ఆధునిక యువతకు చేతన్ భగత్ గురించి పరిచయం ఎంత మాత్రమూ అక్కర్లేదు. యువతకు వినోదం, విజ్ఞానం, ప్రేరణ కలిగించే ఎన్నో రచనలు ఆయన కలం నుంచి వచ్చాయి. అవే కథలూ వెండితెరపైకీ ప్రవేశిస్తున్నాయి. ఈ యువ రచయిత క్రమంగా బాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. ‘టూ స్టేట్స్ : స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్’ అనే చేతన్ నవలను 2 స్టేట్స్ సినిమాగా తీసి విడుదల చేయగా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ‘నా పాఠకుల నిశ్శబ్ద మద్దతే నాకు అతిపెద్ద బలం. ఈ రోజు అది దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. 2 స్టేట్స్ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇది యువతనే కాదు పెద్దవారినీ ఆకట్టుకుంటోంది’ అని ఆయన అన్నారు.
వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక, వారి జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. విశేషమేమిటంటే తన సొంత ప్రేమ కథనే చేతన్ నవలగా మలిచి విజయం సాధించాడు. ఉత్తరాదికి చెందిన ఈ రచయిత తమిళనాడు యువతిని పెళ్లి చేసుకున్నాడు. విడుదలైన తొలిరోజే 2 స్టేట్స్ రూ.12 కోట్లు వసూళ్లు చేసి సూపర్‌హిట్‌గా నిలిచింది. అర్జున్ కపూర్, ఆలియా భట్ ఇందులో భార్యాభర్తలుగా నటించారు. సినిమాగా తీయకముందే 2 స్టేట్స్‌ను చదివి ఈ పుస్తకానికి అభిమానిగా మారిపోయానని ఆలియా చెప్పింది.
ఇక అర్జున్ తల్లి మోనా శౌరీ బతికి ఉన్నప్పుడే ఈ పుస్తకం ఆమె బీరువాలో ఉండేదట. అంతేకాదు అమితాబ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 2 స్టేట్స్ కథ, సంగీతం, నటన అన్నీ బాగా కుదిరాయని బిగ్ బీ అన్నారు. సమకాలీన రచయితల్లో చేతన్‌కు సాటి రాగలవాళ్లు ఎవరూ లేరని వివేక్ ఒబెరాయ్ ట్విటర్‌లో రాశాడు. చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్‌వన్ (3 ఇడియెట్స్), ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ (కో యీ పొచే), వన్ నైట్ ఎట్ ది కాల్ సెంటర్ (హెల్లో) నవలను కూడా సినిమాలుగా తీశారు.
బాలీవుడ్‌లో సుస్థిరస్థానం
Published Mon, Apr 21 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement