కొత్త నోట్ల సైజ్ ఎందుకు పెంచారు?
పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నటుడు అర్షద్ వార్సీ వంటివారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ట్విట్టర్‌లో కామెంట్స్ పెట్టారు. తాజాగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా ఈ విషయంలో మోదీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. "పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్నదే కావొచ్చు కానీ, దానిని సరిగ్గా అమలుచేయకపోవడం, ఏటీఎంలు ఖాళీగా ఉండటం సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది' అని ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా కొత్తగా జారీచేసిన నోట్లు ఏటీఎంలలో డ్రా చేసుకునేవిధంగా లేకపోవడంపైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.
‘ప్రస్తుతమున్న ఏటీఎంలలో ఉపయోగపడనివిధంగా కొత్త నోట్ల సైజ్‌ను ఎందుకో మార్చారో అర్థం కావడం లేదు. ఇలాంటి రహస్య నిర్నయాలు తీసుకున్నప్పుడు ఏటీఎంలను మార్చడం ఎంతమాత్రం కుదరదు’ అని చేతన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వానికి రాజకీయంగా వ్యతిరేకత రావడానికి కారణం కావడం బాధాకరమని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.