చేతన్ భగత్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : భారత్‌లో రాజుకున్న మీటూ ఉద్యమం పెద్ద పెద్ద వారి బండారాలను బయటికి తీస్తోంది. రచయితలుగా, జర్నలిస్ట్‌లుగా సమాజంలో మంచి పేరును సంపాదించున్న ప్రముఖులు సైతం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. యువ రచయితలకు ఆదర్శంగా ఉండే చేతన్ భగత్ సైతం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యకరంగా మెసేజ్‌లు చేసినా, ఫ్లర్ట్ చేసినా సంభాషణలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ స్క్రీన్‌షాట్లు బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే చేతన్ భగత్ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మెసేజ్‌లు కూడా వైరల్‌గా మారాయి. దీంతో చేతన్ భగత్ తను చేసిన తప్పును ఒప్పుకుని, ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.
మహిళా జర్నలిస్ట్ ట్విటర్‌లో షేర్ చేసిన స్క్రీన్‌షాట్లలో, చేతన్ భగత్ ఆమెను లైంగికంగా ఆకర్షించడానికి ప్రయత్నించాడు. మీరు స్వీట్, క్యూట్, ఫన్నీ అంటూ పలు మెసేజ్‌లు కూడా పెట్టాడు. వాట్సాప్‌లో తనకు చేసిన మెసేజ్‌లన్నింటిన్నీ మహిళా జర్నలిస్ట్ బయటపెట్టారు. దీంతో తాను తప్పుచేసినట్టు ఒప్పుకున్న చేతన్, ఆమెకు క్షమాపణ చెప్పాడు. ‘మొదట నేను మీకు క్షమాపణ చెబుతున్నా. ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్నవన్నీ నిజమే. ఐ యామ్ సారీ, మీరు నా క్షమాపణను అంగీకరిస్తారని భావిస్తున్నా’ అని రాశారు. అంతేకాక తన భార్య అనూషను మోసం చేయాలని అనుకున్నందుకు ఆమెకు కూడా క్షమాపణ చెబుతున్నట్టు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
తనుశ్రీ-నానా పటేకర్ వివాదంతో భారత్‌లో మీటూ ఉద్యమం రాజుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా మహిళా జర్నలిస్ట్‌లు తాము పని ప్రదేశాల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు బయటపెడుతున్నారు. పలువురు ప్రముఖ జర్నలిస్ట్‌లు, రచయితలు తోటి మహిళలతో ఇలా ప్రవర్తించారని వెలుగులోకి రావడం మరింత కలకలం సృష్టిస్తోంది. కొందరు ప్రముఖలు తాము లైంగిక వేధింపులకు పాల్పడ్డామని ఒప్పుకుంటూ.. ట్విటర్ వేదికగా క్షమాపణ చెబుతున్నారు. ఈ కోవలోనే చేతన్ భగత్, తన తప్పును ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment