పాకిస్తాన్ పేరు 'టెర్రరిస్తాన్'..
పాకిస్తాన్ పేరు 'టెర్రరిస్తాన్'..
Published Sat, Sep 24 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీరీ అంశంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రముఖులు నవాజ్ షరీఫ్ విష ప్రచారాన్ని ఎండగడుతున్నారు. పాకిస్తాన్ పేరును టెర్రరిస్తాన్గా మార్చాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ డిమాండ్ చేశారు. భారత్తో పాటు ప్రపంచమంతా కలిసి పాకిస్తాన్కు పేరు మార్చాలని, పాక్కు కొత్త పేరుగా టెర్రరిస్తాన్ పెట్టాలన్నారు. నగరాలకు, రోడ్లకు పేరు మారుస్తారు..కానీ పాక్కు ఎందుకు పేరు మార్చడం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ విమర్శలపై కశ్మీరీ రాజకీయ నాయకులు స్పందించకుండా జాగ్రత్తపడుతున్నారని, ఇలా చేస్తూ ఇండియన్ ఆర్మీ తమల్ని రక్షించాలని ఎలా ఆశిస్తామని ట్వీట్ చేశారు.
ఉరిలో 18 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు బలిగొన్న ఘటన అనంతరం నవాజ్ షరీఫ్ యూఎన్లో ప్రసంగించారు.హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా కీర్తిస్తూ.. కశ్మీర్ స్వాతంత్య్రం కోరుతున్న యువతను భారత ఆర్మీ చంపేస్తోందని షరీప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో బాధిత ప్రజలు, మృతుల బంధువులు ప్రతిచర్యకు పాల్పడి ఉంటారని దాని ఫలితంగా ఉరీ దాడి జరిగి ఉంటుందని షరీఫ్ అన్నారు. ఆధారాలు లేకుండానే భారత్ తమ దేశంపై ఆరోపణలు చేస్తోందన్నారు. షరీఫ్ చేసిన ఈ కామెంట్లపై భగత్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Advertisement