీట్ చేయగా, మరో అభిమాని ‘మీరు రాయబోయే తదుపరి పుస్తకానికి ‘నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు’ అని పేరు పెట్టుకోమని సూచించారు. 'మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మీలాంటి వారంతా వచ్చి అసలైన కాంగ్రెస్ విలువలను నిలబెట్టాలి', ‘ఇప్పటివరకు మీ పుస్తకాలు చదివాను.. ఇక నుంచి మానేస్తా’ అని కొందరు కామెంట్ చేయగా.. ఇది ఫూల్స్ డే ట్వీట్ అని గుర్తించిన మరికొందరు నెటిజన్లు.. ‘ఏప్రిల్ పూల్ డేను మేం నమ్మాల్సిందే. రాహుల్‌తో కలిసి ఇండియా తీర్చిదిద్దండి’ అంటూ ఛలోక్తులు విసిరారు. Couldn’t take it anymore. The country needs to be fixed. Joining Congress. Will be supporting their Karnataka campaign. With RG, let’s make a better India. Need your blessings in what is a big move for me. Details here: https://t.co/DcVhWYV3Kx — Chetan Bhagat (@chetan_bhagat) April 1, 2018 -
ప్రారంభమైన ‘2 స్టేట్స్’
హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 2 స్టేట్స్. చేతన్ భగత్ నవల 2 స్టేట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ కుంచెం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు భాగ్యశ్రీ, రజ్జత్ కపూర్, లిజి, ఆదిత్యమీనన్, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు. -
పటాసులు అవసరమా?
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఢిల్లీలో సుప్రీంకోర్టు బాణాసంచాను నిషేధించడాన్ని ప్రముఖ డిజైనర్ మసాబా గుప్త సమర్థించారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బిన్నరకాలుగా స్పందించారు. రెండు రోజుల కిందట సుప్రీం నిర్ణయంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. చేతన్ భగత్ వ్యాఖ్యలపై మసాబా గుప్త విభిన్నంగా స్పందించింది. ‘‘నేను దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. దేశాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటే మసాబా ట్విటర్లో ట్వీట్ చేశారు. డిజైనర్ మసాబా గుప్త.. ప్రముఖ వెస్టిండీస్ క్రీడాకారుడు వివ్ రిచర్ట్స్, నీనా గుప్తల కుమార్తె. మసాబా ట్వీట్‌పై చేతన్ భగత్ వ్యంగ్య కామెంట్లు చేశారు. నేను అత్యంత స్ఫూర్తివంతమైన వ్యక్తిని నేడు కలిశాను అంటూ ట్వీట్ చేశారు. చేతన్ ట్వీట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. pic.twitter.com/VRwKk8sQPm — Masaba Mantena (@MasabaG) October 12, 2017 -
చేతన్ భగత్ నవలపై దుమారం!
ప్రముఖ రచయిత చేతన్ భగత్ తాజా నవల ‘వన్ ఇండియన్ గర్ల్’ చుట్టు వివాదం ముసురుకుంది. ఈ నవలలో చేతన్ గ్రంథచౌర్యానికి పాల్పడ్డారని, తాను రాసిన ఓ కథను కాపీకొట్టి ఆయన నవలను రాశారని బెంగళూరుకు చెందిన రచయిత్రి కోర్టును ఆశ్రయించింది. చేతన్ నవల ’ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ఢిల్లీ యూనివర్సిటీ పాఠ్యాంశంగా తీసుకున్న సమయంలో ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది. చేతన్ భగత్ తన కథ ‘డ్రాయింగ్ ప్యారలల్స్’ను కాపీ కొట్టారని బెంగళూరు రచయిత్రి అన్విత బాజ్‌పేయి దావా వేశారు. 2014లో బెంగళూరు సాహిత్సోత్సవానికి వచ్చిన సందర్భంగా తన కథల సంకలనం ‘లైఫ్, ఆడ్స్ అండ్ ఎండ్స్’ను ఆయనకు సమీక్ష కోసం ఇచ్చానని, అందులోని కథను ఆయన గ్రంథచౌర్యం చేసి ‘వన్ ఇండియన్ గర్ల్’ నవల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. -
కొత్త నోట్ల సైజ్ ఎందుకు పెంచారు?
పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నటుడు అర్షద్ వార్సీ వంటివారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ట్విట్టర్లో కామెంట్స్ పెట్టారు. తాజాగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా ఈ విషయంలో మోదీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. "పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్నదే కావొచ్చు కానీ, దానిని సరిగ్గా అమలుచేయకపోవడం, ఏటీఎంలు ఖాళీగా ఉండటం సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది' అని ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా కొత్తగా జారీచేసిన నోట్లు ఏటీఎంలలో డ్రా చేసుకునేవిధంగా లేకపోవడంపైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ప్రస్తుతమున్న ఏటీఎంలలో ఉపయోగపడనివిధంగా కొత్త నోట్ల సైజ్‌ను ఎందుకో మార్చారో అర్థం కావడం లేదు. ఇలాంటి రహస్య నిర్నయాలు తీసుకున్నప్పుడు ఏటీఎంలను మార్చడం ఎంతమాత్రం కుదరదు’ అని చేతన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వానికి రాజకీయంగా వ్యతిరేకత రావడానికి కారణం కావడం బాధాకరమని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. Wonder why the size of the new notes was changed, taking them unusable in existing ATMs, esp when secrecy meant u couldn't modify ATMs. — Chetan Bhagat (@chetan_bhagat) 12 November 2016 -
పాకిస్తాన్ పేరు 'టెర్రరిస్తాన్'..
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీరీ అంశంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రముఖులు నవాజ్ షరీఫ్ విష ప్రచారాన్ని ఎండగడుతున్నారు. పాకిస్తాన్ పేరును టెర్రరిస్తాన్‌గా మార్చాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ డిమాండ్ చేశారు. భారత్‌తో పాటు ప్రపంచమంతా కలిసి పాకిస్తాన్‌కు పేరు మార్చాలని, పాక్‌కు కొత్త పేరుగా టెర్రరిస్తాన్ పెట్టాలన్నారు. నగరాలకు, రోడ్లకు పేరు మారుస్తారు..కానీ పాక్‌కు ఎందుకు పేరు మార్చడం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ విమర్శలపై కశ్మీరీ రాజకీయ నాయకులు స్పందించకుండా జాగ్రత్తపడుతున్నారని, ఇలా చేస్తూ ఇండియన్ ఆర్మీ తమల్ని రక్షించాలని ఎలా ఆశిస్తామని ట్వీట్ చేశారు. ఉరిలో 18 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు బలిగొన్న ఘటన అనంతరం నవాజ్ షరీఫ్ యూఎన్‌లో ప్రసంగించారు.హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా కీర్తిస్తూ.. కశ్మీర్ స్వాతంత్య్రం కోరుతున్న యువతను భారత ఆర్మీ చంపేస్తోందని షరీప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో బాధిత ప్రజలు, మృతుల బంధువులు ప్రతిచర్యకు పాల్పడి ఉంటారని దాని ఫలితంగా ఉరీ దాడి జరిగి ఉంటుందని షరీఫ్ అన్నారు. ఆధారాలు లేకుండానే భారత్ తమ దేశంపై ఆరోపణలు చేస్తోందన్నారు. షరీఫ్ చేసిన ఈ కామెంట్లపై భగత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. -
తెలుగులో టు స్టేట్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అల్రెడీ తెలుగు రాష్ట్రాలు రెండున్నాయి. తెలుగులో ‘టు స్టేట్స్’ అంటే ఏపీ, టీజీ నేపథ్యంలో ఓ సినిమా అనుకోవద్దు. ‘టు స్టేట్స్’ అనేది హిందీ సినిమా పేరు. ఇప్పుడీ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకట్ కుంచెమ్ ఈ రీమేక్ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ నవలలు అంటే బాలీవుడ్లో హాట్ కేకులు. ఈయన రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ‘త్రీ ఇడియట్స్’గా, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ను ‘కై పో చే’గా, ‘టు స్టేట్స్’ను అదే పేరుతో సినిమాలుగా తీసి బాలీవుడ్ దర్శక-నిర్మాతలు భారీ విజయాలు అందుకున్నారు. ‘టు స్టేట్స్’ నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్ ఇప్పటివరకూ తమ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఏ సినిమా హక్కులనూ దక్షిణాదికి ఇవ్వలేదు. వీవీ వినాయక్ సహకారంతో అభిషేక్ పిక్చర్స్, వెంకట్ కుంచెమ్ ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. త్వరలో నటీనటులు, ఇతర వివరాలు తెలియజేస్తామని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. -
రికార్డులను బ్రేక్ చేస్తున్న చేతన్ లేటెస్ట్ బుక్
ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, టూ స్టేట్స్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్, ఫైవ్ పాయింట్ సమ్‌వన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి పుస్తకాలతో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న చేతన్ భగత్, తన తాజా బుక్‌తో మరోసారి పాఠకుల ఆదరణను చూరగొంటున్నారు. 'వన్ ఇండియన్ గర్ల్' పేరుతో విడుదలైన ఈ బుక్ అమెజాన్ ప్రీ-ఆర్డర్ చరిత్రలో రికార్డులు బద్దలు కొడుతోంది. అమెజాన్, రూపా పబ్లిసింగ్ భాగస్వామ్యంతో ఎక్స్‌క్లూజివ్‌గా ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమెజాన్ లో ప్రారంభమైన ఈ బుక్ ప్రీఆర్డర్లు.. ఆవిష్కరించిన రెండు గంటల్లేనే అత్యధిక ప్రీ ఆర్డర్లు నమోదుచేస్తున్నాయి. అమెజాన్ లాంచ్ అయినప్పటి నుంచీ ఏ ప్రొడక్ట్‌కు నమోదుకాని ఆర్డర్లను ఈ బుక్ సొంతంచేసుకుంటోందని, ప్రీ ఆర్డర్లో ఆధిపత్య స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఈ-కామర్స్ దిగ్గజం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెజాన్‌లో నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తున్న వన్ ఇండియన్ గర్ల్ పుస్తకంపై చేతన్ భగత్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన పాఠకులకు ధన్యవాదాలు తెలిపారు. శనివారమే ఈ బుక్కు సంబంధించిన టీజర్‌ను కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు. మహిళా ఆధారితంగా ఓ పుస్తకం రాయాలని గత కొంత కాలంగా భావించిన భగత్, ఫీమేల్ వాయిస్‌లో దీన్ని రచించారు.ఈ పుస్తకం సమాజాన్ని కచ్చితంగా ఆలోచింపబరుస్తుందని భగత్ ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యారీ పోటర్ కంటే 20 టైమ్స్ ఎక్కువగా పాపులర్ అయిందని తెలుస్తోంది. -
నవ చేతన అక్షర కేతనం!
ఏప్రిల్ 22 చేతన్ భగత్ జన్మదినం ‘రచయిత కావడానికి అర్హత ఏమిటి? ఆకర్షణీయమైన స్టోరీ లైనా? ఆకట్టుకునేలా రాయడమా?’ అన్న ప్రశ్నకు చేతన్ భగత్ సమాధానం... ‘పాఠకులకు కనెక్టయ్యేలా రాయగలగడమే అసలు సిసలు అర్హత’! పై సమాధానంలోనే రచయితగా చేతన్ విజయ రహస్యం దాగుంది. ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవలలో కనిపించే హరికుమార్, రెయాన్, అలోక్గుప్తాలు ఆ నవలకు మాత్రమే పరిమితమైనవాళ్లు కాదు. పోటీ ప్రపంచానికి, సృజనాత్మక ఏకాంతానికి మధ్య తలెత్తే వైరుధ్యాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల మన నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటారు. ‘2 స్టేట్స్’ పాక్షికంగా చేతన్ కథ అంటారుగానీ అది ఆయనకు మాత్రమే పరిమితమైన ప్రేమకథ కాదు అనిపిస్తుంది. భౌగోళిక సరి హద్దులు, భాషాసంస్కృతులతో నిమిత్తం లేని అందరు ప్రేమికుల కథ అది. చదువు విజ్ఞానంగా కాకుండా మూడు పువ్వులు ఆరుకాయల వ్యాపారంగా మారుతున్న వర్తమాన దృశ్యం, తల్లిదండ్రుల తీయటి ఆశలు, ప్రై‘వేటు’ కోచింగ్ సెంటర్ల దోపిడీ ‘రెవల్యూషన్ 2020’ నవలలో కనిపిస్తాయి. ‘హాఫ్-గర్ల్‌ఫ్రెండ్’ నవలలో మధ్యతరగతి ప్రపంచం పలకరిస్తుంది. చేతన్ పుస్తకం ఏది తీసుకున్నా అందులోని పాత్రలు, పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కనెక్ట్ కావడం అంటే ఇదే కదా! అయితే సీరియస్ సాహిత్య ప్రపంచం ‘బెస్ట్ సెల్లింగ్ ఆథర్’ అయిన చేతన్‌ను రచయితగానే గుర్తించలేదు. ‘ఫాస్ట్‌ఫుడ్ రచనలు చేస్తాడు’ అన్నారు. ‘మాస్ స్టఫ్ మాత్రమే రాయగలడు. అతడు రాసే ఇంగ్లిష్‌లో బోలెడు గ్రామర్ మిస్టేక్స్’ అని, ‘రాసిందే రాస్తున్నాడు. కొత్తగా ఏమీ రాయడం లేదు’ అని అంటూనే ఉన్నారు. అయినా అతని పుస్తకాలను ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. ‘అవి క్లాసిక్సా?’ అంటే... ‘కానే కాదు... జస్ట్ కనెక్టయ్యారంతే’ అని చేతనే అంటాడు! రచయితగా చేతన్ విజయానికి కీలక బలం సరళ వచనం. ఎప్పుడూ పుస్తకం ముట్టని మనిషి కూడా అతడి పుస్తకాలు గబగబా చదివేయగలడు. ‘ఇంగ్లిష్ పుస్తకాలు చదవడమంటే నాకు భయం. అవి ఒక పట్టాన అర్థం కావు’ అని దూరంగా పారిపోయే కుర్రాళ్లు కూడా ‘సింపుల్ బుక్ ఇన్ ఇంగ్లిష్’ అంటూ స్వీట్ తిన్నంత ఇష్టంగా చేతన్ పుస్తకాలు చదవగలరు. ఫిక్షన్ మాత్రమే కాదు...‘వాట్ యంగ్ ఇండియా వాంట్స్’ పేరుతో వచ్చిన పుస్తకంతో ‘నేను నాన్ఫిక్షన్ రచయితను కూడా సుమా!’ అని నిరూపించాడు చేతన్ భగత్. అందుకే ఆయన చాలా మంది మెచ్చిన రచయిత అయ్యాడు! -
'వంకరచూపులపై వేటు వేయండి'
ముంబై: అశ్లీల వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాన్ని సెలబ్రిటీలు తప్పుబట్టారు. ఈ చర్య సమర్థనీయం కాదని కుండబద్దలు కొట్టారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. Maybe soon, we can expect #Twitter ban, #Facebook ban, #YouTube ban.. Will be back to reading books.. Oh no! They may be banned too — Minissha Lamba (@Minissha_Lamba) August 3, 2015 ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ చూడడంపై కూడా త్వరలో నిషేధం విధిస్తారేమోనని బాలీవుడ్ నటి మినీషా లంబా అనుమానం వ్యక్తం చేసింది. వీటిని నిషేధిస్తే పుస్తకాలు చదువుకోవచ్చు అనుకుంటున్నారా. పుస్తకాలు చదవడంపై కూడా నిషేధం విధిస్తారేమోనని ట్వీట్ చేసింది. Don't ban porn. Ban men ogling, leering, brushing past, groping, molesting, abusing, humiliating and raping women. Ban non-consent. Not sex. — Chetan Bhagat (@chetan_bhagat) August 3, 2015 పోర్న్ సైట్లపై నిషేధం వద్దని ప్రముఖ రచయిత చేతన్ భగత్ కోరారు. వక్రదృష్టి, వంకరచూపులు, కంత్రీతనం, కామాతురత, వేధింపులు, లైంగిక హింస, అణచివేత, అత్యాచారాలను బాన్ చేయాలని డిమాండ్ చేశారు. నీలి చిత్రాల సైట్లపై నిషేధంతో లైంగిక హింస నేరాలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది తెలియడం లేదని నటుడు ఉదయ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ అన్నారు. నిషేధం విధించిన పార్టీకి చెందిన వారే పార్లమెంట్ లో పోర్న్ సైట్లు చూస్తూ దొరికిపోయారని తెలిపారు. మూర్ఖులపై నిషేధం విధించాలని సోనమ్ కపూర్ కోరింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్లు సంధించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఆపేసినట్టుగా కేంద్ర ప్రభుత్వ చర్య ఉందని వర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే పోర్న్ సైట్లను మాత్రమే నిషేధించారు. త్వరలో ప్రభుత్వం పడకగదిలోకి ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. Now they have just banned porn but very soon the Government might come into the bedroom to see how couples are having sex — Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2015 -
నేడు వరల్డ్ మెన్స్ డే
చక్కదనాల చుక్కడు.. వంపుసొంపుల వయ్యారుడు.. ఈ వర్ణన వింటుంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేవాళ్లున్నారా? అయితే వాళ్లకు సిటీ మగాళ్ల తీరుతెన్నులపై అవగాహన రాలేదన్నమాట. ఆకాశంలో సగమేలే అని బుజ్జగిస్తూ అంతా ఆక్రమించే దిశగా మహిళ దూసుకొస్తుంటే.. మేమేం తక్కువ తినలేదంటూ మహిళలకే ప్రత్యేకమైన అనేకానేక విషయాల్లో మగవాళ్లు చొచ్చుకుపోతున్నారు. అందులో బ్యూటీ కాన్షియస్నెస్ ఒకటి. సిసలైన భర్త.. కోడలు ఆఫీస్‌కి వెళ్లడానికి హడావిడి పడుతుండడం చూసి కొడుకుతో అంటాడు తండ్రి ‘నీకు ప్రమోషన్ వచ్చాక కూడా కోడలు ఆఫీస్‌కి వెళ్లి కష్టపడడం అవసరమా’ అని. ‘నాన్నా.. డబ్బు కోసం కాదు తన ఆనందం కోసం వర్క్ చేస్తుంది’ అని భార్యను సమర్థిస్తాడు భర్త. ఇదంతా గదిలోంచి వింటున్న కోడలు పెళ్లికి ముందు తను పంపిన ఈ మెయిల్లో పెళ్లి తర్వాత కూడా నేను వర్క్ చేస్తాను అని తెలిపిన తన అభిప్రాయానికి భర్త ఇస్తున్న విలువ, గౌరవం చూసి చలించిపోతుంది. దీనికి ప్రముఖ రచయిత చేతన్‌భగత్ పర్ఫెక్ట్ మోడల్. చేతన్‌భగత్ భార్య అనూష అహ్మదాబాద్ ఐఐఎమ్ పట్టభద్రురాలు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది. బయట పనితోపాటు ఇంటిపనినీ బ్యాలెన్స్ చేసుకునే వీలు, సమయమూ లేని ఉద్యోగం ఆమెది. రచనా వ్యాసంగం మీద మక్కువతో జాబ్ వదిలేసిన చేతన్‌భగత్.. భార్య చూసుకోలేని ఇంటి బాధ్యతను తీసుకున్నాడు. అర్థం చేసుకునే అనుబంధానికి ఇంతకు మించిన నిర్వచనం ఏదీ? -
మార్కెట్లోకి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
సాక్షి, బెంగళూరు : బెంగళూరు పుస్తక ప్రియుల్ని అలరించేందుకు ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం రాత్రి నగర ప్రవేశం చేసింది. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రచించిన ఈ పుస్తకం కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే..! వారి నిరీక్షణకు తెరదించుతూ పుస్తక రచయిత చేతన్ భగత్ చేతుల మీదుగా నగరంలోని కోరమంగళలోని ఫోరం మాల్లో ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పుస్తక సారాంశాన్ని క్లుప్తంగా ఆయన వివరించారు. బీహారీ బాలుడు మాధవ్, ఢిల్లీలోని ధనిక కుటుంబానికి చెందిన బాలిక రియా ప్రేమలో పడటం, ఆ ప్రేమ బంధాన్ని కొనసాగించలేని రియా చివరకు మాధవ్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు రాజీపడుతుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో వ్యక్తుల మధ్య నెలకున్న సంబంధాల్లో స్వల్ప వ్యత్యాసాన్ని హృద్యంగా పుస్తకీకరించారు. అందుకే ఈ పుస్తకానికి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా టైటిల్ పెట్టినట్టు ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా చేతన్ భగత్ పుస్తకాలు, అందులోని అంశాలపై పోటీలు నిర్వహించారు. అక్కడే సుమారు 200 మంది కొనుగోలుదారులకు చేతన్ భగత్ స్వయంగా సంతకం చేసిన పుస్తకాల్ని అందించారు. -
కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!
చేతన్ భగత్ నవల ఆధారంగా త్వరలోనే సినిమా తెరకెక్కనుంది. ఈ నవల బుధవారం విడుదల కానుంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ కీర్తి సనాన్కు దక్కనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర ఆలియా భట్ ధరించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ పాత్ర కీర్తి సనాన్కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘హీరోపత్ని’ విడుదల తర్వాత కీర్తికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. -
ఇరవైల్లో ఉన్నారా? ఇది చదవండి....
- చేతన్ భగత్, రచయిత భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నానో ఒక పట్టాన తేల్చుకోలేకపోయేవాడిని. ఇరవై ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉంటాయి. దేని మీదా మనసు స్థిరంగా నిలవదు. మీరు అలా కాకుండా ఒక నిర్ణయానికి రండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రచయిత కావచ్చు. లక్ష్యం విషయంలో మీకు స్పష్టత ఉంటే, దానికి చేరువ కావడం కష్టమేమీ కాదు. ఇరవైల్లో ఉన్నవాళ్లు ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోరు. ఆ వయసులో ఆ ఆలోచనేదీ రాదు. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి విలువ ఏమిటో తెలుస్తుంది. మరి అదేదో ముందే జాగ్రత్త పడితే మంచిది కదా! ఆరోగ్యస్పృహతో ఆరోగ్యకరమైన తిండి తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముప్ఫయ్యో ఏట గాని నేను నా ఆరోగ్యం పై దృష్టి పెట్టలేకపోయాను. మనం ఆరోగ్యంగా ఉంటేనే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ సమాజంలో ఏదీ సవ్యంగా జరగడం లేదు. అంతమాత్రాన ఎప్పుడూ కోపంతో మండిపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికీ కళ్లెర్ర చేసి గుండెల్లో రక్తం వేగాన్ని పెంచుకోవాల్సిన పనిలేదు. మనం ఆగ్రహంగా ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కోపానికి దూరంగా జరగండి. ప్రశాంతంగా ఉండండి. ఇరవై సంవత్సరాల వయసులో మనం వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతాం. చదువులో నిండా మునిగిపోయి స్నేహితులను మరచిపోతాం. అలా ఎప్పుడూ జరగనివ్వకూడదు. ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్‌తో సహా నిన్న మొన్నటి ఫ్రెండ్స్ వరకు అందరితో టచ్‌లో ఉండండి. స్నేహంలోని మాధుర్యాన్ని అనుభవించండి. కలుసుకొనలేనంత దూరంలో ఉంటే ఫేస్బుక్ ద్వారానైనా టచ్‌లో ఉండండి. పెద్దగా మీ దగ్గర డబ్బు ఉండదనే విషయం తెలుసు. అయితే తక్కువ డబ్బుతో కూడా ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల ద్వారా మన మానసిక పరిధి విస్తరిస్తుంది. ఒక్కసారి భద్రమైన జీవితం (కంఫర్ట్‌జోన్)నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడండి. పుస్తకాలు చదవడాన్ని మీ జీవన విధానంలో భాగంగా చేసుకోండి. పుస్తకాలు చదవడం వల్ల పరిపూర్ణ జీవితం పరిచయం అవుతుంది. మీ సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి బయటికి వచ్చి సాహిత్య వీధుల్లో తిరగాడండి. లేటుగా నిద్ర పోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తాం. ఇదొక సర్కిల్. కొందరు రాత్రంతా ఏదో పని చేస్తూ గడుపుతారు. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని గ్రహించాలి. ‘క్రమశిక్షణతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించకపోవచ్చు. కానీ అది మన అవసరం... వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి. {పేమ అనేది ఎంత ముఖ్యం? డబ్బు ఎంత ముఖ్యం? ఈ రెండింట్లో మీకు ఏది ముఖ్యం? దీని గురించి ఆలోచించండి. ఇరవై ఏళ్ల వయసులో మంచి చెడు గురించి పెద్దగా ఆలోచించం. మనకు తెలియకుండానే ఇతరులను మాటలతో గాయపరుస్తుంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? అనేదాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండండి. వేరేవాళ్ల హృదయాలను గాయపరచకండి. దయతో ప్రవర్తించండి. అసంతృప్తిని అవతలకు నెట్టి సంతృప్తిగా జీవించండి. ‘క్రమశిక్షతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించవకపోవచ్చు. కానీ అది మన అవసరం. వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి. -
బాలీవుడ్లో సుస్థిరస్థానం
ఆధునిక యువతకు చేతన్ భగత్ గురించి పరిచయం ఎంత మాత్రమూ అక్కర్లేదు. యువతకు వినోదం, విజ్ఞానం, ప్రేరణ కలిగించే ఎన్నో రచనలు ఆయన కలం నుంచి వచ్చాయి. అవే కథలూ వెండితెరపైకీ ప్రవేశిస్తున్నాయి. ఈ యువ రచయిత క్రమంగా బాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. ‘టూ స్టేట్స్ : స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్’ అనే చేతన్ నవలను 2 స్టేట్స్ సినిమాగా తీసి విడుదల చేయగా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ‘నా పాఠకుల నిశ్శబ్ద మద్దతే నాకు అతిపెద్ద బలం. ఈ రోజు అది దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. 2 స్టేట్స్ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇది యువతనే కాదు పెద్దవారినీ ఆకట్టుకుంటోంది’ అని ఆయన అన్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక, వారి జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. విశేషమేమిటంటే తన సొంత ప్రేమ కథనే చేతన్ నవలగా మలిచి విజయం సాధించాడు. ఉత్తరాదికి చెందిన ఈ రచయిత తమిళనాడు యువతిని పెళ్లి చేసుకున్నాడు. విడుదలైన తొలిరోజే 2 స్టేట్స్ రూ.12 కోట్లు వసూళ్లు చేసి సూపర్‌హిట్‌గా నిలిచింది. అర్జున్ కపూర్, ఆలియా భట్ ఇందులో భార్యాభర్తలుగా నటించారు. సినిమాగా తీయకముందే 2 స్టేట్స్ను చదివి ఈ పుస్తకానికి అభిమానిగా మారిపోయానని ఆలియా చెప్పింది. ఇక అర్జున్ తల్లి మోనా శౌరీ బతికి ఉన్నప్పుడే ఈ పుస్తకం ఆమె బీరువాలో ఉండేదట. అంతేకాదు అమితాబ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 2 స్టేట్స్ కథ, సంగీతం, నటన అన్నీ బాగా కుదిరాయని బిగ్ బీ అన్నారు. సమకాలీన రచయితల్లో చేతన్‌కు సాటి రాగలవాళ్లు ఎవరూ లేరని వివేక్ ఒబెరాయ్ ట్విటర్లో రాశాడు. చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్‌వన్ (3 ఇడియెట్స్), ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ (కో యీ పొచే), వన్ నైట్ ఎట్ ది కాల్ సెంటర్ (హెల్లో) నవలను కూడా సినిమాలుగా తీశారు.